Illegal affair: భర్త అదోటైపు, ప్రియుడి మోజులో భార్య, మొగుడిని చంపేసి శవం మీద అరటి చెట్టునాటింది, క్లైమాక్స్!
చెన్నై/ కడలూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం, వ్యవసాయం చేస్తున్న భర్త అతని భార్యతో గొడవలు పడుతున్నాడు. భార్యతో గొడవపడుతున్న భర్త ఆతని భార్య మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి నెల, రెండు నెలలు, మూడు నెలలు ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెళ్లేవాడు. నిత్యం భార్యతో గొడవపడి నెలల తరబడి బయటఊర్లకు వెళ్లిపోతున్న భర్త విషయం అతని కుటుంబ సభ్యులతో పాటు ఊరందరికి తెలుసు.
గత ఏడాది భార్యతో గొడవపడిన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి మాయం అయ్యాడు. భర్త కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టారు. పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి తోటలో పూడ్చి పెట్టి శవం మీద అరటి చెట్టు నాటిపెట్టామని భార్య చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.

ఇద్దరు పిల్లలు
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని నడువీరపట్టు ప్రాంతంలో రాజశేఖర్ (47) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, కొన్ని సంవత్సరాల క్రితం పుదుకుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి (42) అనే మహిళను రాజశేఖర్ వివాహం చేసుకున్నాడు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న రాజశేఖర్, విజయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

భర్త అదోటైపు
రాజశేఖర్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారం, వ్యవసాయం చేస్తున్న రాజశేఖర్, విజయలక్ష్మి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య విజయలక్ష్మితో గొడవలు పడుతున్న రాజశేఖర్ అత్త మీద కోపం దుత్తమీద చూపించినట్లు ప్రవర్తించాడు. భార్య విజయలక్ష్మితో గొడవపడుతున్న రాజశేఖర్ ఆమె మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి నెల, రెండు నెలలు, మూడు నెలలు ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెళ్లేవాడు.

మామూలే అని పట్టించుకోవడం వదిలేశారు
నిత్యం భార్య విజయలక్ష్మితో గొడవపడి నెలల తరబడి బయటఊర్లకు వెళ్లిపోతున్న రాజశేఖర్ విషయం అతని కుటుంబ సభ్యులతో పాటు ఊరందరికి తెలుసు. గత ఏడాది భార్య విజయలక్ష్మితో గొడవపడిన రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లిపోయి మాయం అయ్యాడు. రాజశేఖర్ కు ఇది మామూలే అని ఇన్ని నెలల అతని కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండిపోయారు.

భార్యకు అక్రమ సంబంధం
ఊరి నుంచి వెళ్లిపోతున్న రాజశేఖర్ అప్పుడప్పుడు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేవాడు. అయితే 9 నెలలు అయినా రాజశేఖర్ నుంచి ఒక్కఫోన్ చెయ్యకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో విజయలక్ష్మికి అదే ఊరిలో నివాసం ఉంటున్న మోహన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భర్తను చంపేసి శవం మీద అరటి చెట్టు నాటిన భార్య
పోలీసులు రాజశేఖర్ భార్య విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన భర్త రాజశేఖరన్ తనకు దూరం అయిన తరువాత తాను మోహన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నానని విజయలక్ష్మి పోలీసుల విచారణలో అంగీకరించింది.
తన భర్త రాజశేఖర్ ను శాశ్వతంగా దూరం చేసుకోవాలని తాను స్కెచ్ వేశారని విజయలక్ష్మి చెప్పిందని పోలీసులు అన్నారు. తన ప్రియుడి మోహన్ తో కలిసి తన భర్త రాజశేఖర్ ను చంపేసి మా అరటి తోటలో పూడ్చి పెట్టి శవం మీద అరటి చెట్టు నాటిపెట్టామని విజయలక్ష్మి పోలీసుల విచారణలో చెప్పడంతో అందరూ బిత్తరపోయారు.