• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియుడు సంతోషంగా ఉండాలని భర్తను చంపించింది, కామంతో, సింపుల్ లాజిక్ !

|

చెన్నై/ మదురై/ తేని: వివాహం జరిగి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న భార్య కామంతో రగిలిపోయింది. భార్య, పిల్లలను పోషించడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్లిన భర్త అక్కడ డాబాలో వంట మాస్టర్ గా పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్నాడు. భర్త ఎక్కడో ఉండటంతో తన కామకోరికలు తీర్చుకోవడానికి భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను, తన ప్రియుడి సంతోషానికి భర్త అడ్డు వస్తున్నాడని రగిలిపోయిన భార్య పక్కా స్కెచ్ వేసి ప్రియుడితో కలిసి భర్తను దారుణం చంపేసి శవాన్ని తీసుకెళ్లి బావిలో విసిరేసింది. భార్య భాగోతం తెలుసుకున్న పోలీసులు నాలుగు పీకితే అసలు విషయం బయటకు వచ్చింది.

13 years love: పెళ్లికి మూడు గంటల ముందు ప్రియుడు ఎస్కేప్, వేరే అమ్మాయితో, కంత్రీగాడు !13 years love: పెళ్లికి మూడు గంటల ముందు ప్రియుడు ఎస్కేప్, వేరే అమ్మాయితో, కంత్రీగాడు !

భార్య, భర్త వయసులో చాలా తేడా

భార్య, భర్త వయసులో చాలా తేడా

తమిళనాడులోని తేని జిల్లా కడమలైకండు సమీపంలోని మేలిపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న ముత్తుకలైవర్ (42) అనే వ్యక్తికి కలయరసి (29) అనే మహిళతో వివాహం జరిగింది. తనకంటే వయసులో 13 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో తన పెళ్లి జరిపించారని కలయరసి ఆమె కుటుంబ సభ్యులపై ఇప్పటికీ గొడవపడుతూనే ఉంది. ముత్తుకలైవర్, కలయరసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 కేరళలో పొరోటాలు చేస్తున్న భర్త

కేరళలో పొరోటాలు చేస్తున్న భర్త

భార్య కలయరసి, ఇద్దరు కుమార్తెలను సొంతఊర్లో వదిలిపెట్టిన భర్త ముత్తు కేరళ వెళ్లి అక్కడ ఓ డాబాలో కుక్ (వంట మనిషి)గా పని చేస్తూ డబ్బులు సంపాధిస్తూ నెలకు ఒక్కసారి సొంత ఊరికి వచ్చి భార్యకు డబ్బులు ఇచ్చి రెండుమూడు రోజులు ఉండి వెలుతున్నాడు. సొంతఊర్లో తాను ఉన్నా, లేకున్నా తన కుటుంబ సభ్యులు, బంధువులు తన భార్య, పిల్లలను చూసుకుంటారని ముత్తు భావించాడు.

కామంతో రగిలిపోయిన భార్య

కామంతో రగిలిపోయిన భార్య


భర్త ముత్తు కేరళలో ఉండటంతో వయసులో ఉన్న భార్య కలయరసి కామంతో రగిలిపోయింది. ఇదే సమయంలో సొంతగ్రామంలో నివాసం ఉంటున్న సేతుపతి అనే యువకుడిని వలలో వేసుకున్న కలయరసి అతనితో ఎంజాయ్ చేస్తోంది. కలయరసి, సేతుపతి వ్యవహారం ఊరు మొత్తం తెలిసిపోవడంతో ముత్తు, అతని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.

ప్రియుడితో భార్య ఎస్కేప్

ప్రియుడితో భార్య ఎస్కేప్

నేను నీతో కాపురం చెయ్యలేనని భర్త ముత్తుకు తేల్చి చెప్పిన భార్య కలయరసి ప్రియుడు సేతుపతితో కలిసి గ్రామం వదిలి తేని సమీపంలోని ధర్మపురం అని ఊరిలో కాపురం పెట్టింది. విషయం తెలుసుకున్న ముత్తు భార్య కలయరసి నివాసం ఉంటున్న ధర్మపురికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.

నాకేం తెలుసు... నాకేం సంబంధం ?

నాకేం తెలుసు... నాకేం సంబంధం ?

భార్యతో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్లిన ముత్తు తరువాత కనపడకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ముత్తు సోదరుడు ఈశ్వరన్ ధర్మపురికి వెళ్లి తన అన్న ఎక్కడ అంటూ వదిన కలయరసిని నిలదీశాడు. తనతో గొడవపడిన ముత్తు తరువాత వెళ్లిపోయాడని కలయరసి సమాధానం ఇచ్చింది. ముత్తు సోదరుడు ఈశ్వరన్ కు అనుమానం రావడంతో నేరుగా వెళ్లి వీరపాండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తు కోసం గాలించారు.

ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ తో భర్తను చంపేసింది

ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ తో భర్తను చంపేసింది

ధర్యపురి- కామాక్షిపురం జాతీయ రహదారిలోని ఓబావిలో ముత్తు శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కలయరసిని అదుపులోకి తీసుకుని నాలుగు పీకడంతో ఆమె అసలు విషయం బయటకు చెప్పింది. తన సంతోషానికి భర్త ముత్తు అడ్డుగా ఉన్నాడని, అతన్ని చంపేయాలని తన ప్రియుడు సేతుపతి డిసైడ్ అయ్యామని కలయరసి అంగీకరించింది. రాత్రి బైక్ లో కలిసి ముత్తు, నేను చిన్నమనూరుకు బయలుదేరామని, మూత్ర విసర్జన చెయ్యాలని బావి సమీపంలో బైక్ నిలపమని చెప్పినప్పుడు వెనుక నుంచి సేతుపతి, అతని స్నేహితుడు గణేశన్ వచ్చి ఇనుప రాడ్ తో ముత్తుపై దాడి చేసి చంపేసి శవాన్ని తీసుకెళ్లి బావిలో విసిరేశామని కలయరసి అంగీకరించింది. భార్య కలయరసి, ఆమె ప్రియుడు సేతుపతి, అతని స్నేహితుడు గణేశన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Illegal affair: Wife murdered Husband due to illegal relationship issue near Theni in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X