• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భార్య, అత్తను నడిరోడ్డులో లేపేశాడు, చెప్పినా డోంట్ కేర్, మూగ, చెవుడు !

|

చెన్నై/ మదురై/ కడలూరు: ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను భర్త పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. పాపం భర్తకు మూగ, చెవుడు కావడంతో భార్య అడ్డదారి తొక్కిందని తెలిసింది. కూతురి అక్రమ సంబంధానికి ఆమె తల్లి తాళం వేస్తోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. అంతే భార్య, ఆమె తల్లికి చాలా సార్లు భర్త వార్నింగ్ ఇచ్చాడు. కూతురిని పిలుచుకుని అత్త బయట తిరగడం ఎక్కువ అయ్యింది. సహనం కోల్పోయిన భర్త నడిరోడ్డులో భార్య, అత్తను అడ్డంగా పొడిచిపొడిచి చంపేయడం కలకలం రేపింది. భార్య, అత్తను భర్త కసితీర పొడిచి చంపడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. భార్య, అత్తను చంపేసిన భర్త కుమార్తెను మాత్రం వదిలేసి దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

7 ఏళ్ల క్రితం పెళ్లి

7 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని కడలూరులోని ఓడరేవు సమీపంలోని సలంకుక్కర వీధిలో రవి, పూంగోడి (48) దంపతులు నివాసం ఉంటున్నారు. రవి, పూంగోడి దంపతులకు మీనా (26) అనే కుమార్తె ఉంది. సోనగుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్న నంబురాజ్ (30) అనే వ్యక్తితో 7 సంవత్సరాల క్రితం మీనా వివాహం జరిగింది. నంబురాజ్ షిప్పింగ్ వ్యాపారం చేస్తున్నాడు. మంచి వ్యాపారం చేస్తున్న నంబురాజ్ డబ్బులు బాగానే సంపాధిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

మూగ, చెవుడు ఉన్న మొగుడు

మూగ, చెవుడు ఉన్న మొగుడు

నంబురాజ్, మీనా దంపతులకు రియా (3), ఝాన్నీ (13 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నంబురాజ్ కు చిన్నప్పటి నుంచి మాటలు రావు, అతనికి వినపడదు, నంబురాజ్ మాట్లాడలేడని, అతనికి వినపడదని పెళ్లికి ముందే మీనాకు, ఆమె కుటుంబ సభ్యులకు తెలుసు. మూగ, చెవుడు ఉన్న నంబురాజ్ ను పెళ్లి చేసుకున్న మీనా మొదట్లో సంతోషంగానే అతనితో కాపురం చేసింది.

పెళ్లాం అక్రమ సంబంధం ?

పెళ్లాం అక్రమ సంబంధం ?

మూగ, చెవుడు ఉన్న భర్త నంబురాజ్ కు మస్కా కొట్టిన మీనా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. బంధువులు ద్వారా భార్య మీనా విషయం తెలుసుకున్న నంబురాజ్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం విషయంలో మాటలు ఏమాత్రం రాని మూగవాడైన భర్త నంబురాజ్ భార్య మీనాతో వాదించలేకపోయాడు.

 అత్త అంతా చేస్తోందని డౌట్

అత్త అంతా చేస్తోందని డౌట్

తన భార్య మీనా అడ్డదార్లు తొక్కడానికి ఆమె తల్లి పూంగోడి కారణం అని నంబురాజ్ కు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో భార్య మీనా, అత్త పూంగోడికి నంబురాజ్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు కూతురు మీనాను పిలుచుకుని ఆమె తల్లి బయటకు వెళ్లడం నంబురాజ్ కు ఏమాత్రం నచ్చలేదు.

నడి రోడ్డులో అత్త, పెళ్లాంతో గొడవ

నడి రోడ్డులో అత్త, పెళ్లాంతో గొడవ

పసిపాప ఝాన్సీకి అనారోగ్యంగా ఉండటంతో మద్యాహ్నం మీనా, ఆమె తల్లి పూంగోడి కడలూరులోని ఇంటి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఝాన్సీకి వైద్యం చేయించిన తరువాత కడలూరులోని సాంచివిరాయన్ కోవిల్ స్ట్రీట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. ఆ సమయంలోకడలూరు పాతపట్టణం రోడ్డులో నుంచి భర్త నంబురాజ్ భార్య మీనా దగ్గరకు ఎదురుగా వెళ్లి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ గొడవ పెట్టుకున్నాడు.

పక్కా స్కెచ్ తో పెళ్లాం, అత్తను లేపేశాడు

పక్కా స్కెచ్ తో పెళ్లాం, అత్తను లేపేశాడు

నడిరోడ్డులో మాటామాటా పెరిగిపోవడంతో అంత వరకు సహనంగా ఉన్న నంబురాజ్ రెచ్చిపోయాడు. టీషర్టులో వెనుక నడుంలో దాచిపెట్టుకుని వెళ్లిన కత్తి తీసుకుని మొదట భార్య మీనా మెడలో పొడిచేశాడు. ఆ సమయంలో సంకలో ఉన్న బిడ్డ ఝాన్సీని మీనా తల్లి పూంగోడి రోడ్డు పక్కన పెట్టేసింది. అదే సమయంలో పక్కన ఉన్న అత్త పూంగోడి కడుపులో పొడవడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. భార్య మీనా పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆమెను పట్టుకున్న నంబురాజ్ సుమారు 10 సార్లుకు పైగా కడుపులో పొడిచేశాడు. పారిపోవడానికి ప్రయత్నించిన అత్తను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

కసితీర చంపేసి దర్జాగా చెక్కేశాడు

కసితీర చంపేసి దర్జాగా చెక్కేశాడు

నంబురాజ్ భార్య మీనా, అత్త పూంగోడిని కసితీర పొడిచి చంపేశాడు. ఇద్దరి ప్రాణాలు పోయాయని నిర్దారించుకున్న నంబురాజ్ పక్కన ఏడుస్తున్న కుమార్తె ఝాన్సీని జాలిగా చూసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. పట్టపగలు నంబురాజ్ అతని భార్య మీనా, అత్త పూంగోడిని దారుణంగా పొడిచి చంపడం పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు మీనా, ఆమె తల్లి పూంగోడి మృతదేహాలను ఆసుపత్రికి తరలించి నంబురాజ్ కోసం గాలిస్తున్నారు.

English summary
Illegal relationship: Husband killed wife and mother in law in Cuddalore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X