• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi wife: నా భర్త అలాంటోడు, రాత్రి... ష్ ?, అందుకే జిమ్ మాస్టర్ తో జ్యూస్, భార్య వీడియో వైరల్!

|

చెన్నై/ మదురై/ బెంగళూరు: కొవ్వు కరిగించడానికి తన భర్తే తనను జిమ్ లో చేర్చాడని, తన భర్త కారణంగానే తాను జిమ్ మాస్టర్ కు దగ్గరై అతనితో గుర్రం ఎక్కి వెళ్లిపోయానని భార్య వీడియో విడుదల చేసింది. తన భర్త ఎలాంటోడో మీరు వినండి, ప్రేమించి పెళ్లి చేసుకుని నన్ను నిలువునా ముంచేశాడు. ఈ రోజు భర్త దూరం అయ్యాడు, కొవ్వు కరిగించే జిమ్ మాస్టర్ నన్ను చూసుకుంటున్నాడు. తనను ఇంట్లోకి రానివ్వమని పుట్టింటోళ్లు తేల్చి చెప్పారు. నా బతుకు బస్సులు లేని బస్ స్టాండ్ అయిపోయింది అంటూ కన్నీటితో బోరున విలపిస్తూ భార్య విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కట్టుకున్న భర్త తన్ని తరిమేయడం, కన్న తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంతకాలం జిమ్ మాస్టర్ తో జల్సాలు చేసిన భార్య పోలీసులను ఆశ్రయించింది.

Illegal affair: రాత్రి కారులో ప్రియుడితో భార్య రొమాన్స్, భర్త వీడియో కాల్ చేశాడు, కట్ చేస్తే !

 గొప్పగా లవ్ మ్యారేజ్ చేసుకుంది

గొప్పగా లవ్ మ్యారేజ్ చేసుకుంది

తమిళనాడులోని మదురై జిల్లాలోని పెరుంగుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ (27) అనే యువకుడు మదురై విమానశ్రయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజేష్, కనిమొళి అనే యువతి మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని తరువాత పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నారు. రాజేష్, కనిమొళి దంపతులకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో పెద్దల సలహామేరకు ఆ దంపతులు వైద్యులను సంప్రధించారు. రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని, కనిమొళి గర్బాశయంలో నీరు ఎక్కువగా ఉందని, అదే విధంగా ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టలేదని వైద్యులు చెప్పారు.

కొవ్వు తగ్గుతుంది అనుకుంటే కొవ్వు పెరిగింది

కొవ్వు తగ్గుతుంది అనుకుంటే కొవ్వు పెరిగింది

శరీరంలోని కొవ్వు కరిగించడానికి, గర్భాశయంలోని నీళ్లు తగ్గించుకోవడానికి కనిమొళి మదురైలోని విల్లాపురం ప్రాంతంలో యోగేష్ ఖన్నా నిర్వహిస్తున్న జిమ్ లో చేరింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా జిమ్ కు వెలుతున్న కనిమొళి జిమ్ మాస్టర్, జిమ్ సెంటర్ యజమాని అయిన యోగేష్ ఖన్నాతో చనువుగా ఉంటున్న కనిమొళి అతనితో జిగేల్ రాణి లెవల్లో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రతిరోజు జిమ్ కు వెళ్లి గంటలు గంటలు అక్కడే గడుపుతున్న కనిమొళి జిమ్ మాస్టర్ అయిన ప్రియుడు యోగేష్ ఖన్నాతో ఎంజాయ్ చేస్తూ అతనికి మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఇంటికి వెళ్లి భర్త రాజేష్ కు ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టేది. యోగేష్ ఖన్నా, కనిమోళి వ్యవహారం భర్త రాజేష్ కు తెలిసిపోవడంతో అతను భార్యను జిమ్ కు వెళ్లకుండా అడ్డుకున్నాడు.

భార్య రగిలిపోయింది

భార్య రగిలిపోయింది

ప్రియుడు యోగేష్ ఖన్నాను కలవలేకపోయిన కనిమొళి రగిలిపోయింది. వెంటనే ప్రియుడు యోగేష్ ఖన్నాకు ఫోన్ చేసిన కనిమొళి నా భర్త రాజేష్ అంతు చూసి నన్ను ఇక్కడి నుంచి పిలుచుకుని వెళ్లిపో అని చెప్పింది. గత నెల 26వ తేదీ రాత్రి జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా అతని జిమ్ కు వస్తున్న కొందరిని వెంట పెట్టుకుని నేరుగా ప్రియురాలు కనిమొళి ఇంటి దగ్గరకు వెళ్లాడు. భర్త రాజేష్ ను చంపేస్తామని బెదిరించిన యోగేష్ ఖన్నా అతని భార్య కనిమొళిని లేపుకుని వెళ్లిపోయాడు. రాజేష్ తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. పోలీసులు అందర్నీ పిలిపించి మాట్లాడి యోగేష్ ఖన్నాపై కేసు నమోదు చేసి రాజేష్, కనిమోళికి సర్దిచెప్పి పంపించారు.

తన్నితరిమేసిన రాజేష్

తన్నితరిమేసిన రాజేష్

ప్రేమించి పెళ్లి చేసుకుని నన్నే మోసం చేస్తావా ? మా కుటుంబం పరువు రోడ్డున పడేస్తావా ? అంటూ భర్త రాజేష్ భార్య కనిమొళిని ఇంటి నుంచి గెంటేశాడు. ఈ సందర్బంలో దిక్కుతెలీక భార్య కనిమొళి ఓ వీడియో విడుదల చేసింది. తన భర్త రాజేష్ ఎలాంటి వాడో మీరు చూడండి అంటూ కనిమొళి కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియోలో బోరున విలపించింది.

 జిమ్ మాస్టర్ తో అందుకే అలా !

జిమ్ మాస్టర్ తో అందుకే అలా !

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త రాజేష్ ప్రతిరోజు తనను చితకబాదేవాడని భార్య కనిమొళి ఆరోపించింది. రాత్రి తనతో సంసారం చెయ్యడని, తనను చిత్రహింసలకు గురి చేస్తాడని కనిమొళి ఆరోపించింది. జిమ్ కు వెలుతున్న తాను జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నాతో తన బాధను చెప్పుకున్నానని, ఆయన తనను ఓదార్చేవాడని కనిమొళి వీడియోలో వివరించింది.

ఆ ఇంట్లో జిమ్ మాస్టర్ పెట్టాడు

ఆ ఇంట్లో జిమ్ మాస్టర్ పెట్టాడు

తన భర్త రాజేష్ వేధింపుల నుంచి తనను రక్షించడానికి జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నా తనను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చాడని కనిమొళి వీడియోలో వివరించింది. తరువాత యోగేష్ ఖన్నా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తనను ఆ ఇంట్లో పెట్టాడని, తాను ఇన్ని రోజులు ఇక్కడే ఉంటున్నానని కనిమొళి వివరించింది. ఇప్పుడు తాను జిమ్ మాస్టర్ యోగేష్ ఖన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని తన భర్త రాజేష్ ప్రచారం చేస్తున్నాడని కనిమొళి విలపించింది. తన భర్త రాజేష్ నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదని, తనకు ఎవరు న్యాయం చేస్తారు ? అంటూ కనిమొళి కన్నీటితో ఆమె మీద నిందలు వేసినవాళ్లను ప్రశ్నిస్తున్నది.

 గేటుకు తాళం వేసిన తల్లిదండ్రులు

గేటుకు తాళం వేసిన తల్లిదండ్రులు

కనిమొళి పుట్టింటికి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఆమె తల్లిదండ్రలుు ఇంట్లోకి రానివ్వడం లేదు. ఈ విషయంపై తన భర్త రాజేష్ కారణంగా తన తల్లిదండ్రులు దూరం అయ్యారని కనిమొళి ఆరోపించింది. తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాధించడానికి ప్రయత్నిస్తున్నానని. అయితే తన సర్టిఫికెట్లు అన్నీ తన భర్త రాజేష్ ఇంట్లో పెట్టుకున్నాడని, నా సర్టిఫికెట్లు నాకు ఇవ్వడానికి అతను నిరాకరిస్తున్నాడని కనిమొళి ఆరోపించింది. అయితే కనిమొళి నాటకాలు వేస్తోందని, కొవ్వు పట్టి జిమ్ మాస్టర్ తో ఇంకా తిరుగుతుందని, ఆమె చెప్పేదాంట్లో ఒక్కనిజం కూడా లేదని ఆమె భర్త రాజేష్ ఆరోపిస్తున్నాడు. మొత్తం మీద ఇన్ని రోజులు తీవ్ర చర్చకు కారణం అయిన కనిమొళి చివరికి ఈ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం కనిమొళి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రాజేష్ ను మోసం చేసి ప్రియుడు యోగేష్ తో తిరిగినప్పుడు ఈ బుద్ది ఏమైయ్యింది ? అంటూ నెటిజన్లు కనిమొళికి చివాట్లు పెడుతున్నారు.

  Bizarre! Google Shows Anushka Sharma Is The Wife Of Rashid Khan! || Oneindia Telugu
  బతుకు జట్కాబండి

  బతుకు జట్కాబండి

  భార్య కనిమొళిని ఆమె భర్త రాజేష్ ఇంట్లో నుంచి బయటకు తరిమేశాడు. ప్రేమ పెళ్లి చేసుకుని మా పరువు తీశావని, ఇప్పుడు భర్తను కాదని జిమ్ మాస్టర్ తో తిరిగి జల్సాలు చేసి మా పరువు రోడ్డున పడేశావని కనిమొళిని ఆమె తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడం లేదు. యోగేష్ ఖన్నా చూసిన ఇంట్లో ప్రస్తుతం కనిమొళి కాలం గడుపుతోంది. యోగేష్ ఖన్నాకు మోజు తీరిపోయిన తరువాత అతను చేతులు ఎత్తేస్తే నువ్వు ఏం చేస్తావ్ ? అంటూ కనిమొళిని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన సర్టిఫికెట్లు తనకు ఇప్పిస్తే తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాధించుకుని నా బతుకు నేను బతుకుతానని కనిమొళి ఇప్పుడు మదురై పోలీసులను ఆశ్రయించింది.

  English summary
  Khiladi wife: Madurai young woman released video about her husband. Madurai women escape with gym master for love during exercise.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X