చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jihadi gang: సౌత్ ఇండియాలో స్కెచ్, షహాదత్ మా గురి కోడ్ తో జీహాదీ టార్గెట్, రషీద్ అందర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు/హైదరాబాద్: ఉగ్రవాద సంస్థతో లింక్ లు పెట్టుకుని దక్షిణ భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సభ్యుడిని NIA అధికారులు అరెస్టు చేశారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో 'షహాదత్ మా టార్గెట్' అనే కోడ్ తో జీహాద్ గ్యాంగ్ విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ఐఏ అధికారులు జీహాద్ ఉగ్రవాద సభ్యుడిని తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.

Massage lady: పెళ్లి కాకుండానే కాపురం, రాత్రి ఏ జరిగిందో, ఆత్మహత్య, డబ్బు లేకపోతే లిక్కర్ ఎలా వచ్చింది ?Massage lady: పెళ్లి కాకుండానే కాపురం, రాత్రి ఏ జరిగిందో, ఆత్మహత్య, డబ్బు లేకపోతే లిక్కర్ ఎలా వచ్చింది ?

25 ఏళ్లకే క్రిమినల్ మైండ్

25 ఏళ్లకే క్రిమినల్ మైండ్

తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన మోహమ్మద్ రషీద్ (25) అనే యువకుడు జీహాద్ ఉగ్రవాద ముఠాలో చురుకుగా ఉన్నాడని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. మోహమ్మద్ రషీద్ వయసు 25 ఏళ్లు. ఇంత చిన్న వయసులో మోహమ్మద్ రషీద్ కు క్రిమినల్ మైండ్ ఉందని ఎన్ఐఏ అధికారులు పసిగట్టారు.

స్కెచ్ వేస్తే దిమ్మతిరిగిపోయింది

స్కెచ్ వేస్తే దిమ్మతిరిగిపోయింది

చాలా కాలం నుంచి మోహమ్మద్ రషీద్ కార్యకలాపాల మీద ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా మోహమ్మద్ రషీద్ ఏం చేస్తున్నాడు ?, ఎక్కడెక్కడికి వెలుతున్నాడు ? అని ఎన్ఐఏ అధికారులు పూర్తి సమాచారం సేకరించారు. జీహాద్ ఉగ్రవాద సంస్థతో మోహమ్మద్ రషీద్ కు లింక్ ఉందని ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ అధికారులు పక్కా స్కెచ్ వేసి రంగంలోకి దిగడంతో మోహమ్మద్ రషీద్ దిమ్మతిరిగిపోయింది.

2018లో స్కెచ్ వేసినా !

2018లో స్కెచ్ వేసినా !

2018వ సంవత్సరంలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని అక్రమంగా మారణాయుధాలు పెట్టుకుని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ కేసులో మోహమ్మద్ రీఫాస్, మొహారిష్ అహమ్మద్, అబూబక్కర్ సిద్దిక్ అనే నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలు, ఉగ్రవాద సంస్థకు చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

 దెబ్బకు మరో గ్యాంగ్ అందర్

దెబ్బకు మరో గ్యాంగ్ అందర్

రామనాథపురంలో అరెస్టు అయిన ఉగ్రవాద ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో షేక్ దావూద్, అహమ్మద్ ఇమిత్యాష్, హమీద్ అస్కర్, లియాకత్ ఆలీ, సాజిత్ అహమ్మద్, రిజ్వాన్ అనే నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు 2019 నుంచి మోహమ్మద్ రషీద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలించారు.

సౌత్ ఇండియా టార్గెట్ ?

సౌత్ ఇండియా టార్గెట్ ?


మోహమ్మద్ రషీద్ ఆచూకి తెలుసుకోవాలని అతని కోసం ఎన్ఐఏ అధికారులు గాలించారు. ఎట్టకేలకు మహానుభావుడు మోహమ్మద్ రషీద్ ఆచూకి చిక్కడంతో అతనిపాపం పండిపోయింది. రషీద్ నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచి విచారణ ముమ్మరం చేశారు. దక్షిణ భారతదేశం (సౌత్ ఇండియా)ను టార్గెట్ చేసుకున్న జీహాదీ ఉగ్రవాద సంస్థ ముఠా రషీద్ అండ్ కో సహకారంతో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నదని, కేసు విచారణలో ఉందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

English summary
Jihadi gang: The NIA on Thursday arrested an active member of a "jihadi" gang, Shahadat is our Goal, from Tamil Nadu for his alleged involvement in a conspiracy of waging a violent "jihad" in the southern state as part of efforts to establish Shariah, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X