చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ విజయం, ఇది పండగ మాత్రమే... ముందు జాతర ఉంది. నో డౌట్, రెఢీనా!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ న్యూఢిల్లీ: అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన కమలా హారిస్ విజయం సాధించినట్లే, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడులో భారీగా పోస్టర్లు, బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ న్యాయవాది, కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ తమిళనాడులో వెలసిన పోస్టర్లను ట్విటర్ లో పోస్టు చెయ్యడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన పీవీ గోపాలన్ మనమరాలు విజయం సాధించింది. మనకు పండుగ వచ్చేసింది అంటూ తమిళనాడులోని ఆలయాల మీద కమలా హారిస్ తో ఏర్పాట్లు చేసిన పోస్టర్లు, బ్యానర్లు చూస్తున్న తమిళ ప్రజలు మురిసిపోతున్నారు.

Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !

 కమలా ఫ్యామిలీవి చెన్నై నీళ్లు

కమలా ఫ్యామిలీవి చెన్నై నీళ్లు

తమిళనాడుకు చెందిన ప్రభుత్వ అధికారి పీవీ గోపాలన్ భార్య శ్యామలా చెన్నైలోనే జన్మించారు. కమలా హారిస్ తల్లి శ్యామలా. పీవీ గోపాలన్ భార్య శ్యామలా చెన్నైలోనే జన్మించారు. కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ హారిస్ నల్లజాతీయుడు. కమలా హారిస్ పుట్టిన 7 ఏళ్లకే ఆమె తల్లిదండ్రులు డొనాల్డ్ హారిస్, శ్యామలా విడాకులు తీసుకున్నారు.

తమిళనాడులో పండగ

తమిళనాడులో పండగ

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ కు తమిళనాడు మూలాలు ఉండటంతో ఇప్పుడు తమిళనాడులోని ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో తల్లడిల్లిపోతున్నారు. కమలా హారిస్ కు తమిళనాడుకు రక్తసంబంధం ఉందని తమిళ ప్రజలు సైతం పండగ చేసుకుంటున్నారు. హోవర్డ్ వర్శిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన కమలా హారిస్ 2010, 2014లో రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పని చేశారు. ఆ సమయంలో కాలిఫోర్నియాలో కమలా హారిస్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

గోపాలన్ మనుమరాలు విన్.... నో డౌట్

గోపాలన్ మనుమరాలు విన్.... నో డౌట్

కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్ననట్లు వెలుగు చూసినప్పటి నుంచి తమిళనాడులో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హాట్ టాపిక్ అయ్యారు. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో మన పీవీ గోపాలన్ గారి మనుమరాలు విజయం సాధించినట్లే, అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ చెన్నై సిటీతో పాటు తమిళనాడులోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో తమిళ ప్రజలు భారీ సంఖ్యలో పీవీ గోపాలన్, కమలా హారిస్ చిన్ననాటి పోస్టర్లతో ఏర్పాటు చేసిన ఫోటోలతో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

మేనకోడలు మీనా ఫుల్ హ్యాపి

మేనకోడలు మీనా ఫుల్ హ్యాపి

కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ (35) కాలిఫోర్నియాలో ప్రముఖ న్యాయవాది. తమిళనాడులో పీవీ గోపాలన్ మనుమరాలు కమలా హారిస్ విజయం సాధించినట్టే అంటూ తమిళంలో తమిళనాడులోని తిరువూర్ లోని ఆలయం మీద రాసిన చేతిరాతలు, పోస్టర్లను ఆమె ట్విటర్ లో పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తనకు, తన కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉందని మీనా హారిస్ అంటున్నారు.

ఇది పండగ మాత్రమే... ముందు జాతర ఉంది

ఇది పండగ మాత్రమే... ముందు జాతర ఉంది

తాను చిన్నతనంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లేవాళ్లమని, మా ముత్తాత పీవీ గోపాలన్ గురించి మేము తెలుసుకునే వాళ్లమని, మా బామ్మ (పీవీ గోపాలన్ భార్య) ఆయనకు కొండంత అండగా ఉండేవారని మీనా హారిస్ గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద అమెరికా ఉపాధ్యక్ ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తున్నారని తెలిసిన తరువాత తమిళనాడులో పండుగ వాతావరణం ఏర్పడిందని, ఇక ఆమె ఉపాధ్యక్షురాలిగా విజయం సాధిస్తే కచ్చితంగా జాతర జరుగుతుందని తమిళ ప్రజలు అంటున్నారు.

English summary
Kamala Harris: US vice president candidate Kamala Harris name written in Thiruvarur temple wall in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X