• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: బెడ్ రూమ్ లో భార్య+బాయ్ ఫ్రెండ్, టెర్రాస్ లో లిక్కర్+ విషంతో భర్త, క్లైమాక్స్!

|

చెన్నై/ మదురై/ కల్లకురిచ్చి: భార్యతో చక్కగా కాపురం చేసుకుంటున్న సమయంలో భర్త జీవితంలోకి ఓ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. సొంతఊరిలోనే తనకు ఓ విలన్ తయారైనాడని ఆ భర్త ఆలస్యంగా తెలుసుకున్నాడు. అప్పటికే భార్య, ప్రియుడు చట్టాపట్టాలు వేసుకుని జల్సా చేస్తున్నారు. బెడ్ రూమ్ లో ప్రియుడితో ఏ మాత్రం సిగ్గుషరం లేకుండా భార్య ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. అప్పటి నుంచి భర్త టైమ్ చిక్కినప్పుడు భార్యను క్రమశిక్షణలో పెడుతూ చితకబాదుతూ వచ్చాడు. తన భర్త బతికుంటే తన కోరికలు తీరవని, నా ప్రియుడు నాకు దగ్గర కాలేడని తెలుసుకున్న భార్య విస్కీ+ విషం ఫార్ములాతో భర్తను బాల్కనీ టెర్రాస్ లో చాలా చకచక్యంగా చంపేసింది.

Illegal affair: కంపెనీ రెస్ట్ రూమ్ లో రెండో భార్య రొమాన్స్, భర్త ఎంట్రీతో సుత్తితో ఫినిష్, ఖర్మ !Illegal affair: కంపెనీ రెస్ట్ రూమ్ లో రెండో భార్య రొమాన్స్, భర్త ఎంట్రీతో సుత్తితో ఫినిష్, ఖర్మ !

 సుబ్బుది హ్యాపీలైఫ్

సుబ్బుది హ్యాపీలైఫ్


తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలోని తియకతురుగం సమీపంలోని వి, పాల్యంలో సుబ్రమణియన్ (42), సెల్వి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి భార్య సెల్వితో కలిసి సుబ్రమణియన్ చాలా సంతోషంగానే గడుపుతున్నాడు. భార్య సెల్విని సుబ్రమణియన్ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు.

ఊరిలోనే సుబ్బుకి విలన్

ఊరిలోనే సుబ్బుకి విలన్

సుబ్రమణియన్ నివాసం ఉంటున్న గ్రామంలోనే జయమురుగన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సుబ్రమణియన్ కు వరుసకు జయమురుగన్ దూరపు బంధువు అవుతాడు. సుబ్రమణియన్ ను పలకరించే ముసుగులో ఆయన ఇంటికి వెళ్లి వస్తున్న జయమురుగన్ టక్కులాడి సెల్వికి లైన్ వెయ్యడం మొదలుపెట్టాడు.

మాయదారి మందు మొగుడు

మాయదారి మందు మొగుడు

సుబ్రమణియన్ కు ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉంది. బయట ఫ్రెండ్స్ ఎవ్వరూ లేకుంటే ఇంటికే మద్యం తీసుకెలుతున్న సుబ్రమణియన్ ఇంటి బాల్కనీలో లేదా టెర్రాస్ మీద కుర్చుని రాత్రి పోద్దుపోయే వరకు మద్యం సేవించి బెడ్ రూమ్ లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. భర్త సుబ్రమణియన్ తీరుతో అతని భార్య సెల్వి విసిగిపోయింది.

లైన్ క్లియర్...... చించేశారు అంతే

లైన్ క్లియర్...... చించేశారు అంతే

మద్యం మత్తులో తనను సుఖపెట్టలేని భర్త సుబ్రమణియన్ తో విసిగిపోయిన అతని భార్య సెల్వి తనకు కొంతకాలంగా లైన్ వేస్తున్న జయమురుగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి భర్త సుబ్రమణియన్ లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న జయమురుగన్ సెల్వితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ పెళ్లి కాని లోటు తీర్చుకుంటున్నాడు.

 బెడ్ రూమ్ లో అడ్డంగా చిక్కిన భార్య

బెడ్ రూమ్ లో అడ్డంగా చిక్కిన భార్య

ఇటీవల పనిమీద ఊరికి వెళ్లిన భర్త సుబ్రమణియన్ రాత్రి ఇంటికి రాను అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు, భర్త రాడని తెలుసుకున్న సెల్వి ప్రియుడు జయమురుగన్ ను ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో పండగ చేసుకోవడం మొదలుపెట్టింది. అనుకోకుండా అర్దరాత్రి ఇంటికివెళ్లిన భర్త సుబ్రమణియన్ బెడ్ రూమ్ లో భార్య సెల్వి, ఆమె ప్రియుడిని చూడరాని సీన్ లో చూసి రగిలిపోయాడు.

 మొగుడి దెబ్బతో సెల్వికి చిత్రాన్నం

మొగుడి దెబ్బతో సెల్వికి చిత్రాన్నం

ప్రియుడితో అడ్డంగా చిక్కిపోయిన భార్య సెల్విని క్రమశిక్షణలో పెట్టాలని డిసైడ్ అయిన సుబ్రమణియన్ టైమ్ చిక్కినప్పుడు ఆమెను పట్టుకుని చితకబాదుతూ కంట్రోల్ లో పెట్టడానికి ప్రయత్నించాడు. తన భర్త సుబ్రమణియన్ బతికుంటే తన ప్రియుడు జయమురుగన్ తనకు దగ్గర కాడని, ఎలాగైనా తన భర్తను చంపేయాలని సెల్వి డిసైడ్ అయ్యింది. తన భర్తను చంపేద్దాం అని సెల్వి ప్రియుడు జయమురుగన్ కు చెప్పింది.

రాత్రి మొగుడు చేసిన తప్పు అదే

రాత్రి మొగుడు చేసిన తప్పు అదే

ఈనెల 17వ తేదీన రాత్రి ఇంటి టెర్రాస్ మీద సుబ్రమణియన్ బ్రాందీ ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి పొద్దుపోయే వరకు మద్యం సేవించాడు. మిగిలిన మద్యం అక్కడే వదిలేసి వెళ్లి భోజనం చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు మద్యాహ్నం టెర్రాస్ మీద ఉన్న మద్యం సేవించిన సుబ్రమణియన్ వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. వెంటనే సుబ్రమణియన్ ను ఆసుపత్రికి తరలించడా అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

కిలాడీ భార్య లిక్కర్+ విషం స్కెచ్

కిలాడీ భార్య లిక్కర్+ విషం స్కెచ్

తన సోదురుడిని ఎవరో చంపేశారని, మాకు చాలా అనుమానాలు ఉన్నాయని సుబ్రమణియణ్ సోదరి ఇందిరా పోలీసు కేసు పెట్టింది. పోస్టుమార్టం నివేదికలో సుబ్రమణియన్ విషం కలిపిన మద్యం సేవించడం వలనే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. సుబ్రమణియన్ సోదరి ఇందిరా ఫిర్యాదు మేరకు ఆమె వదిన సెల్విని పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన ప్రియుడు జయమురుగన్ దగ్గర విషం బాటిల్ తెప్పించుకుని తానే బ్రాందీ బాటిల్ లో కలిపేశానని, ఆ మద్యం సేవించి తన భర్త చనిపోయాడని సెల్వి అంగీకరించింది. సెల్వి, ఆమె ప్రియుడు జయమురుగన్ ను అరెస్టు చేసి జైలకు పంపించామని పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Wife killed husband with boyfriend: Murder mystery solved near Kallakurichi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X