రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిరసనలు ..బాధ కలిగిస్తున్నాయన్న తలైవా
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం కోసం ఆశగా ఎదురు చూసిన అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని, రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని గత నెలలో స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇక ఆయన ప్రకటన చాలామంది అనుచరులలో తీవ్ర నిరాశను కలిగించింది. ఇక ఆయన నిర్ణయం మార్చుకోవాలని చెన్నై లో ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో ఆయన కీలక ప్రకటన చేశారు .
రజనీకాంత్ మద్దతు కోరతానన్న కమల్ హాసన్ .. మూడో విడత ప్రచారంతో పాటు మూడో కూటమి యత్నాలు

పొలిటికల్ ఎంట్రీ పై రజనీకాంత్ నిర్ణయంతో అభిమానుల నిరసనలు
గతేడాది డిసెంబర్ నెలలో ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి ప్రవేశించే తన ఆలోచన విరమించుకున్న రజనీకాంత్ నిర్ణయంతో అభిమానులు నిరసనలకు దిగుతున్నారు.
తమిళనాడు చెన్నైలో పెద్ద సంఖ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆందోళన నిర్వహించారు. చెన్నైలో ఆయన అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు . రాజకీయాల్లోకి రాకూడదని రజినీకాంత్ తీసుకున్న నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని వారు కోరుతున్నారు. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్ లో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

తన అభిమానులను ర్యాలీలు నిర్వహించవద్దని కోరిన రజనీకాంత్
ఇక ఈ రోజు తన రాజకీయ ప్రవేశం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులను ఉద్దేశించి ఆయన కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి రావడం గురించి తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆందోళనచేయడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. సోమవారం తన అభిమానులను ర్యాలీలు నిర్వహించవద్దని కోరారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తన నిర్ణయం అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసిన తలైవా
రాజకీయాల్లోకి ప్రవేశించకూడదనే తన నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిమానులు కొందరు రజనీకాంత్ మక్కల్ మండ్రం బహిష్కృత కార్యకర్తలతో కలిసి చెన్నైలో నిరసన వ్యక్తం చేశారు. తాను తన నిర్ణయం తీసుకున్నానని , దానిని అందరూ గౌరవించాలని తనకు బాధ కలిగించే విషయాలలో, ర్యాలీలో పాల్గొనవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇక మరోపక్క రజనీ కాంత్ రాజకీయాల్లోకి రాకున్నా రజనీకాంత్ మద్దతు ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లాభం జరుగుతుందని తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఆయన మద్దతు కోరే పనిలో పడ్డాయి.