• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: దుబాయ్ లో భర్త, ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో భార్య జల్సా, ఒకేసారి ముగ్గుర్ని, కిలాడీ లేడీ

|

చెన్నై/ తిరుపత్తూర్/ దుబాయ్: డబ్బు సంపాధించి పేదరికంలో నుంచి బయటపడాలని భర్త దుబాయ్ కి వెళ్లి ఉద్యోగం చేశాడు. భార్య, పిల్లలతో రోజూ వీడియో కాల్ లో మాట్లాడాలని ఆశతో భర్త భార్యకు స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. దుబాయ్ లో భర్త ఉండటంతో ఇంట్లో ఉంటున్న భార్య ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువకులతో, టిక్ టాక్ వీడియోలు చేస్తూ వారితో పరిచయం పెంచుకుని అనేక మందితో అక్రమ సంబంధాలు సాగించింది. దుబాయ్ నుంచి ఇంటికి చేరుకున్న భర్త నాలుగు నెలల పాటు భర్త భాగోతం గమనించి గట్టిగా మందలించాడు. తన భర్త, పిల్లలు తన తిరుగుడుకు అడ్డుపడుతున్నారని, వీరు బతికున్నంత కాలం తన జల్సాలకు అవకాశం ఉండదని భావించిన భార్య ముగ్గురి మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసింది.

Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

 12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని తిరుపత్తూరు నట్రంపల్లి సమీపంలోని సోమనాయనపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న శశికుమార్ (40)తో 12 ఏళ్ల క్రితం ప్రియా (35) వివాహం జరిగింది. శశికుమార్, ప్రియా దంపతులకు 9 సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు, 7 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత శశికుమార్, ప్రియా దంపతులు సంతోషంగానే ఉన్నారు.

దుబాయ్ లో భర్తకు ఉద్యోగం

దుబాయ్ లో భర్తకు ఉద్యోగం

వివాహం జరిగినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ చిన్నచిన్న పనులు చేసిన శశికుమార్ భార్య ప్రియాతో పాటు ఇద్దరు పిల్లను సంతోషంగా చూసుకున్నాడు. డబ్బు బాగా సంపాధించి పేదరికం నుంచి బయటపడి భార్య, పిల్లలతో సంతోషంగా గడపాలని నిర్ణయించిన శశికుమార్ దుబాయ్ లో ఓ ఉద్యోగం వెతుకున్నాడు. అతి కష్టం మీద శశికుమార్ మూడు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు.

 ప్రియాకు ఖరీదైన స్మార్ట్ ఫోన్

ప్రియాకు ఖరీదైన స్మార్ట్ ఫోన్


దుబాయ్ వెళ్లిపోయిన శశికుమార్ సొంతఊర్లో ఉంటున్న భార్య ప్రియా, ఇద్దరు పిల్లలతో ప్రతిరోజూ వీడియో కాల్ లో మాట్లాడలనే ఉద్దేశంతో ఓ స్మార్ట్ ఫోన్ తీసి భార్య ప్రియాకు పంపించాడు. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తరువాత ప్రియా నడవడికలో చాలా తేడాలు వచ్చాయి. అయితే ప్రతిరోజూ దుబాయ్ లో ఉంటున్న భర్త శశికుమార్ కు ఎలాంటి అనుమానం రాకుండా ప్రియా మాట్లాడేది.

ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో అక్రమ సంబధాలు

ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో అక్రమ సంబధాలు

ఫేస్ బుక్ లో కొంత మంది ప్రియాకు పరిచయం అయ్యారు. ఇదే సమయంలో ఇంట్లో అడిగే దిక్కులేదని ప్రియా టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టిక్ టాక్ వీడియోలతో, ఫేస్ బుక్ లో పరిచయం అయిన కొంతమందితో ప్రియా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి ప్రియులతో ఎంజాయ్ చేస్తూ వస్తున్న ప్రియా కొంతకాలం తరువాత వారిని ఇంటికే పిలిపించుకోవడం మొదలు పెట్టంది.

కొడుకు షాక్.... డాడీ ఇంట్లో ఏం జరుగుతుందంటే ?

కొడుకు షాక్.... డాడీ ఇంట్లో ఏం జరుగుతుందంటే ?


కొంతకాలం నుంచి తన తల్లి వేరే వ్యక్తులను ఇంటికి పిలుచుకుని వచ్చి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తోందని గమనించిన కొడుకు దుబాయ్ లో ఉంటున్న తండ్రి శశికుమార్ కు ఫోన్ లో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పేవాడు. డబ్బు తరువాత సంపాధించుకుందాం, నా కొంప మునిగేటట్లు ఉందని భయపడిన శశికుమార్ దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చేశాడు.

 నాలుగు నెలల్లో హడల్

నాలుగు నెలల్లో హడల్


భార్య ప్రియా మీద అనుమానంతో నాలుగు నెలల నుంచి ఇంటి దగ్గరే ఎక్కువ సమయం ఉంటున్న శశికుమార్ భార్య ప్రియాను బయటకు వెళ్లనివ్వకుండా చేశాడు. మొబైల్ ఫోన్ లో ఫేస్ బుక్, టిక్ టాక్ ఫ్రెండ్స్ తో ప్రియాకు టచ్ లోకి రాకుండా చేశాడు. నువ్వు బుద్దిగా ఉండాలని భార్య ప్రియాను భర్త శశికుమార్ హెచ్చరించాడు. తన భర్త శశికుమార్, తన విషయాలు అతనికి చెప్పిన ఇద్దరు పిల్లలు బతికుంటే తన ఆటలకు అడ్డుపడుతారని ప్రియా రగిలిపోయింది. ఎలాగైనా భర్త శశికుమార్, ఇద్దరు పిల్లలను చంపేయాలని భార్య ప్రియా 5 లీటర్ల పెట్రోల్ తీసుకు వచ్చి ఇంట్లో పెట్టంది. ఇంట్లో పెట్రోల్ ఉన్న విషయం గమనించిన భర్త శశికుమార్ ఎక్కడ తాను మందలిస్తే భార్య ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి కొన్ని రోజుల నుంచి మౌనంగా ఉన్నాడు.

  Odisha Artist Carves Portrait Of PM Modi On tree To Send An 'Important' Message | Oneindia Telugu
  భర్త సజీవదహనం, పిల్లల పరిస్థితి

  భర్త సజీవదహనం, పిల్లల పరిస్థితి


  రాత్రి గాఢనిద్రలో ఉన్న భర్త శశికుమార్, ఇద్దరు పిల్లల మీద పెట్రోల్ పోసిన ప్రియా నిప్పంటించింది, బైక్ కోసం తీసుకు వచ్చిన పెట్రోల్ కు మా ఇంట్లో మంటలు వ్యాపించి భర్త, ఇద్దరు పిల్లలు కాలిపోయారని భార్య ప్రియా నాటకాలు ఆడింది. శశికుమార్, పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో భర్త శశికుమార్ నా భార్య ప్రియా మాకు నిప్పంటించిందని తిరుపత్తూరు కోర్టు న్యాయమూర్తి, పోలీసులకు చెప్పి ప్రాణాలు వదిలాడు. భర్త, ఇద్దరు పిల్లలకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

  English summary
  Illegal affair: Wife killed husband near Tirupattur in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X