చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: లేడీ లాయర్ స్కెచ్, వేరే మహిళను చంపేసి డెత్ సర్టిఫికెట్ తీసుకుంది, భర్త ఫ్రెండ్, కారు డ్రైవర్ తో కలిసి!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు: ఆస్తి వివాదం కేసు వాదించమని అడగడానికి వెళ్లిన మహిళను దారుణంగా హత్య చేశారు. చీటింగ్ కేసుల్లో చిక్కుకున్న లేడీ లాయర్ తాను చనిపోయానని ప్రభుత్వాన్ని, ప్రజలను నమ్మించడానికి భర్త ఫ్రెండ్, డ్రైవర్ సహాయంతో ఆమెను దారుణంగా చంపేసింది. తరువాత లేడీ లాయర్ బతికున్నట్లే ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించింది. లేడీ లాయర్ భర్త కూడా క్రిమినల్ లాయర్ కావడంతో కేసును సులభంగా తప్పించుకోవచ్చని స్కెచ్ వేశారు. అయితే చేసిన పాపం ఊరికేపోదు అనే సామెతలాగా క్రిమినల్ లాయర్ దంపతులతో పాటు మహిళ హత్యకు సహకరించిన కారు డ్రైవర్ పోలీసులకు చిక్కిపోయారు. ఆ ముగ్గురు నేరం చేశారని కోర్టులో రుజువు అయ్యింది.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

భర్తతో భార్యకు ఆస్తి గొడవలు

భర్తతో భార్యకు ఆస్తి గొడవలు

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని శివానందకాలనీలో మారిముత్తు, అమ్మసాయ్ (45) దంపతులు నివాసం ఉండేవారు. మారిముత్తు, అమ్మసాయ్ దంపతుల మధ్య గొడవలు జరగడంతో 10 ఏళ్ల క్రితం వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. అమ్మసాయ్ తో పాటు ఆమె కుమార్తె కూడా నివాసం ఉంటున్నది. మారిముత్తు, అమ్మసాయ్ కు ఆస్తి పంపకాలలో గొడవలు మొదలైనాయి.

లాయర్ కోసం వెళితే ప్రాణం పోయింది

లాయర్ కోసం వెళితే ప్రాణం పోయింది

ఆస్తి కోసం కోర్టుకు వెళితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని భావించిన అమ్మసాయ్ 2010లో కోయంబత్తూరులోని గోపాలపురంలోని న్యాయవాది రాజవేల్ కార్యాలయానికి వెళ్లింది. అంతే లాయర్ దగ్గరకు వెళ్లిన అమ్మసాయ్ తరువాత ఇంటికి తిరిగి వెళ్లలేదు. అమ్మసాయ్ ని గొంతు కోసి హత్య చేసిన లాయర్ రాజవేల్ ఆమె శవాన్ని మోహనా అనే మహిళ మృతదేహంగా చిత్రీకరించి ఓ డాక్టర్ సహాయంతో మోహనా డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు.

 కూతురికి అనుమానం వచ్చింది

కూతురికి అనుమానం వచ్చింది


లాయర్ ఇంటికి వెళ్లిన తన తల్లి ఇంటికి రాలేదని అమ్మసాయ్ లాయర్ రాజవేల్ కార్యాలయానికి వెళ్లి విచారించింది. లాయర్ రాజవేల్ దబాయించి ఆమె ను అక్కడి నుంచి పంపించేశారు. లాయర్ ఇంటికి వెళ్లిన తన తల్లి కనపడటం లేదని అమ్మసాయ్ కుమార్తె కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అప్పట్లో కేసు నమోదైయ్యింది. పోలీసుల విచారణలో అమ్మసాయ్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

లాయర్ భార్య పెద్ద కిలాడీ లాయర్

లాయర్ భార్య పెద్ద కిలాడీ లాయర్

పోలీసుల విచారణలో మోహనా (47) అనే మహిళ పేరు తెర మీదకు వచ్చింది. లాయర్ రాజవేల్ భార్య మోహన, మోహనా కూడా లాయర్ అని పోలీసులు గుర్తించారు. ఒడిశాలో ఓ ఆర్థిక సంస్థను ప్రారంభించిన మోహన అక్కడి అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఒడిశాలో లేడీ లాయర్ మోహనా మీద అనేక కేసులు నమోదైనాయని పోలీసులు గుర్తించారు. ఒడిశా పోలీసులు కూడా మోహనా కోసం గాలించినా ఆమె మాత్రం వాళ్లకు చిక్కలేదు.

క్రిమినల్ లాయర్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్

క్రిమినల్ లాయర్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్

మోహనా బతికుండగానే ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని పోలీసులు, ప్రభుత్వాన్ని, ఒడిశాలోని బాధితులను మోసం చెయ్యాలని స్కెచ్ వేశారు. అలాంటి సమయంలో అమ్మసాయ్ అక్కడికి వెళ్లడంతో ఇంచుమించు మోహనా వయసు కూడా అదే కావడంతో ఆమెను చంపేయాలని రాజవేల్, అతని భార్య మోహనా స్కెచ్ వేశారు. అనుకున్నట్లే రాజవేల్, మోహనా దంపతులు, వారి సహచరుడు బోన్ రాజ్, కారు డ్రైవర్ పళనిస్వామి కలిసి అమ్మసాయ్ ను గొంతు కోసి చంపేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

లాయర్ దంపతులే హంతకులు

లాయర్ దంపతులే హంతకులు

కేసు నమోదు చేసిన కోయంబత్తూరు పోలీసులు 2011లో లాయర్ రాజవేల్, అతని భార్య, లేడీ లాయర్ మోహనాతో పాటు కారు డ్రైవర్ పళనిస్వామిని అరెస్టు చేశారు. ఇదే కేసులో బోన్ రాజ్ అప్రూవర్ గా మారడంతో పోలీసులు అతన్ని ప్రత్యక్షసాక్షిగా చేర్చారు. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. సోమవారం (డిసెంబర్ 30వ తేదీ) లాయర్ దంపతులు రాజవేల్, మోహనాతో పాటు కారు డ్రైవర్ పళనిస్వామి అమాయకురాలు అమ్మసాయ్ ని హత్య చేశారని సాక్షాలు ఉన్నాయని, ఈ ముగ్గురు నేరం చేశారని రుజువు అయ్యిందని కోయంబత్తూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల శిక్షను కోర్టు రిజర్వులో పెట్టడంతో ముగ్గురిని పోలీసులు సెంట్రల్ జైలుకు పంపించారు.

English summary
Khiladi lady lawyer: Judgement on Murder case after 9 years in Coimbatore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X