చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi killer: కోడలు కాదు, కాలాంతకురాలు, పోలీసులకే హల్వా, దిపావళి స్కెచ్ తో రివాల్వర్ తో ఫినిష్!

|
Google Oneindia TeluguNews

చెన్న/ పూణే/ సోలాపూర్: భర్తతో పాటు అత్తమామలను హాలీవుడ్ సినిమా స్కెచ్ తో కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తో కాల్చి చంపిన కిలాడీ కోడలు అడ్డంగా బుక్కైపోయింది. పోలీసులు వచ్చేలోపు పూణే నుంచి సోలాపూర్ చెక్కేయడానికి ప్రయత్నించిన కిలాడీ లేడీతో పాటు ముగ్గురిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో వెళ్లి పూణే చేరుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల సహాయంతో కిలాడీ కోడలిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. దీపావళి పండుగను అడ్డం పెట్టుకుని రివాల్వర్ తో కాల్చి చంపితే పక్కింటి వాళ్లకు కూడా డౌట్ రాదని కిలాడీ కోడలు ఇన్ని రోజులు వేచి చూసి పక్కా స్కెచ్ తో ఒకేసారి ముగ్గురిని చంపేసిందని చెన్నై పోలీసులు తెలిపారు.

Alone Aunty: విదేశాల్లో కూతురు, రాత్రి ఆంటీని నగ్నంగా చేసి గొంతు కోసి, కసితీరా పొడిచి, రేప్ చేసి !Alone Aunty: విదేశాల్లో కూతురు, రాత్రి ఆంటీని నగ్నంగా చేసి గొంతు కోసి, కసితీరా పొడిచి, రేప్ చేసి !

పూణే కిలాడితో పెళ్లి

పూణే కిలాడితో పెళ్లి


రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై చేరుకుని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. సీతల్ కు మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల (36) అనే మహిళకు 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సీతల్, జయమాల దంపతులకు 13 ఏళ్లు, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ మొగుడు వద్దేవద్దు..... రూ. 5 కోట్లు చాలు

ఈ మొగుడు వద్దేవద్దు..... రూ. 5 కోట్లు చాలు

గత రెండు సంవత్సరాల నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త సీతల్ తన కోరికలు తీర్చడానికి సరిపోడని డిసైడ్ అయిన జయమాల తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని పూణే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. తన భర్త సీతల్ తో విడాకులు తీసుకోవాలని జయమాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పూణేలోని పుట్టింటిలో ఉండిపోయింది. తాను తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లు భరణం ఇవ్వాలని జయమాల కోర్టును ఆశ్రయించింది. సీతల్, జయమాల దంపతుల విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది.

అత్తమామలు. భర్తకు స్ట్రాంగ్ వార్నింగ్

అత్తమామలు. భర్తకు స్ట్రాంగ్ వార్నింగ్

కోడలు జయమాలకు విడాకులు ఇచ్చినా తాము రూ. 5 కోట్లు ఇవ్వలమని దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ జయమాల కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పారు. రెండు నెలల క్రితం జయమాల, ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడు, అతని గ్యాంగ్ చెన్నై వెళ్లి మర్యాదగా మాకు ఆస్తిలో భాగం పెట్టాలని, లేదంటే మిమ్మల్ని లేపేస్తామని బెదిరించారు. అప్పట్లో దలీల్ చంద్, అతని కుమారుడు సీతల్ చెన్నైలోని ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చెయ్యడంతో కోడలు జయమాలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైయ్యింది. అప్పటి నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు పెద్దలు పంచాయితీలు చేసినా ఈ వివాదం సర్దుమనగలేదు.

కూతురు ఎంట్రీతో కలకలం

కూతురు ఎంట్రీతో కలకలం


దలీల్ చంద్ కుమార్తె పింక్ గురువారం రాత్రి చెన్నైలోని ఎలిఫెంట్ రోడ్డు సమీపంలోని వారి అపార్ట్ మెంట్ లోకి వెళ్లింది. అపార్ట్ మెంట్ లోని హాల్ లో తండ్రి దలీల్ చంద్, తల్లి పుష్పాబాయ్, సోదరుడు సీతల్ రక్తపు మడుగులో శవాలై కనిపించడంతో షాక్ కు గురైన పింక్ వెంటనే ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి జరిగిన దారుణం గురించి చెప్పింది.

కోడలే కిల్లర్...... పక్కా సాక్షాలు

కోడలే కిల్లర్...... పక్కా సాక్షాలు

చెన్నై పోలీసులు దలీల్ చంద్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోడలు జయమాల, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు.

ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు ఎంట్రీ

ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు ఎంట్రీ

దలీల్ చంద్ కోడలు జయమాలతో పాటు ఆమె వెంట వచ్చి ఒకే కుటుంబంలో మూడు హత్యలు చేసిన విషయం స్పష్టంగా గుర్తించిన పోలీసులు వారు చెన్నై దాటి పారిపోకుండా నాకాబంధీ ఏర్పాటు చేసి వారి కోసం గాలించారు. జయమాల ఆమె గ్యాంగ్ తప్పించుకోకుండా చెన్నై సిటీ పోలీసులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులను సహాయం తీసుకుని వారి కోసం గాలించారు.

పూణే టూ సోలాపూర్ పరార్

పూణే టూ సోలాపూర్ పరార్


చెన్నై సిటీ పోలీసులు అన్ని రహదారుల్లో నాకాబంధీ ఎర్పాటు చేశారు. రైల్వే పోలీసుల సహాకారంతో జయమాల కోసం గాలించారు. విమానంలో పూణే వెళ్లిన పోలీసులు జయమాల ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చెన్నై సిటీ పోలీసులు పూణే వచ్చారని తెలుసుకున్న జయమాల, మరో ముగ్గురు నిందితులు కారులో సోలాపూర్ కు పారిపోవడానికి ప్రయత్నించారు. సోలాపూర్ మార్గంలో వెంటాడిన చెన్నై పోలీసులు చివరికి శనివారం వేకువ జామున జయమాలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. జయమాల అండ్ గ్యాంగ్ ను విచారణ కోసం చెన్నై తీసుకెలుతున్నారు,

English summary
Khiladi killer: Chennai Police arrested woman who shot her family members
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X