చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!

|
Google Oneindia TeluguNews

చెన్నై/సేలం: చామనఛాయ రంగు, పొడవుగా, నాజుకుగా ఉన్న లేడీ దెబ్బతో జిల్లాలోని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు పట్టపగలు సినిమా చూశారు. జిల్లాలో మంచి పలుకుబడి, ఆర్థికంగా బాగున్న రాజకీయ నాయకుల లిస్టు తయారు చేసిన లేడీ వారితో పరిచయం పెంచుకుంది. తరువాత ఆ రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు సేకరించిన ఆమె వారితో టచ్ లో ఉంది. మొత్తం ఆరు మంది బిగ్ షాట్ రాజకీయ నాయకులను సెలెక్ట్ చేసుకున్న కిలాడీ లేడి వారిని లైన్ లో పెట్టింది. మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు రావాలి అంటూ వాళ్లను ఓరచూపులతో చూస్తూ వారు సొల్లు కార్చుకునేలా చేసింది.

మీరు మా ఇంటికి పార్టీకి వస్తుంటే వేరే వాళ్లను ఎందుకు పిలుస్తాను. నాకు మీరంటేనే స్పెషల్ అంటూ వారికి మాయమాటలు చెప్పింది. ఒకరిని పిలిచిన రోజు మరెవ్వరిని పిలవకుండా ఒక్కొక్కరిని ఆమె ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరని, మీకు ఏం కావాలంటే అది ఇస్తానని కిలాడీ లేడీ ఆ పొలిటికల్ లీడర్స్ కు చెప్పింది. ఇదేదో బాగుంది అనుకున్న ఆ నాయకులు ఆమెతో ఎంజాయ్ చెయ్యడానికి ఒంగోలు గిత్తల్లా వెనుకా ముందు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి కిలాడీ లేడీ ఆ రాజకీయ నాయకులతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో వీడియోలు తీపించింది.

అంతే అక్కడ నుంచి రాజకీయ పొలిటికల్ లీడర్స్ తో ఆమె ఫుడ్ బాల్ ఆడుకుంది. లక్షలు లక్షలు లాగడం మొదలు పెట్టింది. కిలాడీ లేడీ, ఆమె బాయ్ ఫ్రెండ్, అతని ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేసి సంపాధిస్తున్న డబ్బులు పంచుకునే విషయంలో తేడాలు రావడంతో కథ మలుపు తిరిగింది. ఇదే సమయంలో కిలాడీ లేడీ కిడ్నాప్ కావడంతో కథ రవసత్తరంగా మారింది.

Illegal affair: పనోడితో కౌన్సిలర్ భార్య ?, స్లోపాయిజన్, సాంబార్ స్కెచ్, డౌట్ రాకుండా, ఫినిష్!Illegal affair: పనోడితో కౌన్సిలర్ భార్య ?, స్లోపాయిజన్, సాంబార్ స్కెచ్, డౌట్ రాకుండా, ఫినిష్!

కిలాడీ భామకు భలే స్కెచ్

కిలాడీ భామకు భలే స్కెచ్

తమిళనాడులోని సేలం జిల్లాలోని సూరమంగళంలో కళైసెల్వి అలియాస్ సెల్ల్వి అనే మహిళ నివాసం ఉంటున్నది. చామనఛాయ రంగు, పొడవుగా, నాజుకుగా ఉన్న కళైసెల్వి ఉద్దరగా లక్షలు లక్షలు డబ్బులు సంపాధించాలని స్కెచ్ వేసింది. పక్కాప్లాన్ వేసుకుంటే డబ్బులు సంపాధించడం పెద్ద సమస్య కాదని కళైసెల్వి అనుకుంది.

పొలిటికల్ లీడర్స్ టార్గెట్..... బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ

పొలిటికల్ లీడర్స్ టార్గెట్..... బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ

మొదట కళైసెల్వి ఆమె భాయ్ ఫ్రెండె సెల్వాతో చర్చలు జరిపింది. తరువాత కళైసెల్వి, ఆమె బాయ్ ఫ్రెండ్ సెల్వా మొదట తిరుచ్చి జిల్లాలోని అన్ని పార్టీల నాయకుల గురించి వివరాలు సేకరించారు.తిరుచ్చి జిల్లాలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల పేర్లు, వారి వివరాలు సేకరించిన కళైసెల్వి వాటిని లిస్ట్ ఔట్ చేసింది.

టచ్ లోకి వెళ్లింది..... లైన్ లో పెట్టింది

టచ్ లోకి వెళ్లింది..... లైన్ లో పెట్టింది

తిరుచ్చి జిల్లాలో మంచి పలుకుబడి, ఆర్థికంగా బాగున్న రాజకీయ నాయకుల లిస్టు తయారు చేసిన కిలాడీ లేడీ కళైసెల్వి వారితో పరిచయాలు పెంచుకుంది. తరువాత ఆ రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు సేకరించిన కళైసెల్వి వారితో టచ్ లో ఉంది. మొత్తం ఆరు మంది బిగ్ షాట్ పొలిటికల్ లీడర్స్ సెలెక్ట్ చేసుకున్న కిలాడీ లేడి కళైసెల్వి వారిని లైన్ లో పెట్టింది.

ఫోకస్ పెట్టి పడేసిన కిలాడి భామ

ఫోకస్ పెట్టి పడేసిన కిలాడి భామ

మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది, మీరు కచ్చితంగా రావాలి అంటూ కళైసెల్వి వాళ్లను ఓరచూపులతో చూస్తూ వారు సొల్లు కార్చుకునేలా వయ్యారాలు చూపించింది. మీరు మా ఇంటికి పార్టీకి వస్తుంటే వేరే వాళ్లను ఎందుకు పిలుస్తాను. నాకు మీరంటేనే స్పెషల్ అంటూ కళైసెల్వి ఆ రాజకీయ పార్టీల నాయకులకు మాయమాటలు చెప్పింది. ఒకరిని పిలిచిన రోజు మరెవ్వరిని పిలవకుండా ఒక్కొక్కరిని కళైసెల్వి ఆమె ఇంటికి పిలిపించుకుంది.

ఒంటరిగా ఉన్నాను..... మీకు ఏం కావాలంటే అది ఇస్తాను

ఒంటరిగా ఉన్నాను..... మీకు ఏం కావాలంటే అది ఇస్తాను

కిలాడీ లేడి వంపుసొంపులు చూసిన కొందరు రాజకీయ నాయకులు కళైసెల్వి ఇంటికి ఎగేసుకుంటూ రాత్రి డిన్నర్ కు వెళ్లిపోయారు. మా ఇంట్లో ఎవ్వరూ లేరని, మీకు ఏం కావాలంటే అది ఇస్తానని, మీరు కోరుకుంటే నేను ఏదైనా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని, మీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదని కిలాడీ లేడీ కళైసెల్వి ఆ పొలిటికల్ లీడర్స్ కు తియ్యటి మాటలు చెప్పింది.

 రాసలీలల వీడియోలు తీసిన బాయ్ ఫ్రెండ్

రాసలీలల వీడియోలు తీసిన బాయ్ ఫ్రెండ్

ఇదేదో బాగుంది అనుకున్న ఆ నాయకులు టక్కులాడి కళైసెల్వితో ఎంజాయ్ చెయ్యడానికి ఒంగోలు గిత్తల్లా వెనుకా ముందు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పొలిటికల్ లీడర్స్ తో కళైసెల్వి బెడ్ రూమ్ లో రాసలీలలు సాగిస్తూ బిజీ అయిపోయింది. అదే సమయంలో కళైసెల్వి బాయ్ ఫ్రెండ్ సెల్వా పక్కరూమ్ లో నుంచి కిటికీలో కిలాడీ లేడీతో ఆ రాజకీయ పార్టీల నాయకులు రాసలీలలు సాగిస్తున్న వీడియోలు సీక్రేట్ గా తీశాడు.

బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. లక్షలు లక్షలు లాగేశారు

బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. లక్షలు లక్షలు లాగేశారు

మొత్తం ఆరు మందిని వలలో వేసుకోవడానికి ప్రయత్నించి కిలాడీ లేడీ కళైసెల్వి వలలో ముగ్గురు మాత్రమే పడ్డారు. ముగ్గురు పైపైకి ఆమెతో చనువుగా ఉన్నట్లు నటించి ఆమెతో రాసలీలు సాగించకుండా తప్పించుకున్నారు. అంతే అక్కడ నుంచి తనతో రాసలీలలు సాగించిన ముగ్గురు పొలిటికల్ లీడర్స్ తో కళైసెల్వి ఆమె ఫుడ్ బాల్ ఆడుకుంది. మీరు నాతో రాసలీలు సాగించిన వీడియోలు మీ భార్యలకు పంపిస్తానని, మీ హైకమాండ్ నాయకులకు పంపించి మీ రాజకీయ జీవితానికి చెక్ పెడుతానని కళైసెల్వి వారిని బ్లాక్ మెయిల్ చేసింది.

డబ్బులు విషయంలో తేడా వచ్చేసింది

డబ్బులు విషయంలో తేడా వచ్చేసింది

ఆ ముగ్గురు నాయకుల నుంచి ఇప్పటి వరకు రూ. లక్షలు లక్షలు లాగడం మొదలు పెట్టింది. ఎప్పుడంటే అప్పుడు వారికి ఫోన్లు చేసిన కళైసెల్వి డబ్బులు లాక్కొనింది. కిలాడీ లేడీ కళైసెల్వి, ఆమె బాయ్ ఫ్రెండ్ సెల్వా, అతని ఫ్రెండ్ రూపక్ ల మధ్య పొలిటికల్ లీడర్స్ ను బ్లాక్ మెయిల్ చేసి సంపాధిస్తున్న డబ్బులు పంచుకునే విషయంలో తేడాలు వచ్చాయి.

కిలాడీ లేడీని కిడ్నాప్ చేసి ఆమెతో స్టోరీ మొత్తం చెప్పించాడు

కిలాడీ లేడీని కిడ్నాప్ చేసి ఆమెతో స్టోరీ మొత్తం చెప్పించాడు

పొలిటికల్ లీడర్స్ ను బ్లాక్ మెయిల్ చేసి సంపాధిస్తున్న డబ్బుల్లో తనకు ముష్టి మాత్రం వేస్తున్నారని, డబ్బు మొత్తం కళైసెల్వి, ఆమె ప్రియుడు సెల్వా తీసుకుంటూ తనను మోసం చేస్తున్నారని రూపక్ రగిలిపోయాడు. ఇదే సమయంలో కళైసెల్విని చాకచక్యంగా కిడ్నాప్ చేసిన రూపక్ ఆమెను కట్టేసి చంపేస్తానని బెదిరించాడు. ఇంతకాలం కళైసెల్వి ముగ్గురు పొలిటిలక్ లీడర్స్ ను ఎలా లొంగదీసుకుని వారితో సరసాలు ఆడింది, ప్రియుడు సెల్వాతో కలిసి ఎలా వీడియోలు తీపించి బ్లాక్ మెయిల్ చేసింది అనే పూర్తి సమాచారం ఆమెతోనే పిన్ టూ పిన్ చెప్పించిన రూపక్ దానిని వీడియో తీశాడు.

ధైర్యం చేసి ముందుకు వచ్చిన మాస్ లీడర్

ధైర్యం చేసి ముందుకు వచ్చిన మాస్ లీడర్

కళైసెల్వి బ్లాక్ మెయిల్ దందా గురించి వీడియో తీసిన రూపక్ దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో కళైసెల్వి ఉచ్చులోపడి ఇప్పటికే లక్షలు లక్షలు సమర్పించుకున్న ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు నాగేంద్రన్ ధైర్యంగా ముందుకు వచ్చి కిలాడీ లేడీ మీద సేలంలో కేసు పెట్టాడు. అయితే మరో ఇద్దరు రాజకీయ పార్టీ నాయకులు మాత్రం కళైసెల్వి మీద కేసులు పెట్టడానికి ధైర్యం చెయ్యలేకపోయారు.

రాసలీలల వీడియోలు అడ్డం పెట్టుకున్న కళైసెల్వి వాటిని మీ హైకమాండ్ కు పంపిస్తానని, మీరు రాజకీయ భవిష్యుత్తు లేకుండా చేస్తానని ఇంతకాలం బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులు అంటున్నారు. కిలాడీ లేడీ కళైసెల్వి, ఆమె ప్రియుడు సెల్వాను అరెస్టు చేసి విచారణ చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Khiladi lady: Salem woman cheats three politicians after becoming close with them with a help of boyfriend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X