చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న వివాహిత మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్న వ్యక్తి ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో కిలాడీ కేటుగాడు అతని స్మార్ట్ ఫోన్ లో ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీసి దాచిపెట్టుకున్నాడు. నీ భర్తను వదిలి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. భర్తను వదిలిపెట్టి రావడానికి ఆమె నిరాకరించింది. నగ్న వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రియుడి టార్చర్ తట్టుకోలేని భార్య ఆమె భర్తకు స్టోరీ మొత్తం చెప్పింది. భర్త మాస్టర్ ప్లాన్ వేసి భార్య ప్రియుడిని చంపేశాడు. అయితే థ్రిల్లర్ సినిమా స్టోరీలాగా కథ మలుపు తిరగడంతో సీన్ సిడేల్ అయిపోయింది.

Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !

చెన్నైలో ఫ్యామిలీ

చెన్నైలో ఫ్యామిలీ

ఉత్తరప్రదేశ్ కు చెందిన దేవేంద్ర సింగ్ (42), ఛాయా (36) దంపతులు పొట్టకూటి కోసం చెన్నై చేరుకుని కత్తూరు సమీపంలోని తిరుకుళం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దేవేంద్ర సింగ్ టైల్స్ పని చేస్తూ భార్యను పోషిస్తున్నాడు. దేవేంద్ర సింగ్, ఛాయా దంపతులతో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన అనేక కుటుంబాలు చెన్నై చేరుకుని ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ టైల్స్ పని చేస్తున్నారు.

 పక్కింటి కుర్రాడికి గ్రీన్ సిగ్నల్

పక్కింటి కుర్రాడికి గ్రీన్ సిగ్నల్

దేవేంద్ర సింగ్, ఛాయా దంపతులు నివాసం ఉంటున్న పక్కింటిలోనే మనోజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దేవేంద్ర సింగ్ పనికి వెళ్లిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న పక్కింటి ఆంటీ ఛాయా మీద మనోజ్ కన్ను వేశాడు. అసలే మంచి వేడిలో ఉంటున్న ఛాయా కూడా పక్కింటి కుర్రాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మస్త్ మజా...... వీడియోలతో బ్లాక్ మెయిల్

మస్త్ మజా...... వీడియోలతో బ్లాక్ మెయిల్

ఛాయా మనోజ్ తో అక్రమ సంబంధం సాగించింది. భర్త దేవేంద్ర సింగ్ పనికి వెళ్లిన తరువాత ప్రియుడు మనోజ్ తో కలిసి ఎక్కడంటే అక్కడ తిరగడం మొదలైయ్యింది. తనను నమ్మివచ్చిన ఛాయాకు తెలీకుండా మనోజ్ అతని స్మార్ట్ ఫోన్ తో ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీసి దాచిపెట్టుకున్నాడు.

మొగుడిని వదిలేస్తావా ?, వీడియోలు పంపించాలా

మొగుడిని వదిలేస్తావా ?, వీడియోలు పంపించాలా


చాలా కాలం నుంచి ఛాయాతో ఎంజాయ్ చేసిన మనోజ్ ఇటీవల నీ భర్తను వదిలేసి తనతో కలిసి వచ్చేయాలని, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ఛాయాకు చెప్పాడు. తాను భర్తను వదిలిరానని, తనకు చెడ్డపేరు వస్తుందని ఛాయా తేల్చి చెప్పింది. నా మాట వినకుంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ భర్తకు చూపిస్తానని మనోజ్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 భార్య ప్రియుడి హత్యకు భర్త మాస్టర్ ప్లాన్

భార్య ప్రియుడి హత్యకు భర్త మాస్టర్ ప్లాన్


ప్రియుడు మనోజ్ టార్చర్ ఎక్కువ కావడంతో ఛాయా సతమతం అయ్యింది. భర్తను వదిలి వెళ్లలేని ఛాయా మనోజ్ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఇంతకు ముందు జరిగిన మనోజ్ లవ్ స్టోరీ మొత్తం భర్త దేవేంద్ర సింగ్ కు చెప్పింది. భర్త దేవేంద్ర సింగ్ మనోజ్ కు ఇంతకు ముందు రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినా అతను మాత్రం పద్దతి మార్చుకోలేదు. మనోజ్ ను ఎలాగైనా చంపేయాలని దేవేంద్ర సింగ్ డిసైడ్ అయ్యాడు.

పక్కా ప్లాన్ తో ప్రియుడు ఫినిష్

పక్కా ప్లాన్ తో ప్రియుడు ఫినిష్


మనోజ్ హత్య చెయ్యడానికి భర్త దేవేంద్ర సింగ్ కు ఛాయా సహకరించింది, ఛాయానే ఫోన్ చేసి మనోజ్ ను ఎంజాయ్ చెయ్యడానికి రావాలని చెప్పింది. ఆవేశపడి ఊపుకుంటూ వెళ్లిన మనోజ్ ను దేవేంద్ర సింగ్, ఛాయా చంపేశారు. అర్దరాత్రి మనోజ్ శవాన్ని గోనె సంచిలో కట్టుకుని బైక్ లో తీసుకుని నిర్జనప్రదేశంలో విసిరివేయడానికి దేవేంద్ర సింగ్, ఛాయా ఇద్దరూ బయలుదేరారు.

 అడ్డంగా బుక్కైపోయిన దంపతులు

అడ్డంగా బుక్కైపోయిన దంపతులు

గస్తీ తిరుగుతున్న పోలీసులు బైక్ ను అడ్డగించారు. భర్త దేవేంద్ర సింగ్, భార్య ఛాయా మద్యలో ఉన్న మూట విప్పిచూపించాలని పోలీసులు చెప్పారు. చివరికి పోలీసులు బలవంతంగా మూటవిప్పి చూడగా మనోజ్ హత్యకు గురైన విషయం బయటపడింది. పోలీసులు కిలాడీ దంపతులు దేవేంద్ర సింగ్, ఛాయాలను అరెస్టు చేశారు.

English summary
Illegal affair: Youth murdered due to illegal relationship near Chennai City in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X