చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ ఓకే అంటే సీఎంగా బరిలో దిగుతానన్న కమల్ హాసన్: తలైవా పార్టీ పొంగల్ కే

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా రాజకీయాలలో చర్చనీయాంశం కాగా, తమిళనాట రాజకీయ పార్టీలలో ప్రకంపనలకు కారణమైన విషయం తెలిసిందే . మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రజనీకాంత్ పార్టీ పెట్టకముందే రజనీ కాంత్ పార్టీ విషయంలో, రజినీకాంత్ తో పొత్తుకు సిద్ధం అంటూ తెగ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రజనీకాంత్ పై కమల్ హాసన్ బోలెడు ఆశలు పెట్టుకున్నట్లుగా తాజా వ్యాఖ్యలతో అర్థమౌతుంది.

ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్ పై పదేపదే కమల్ హాసన్ సంచలనం

ఎన్నికల ప్రచారంలో రజనీకాంత్ పై పదేపదే కమల్ హాసన్ సంచలనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు జిల్లాలలో పర్యటిస్తున్న కమల్ హాసన్ రజనీకాంత్ కోరితే తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమిళనాడులో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనని తేల్చేసిన కమల్ హాసన్ రజనీకాంత్ తో పొత్తు విషయంలో జనవరి నెలలో మాట్లాడతానని చెప్పారు. రజనీకాంత్ తాను పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండబోనని ప్రకటన చేసిన నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కమల్ హాసన్, ఇప్పటికే రజనీకాంత్ ఓకే అంటే కలిసి పని చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ రెడీ అంటే 24 గంటల్లోనే పొత్తుకు రెడీ అని వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ తో కలిసి రాజకీయాల్లో ముందుకు వెళ్ళటానికి రెడీ అంటున్న కమల్

రజనీకాంత్ తో కలిసి రాజకీయాల్లో ముందుకు వెళ్ళటానికి రెడీ అంటున్న కమల్

ఇదే సమయంలో తమిళనాడులో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టిన కమల్ హాసన్ ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు తీసుకురావాలని కమల్ హసన్ కోరారు. రాజకీయాల్లో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించిన కమలహాసన్ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రజనీకాంత్ పార్టీ పెడుతున్నారు అని తెలిసి కూడా రజనీతో కలిసి రాజకీయాల్లో ముందుకు సాగాలని కమల్ తన ఆకాంక్షను పదేపదే వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు జనవరి 14 లేదా 17వ తేదీల పరిశీలన

రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు జనవరి 14 లేదా 17వ తేదీల పరిశీలన

మరోవైపు సూపర్ స్టార్ రజనీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని చెప్పిన నాటి నుండి తమిళ రాజకీయాలు శరవేగంగా మారాయి. ఇప్పటికే రజనీకాంత్ పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ , పార్టీ గుర్తు గా ఆటో రిక్షా ని ఎంపిక చేసినట్లుగా సమాచారం. అయితే పార్టీ ఏర్పాటుపై రజినీకాంత్ ఈనెల 31వ తేదీన ప్రకటించబోతున్నట్లు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు జనవరి 14 లేదా 17 వ తేదీలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం .

కమల్ వ్యాఖ్యలపై రజనీ కాంత్ స్పందిస్తారా ?.. తమిళ నాట రాజకీయ వర్గాల్లో టెన్షన్

కమల్ వ్యాఖ్యలపై రజనీ కాంత్ స్పందిస్తారా ?.. తమిళ నాట రాజకీయ వర్గాల్లో టెన్షన్

జనవరి 14 తమిళ్ పొంగల్ సందర్భంగా పార్టీ పెట్టాలని కొందరు సూచిస్తే మరి కొందరు ఎంజీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 17వ తేదీన పార్టీ పెట్టాలని రజనీకాంత్ కు సూచించినట్లుగా తెలుస్తోంది .జనవరి 17న రజనీ పార్టీ ఏర్పాటు ముహూర్తం ఖరారు కానుందని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదిఏమైనా రజినీకాంత్ పార్టీ పెట్టకముందే, కమల్ హాసన్ రజినీకాంత్ విషయంలో తెగ ఆసక్తి కనబరుస్తూ ఉండటం రాజకీయవర్గాలలో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు కమల్ వ్యాఖ్యలపై రజనీకాంత్ స్పందించలేదు . భవిష్యత్ లో స్పందించే అవకాశాలు లేకపోలేదని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Kamal Haasan made sensational remarks When asked about any alliance with Rajinikanth and if he would be the CM candidate, Haasan said, I will accept if Rajini willing to ally and announces me as the Chief Ministerial candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X