• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady lawyer: కిలాడీ క్రిమినల్ స్కెచ్, మోహినికి భర్త సపోర్టు, దెబ్బకు రెండు జీవిత ఖైదు శిక్షలు, అకౌంట్ క్లోజ్ !

|

చెన్నై/ కోయంబత్తూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన లేడీ క్రిమినల్ లేడీ లాయర్ ఆమె ఫ్రెండ్స్ తో కలిసి అమాయక ప్రజల నుంచి రూ. 12 కోట్లకు పైగా నామం పెట్టింది. చీటింగ్ కేసులో 6 కేసులు నమోదు కావడంతో లేడీ లాయర్ అజ్ఞాతంలో గడిపింది. చీటింగ్ కేసుల్లో చిక్కుకున్న లేడీ లాయర్ తాను చనిపోయానని ప్రభుత్వాన్ని, ప్రజలను నమ్మించడానికి భర్త ఫ్రెండ్, డ్రైవర్ సహాయంతో ఓ అమాయకురాలిని దారుణంగా చంపేసింది. తరువాత లేడీ లాయర్ బతికున్నట్లే ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించింది. లేడీ లాయర్ భర్త కూడా క్రిమినల్ లాయర్ కావడంతో కేసును సులభంగా తప్పించుకోవచ్చని స్కెచ్ వేశారు. పరిస్థితులు అనుకూలించక లేడీ లాయర్ పోలీసులకు చిక్కిపోయింది. లేడీ లాయర్ తో పాటు ఆమె భర్త అయిన క్రిమినల్ లాయర్, కారు డ్రైవర్ కు కోర్టు రెండుయావజ్జీవ కారాగార శిక్షలతో పాటు భారీ జరిమానా విధించింది.

Shock: 15 ఏళ్ల అమ్మాయిపై 400 మంది రేప్, లైంగిక దాడి, లిస్టులో డాక్టర్లు, ఇన్స్ పెక్టర్లు, బీజేపీ లీడర్, వీఐపీలు, ఆంటీ !

క్రిమినల్ లాయర్ సూపర్ స్కెచ్

క్రిమినల్ లాయర్ సూపర్ స్కెచ్

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని శివానందకాలనీలో మారిముత్తు, అమ్మసాయ్ (45) దంపతులు నివాసం ఉండేవారు. మారిముత్తు, అమ్మసాయ్ దంపతుల మధ్య గొడవలు జరగడంతో 10 ఏళ్ల క్రితం వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. ఆస్తి కోసం కోర్టుకు వెళితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని భావించిన అమ్మసాయ్ 2011 డిసెంబర్ 11వ తేదీన కోయంబత్తూరులోని గోపాలపురంలోని న్యాయవాది రాజవేల్ కార్యాలయానికి వెళ్లింది. అంతే లాయర్ దగ్గరకు వెళ్లిన అమ్మసాయ్ తరువాత ఇంటికి తిరిగి వెళ్లలేదు. అమ్మసాయ్ ని గొంతు కోసి హత్య చేశారు తరువాత శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు.

శకుంతల దేవి ఎంట్రీ

శకుంతల దేవి ఎంట్రీ

లాయర్ రాజవేల్ అమ్మసాయ్ శవాన్ని తన భార్య మోహనా మహిళ మృతదేహంగా చిత్రీకరించి ఓ డాక్టర్ సహాయంతో మోహనా డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు.

లాయర్ ఇంటికి వెళ్లిన తన తల్లి అమ్మసాయ్ ఇంటికి రాలేదని అమ్మసాయ్ కుమార్తె శుకుంతలా దేవి లాయర్ రాజవేల్ కార్యాలయానికి వెళ్లి విచారించింది. లాయర్ ఇంటికి వెళ్లిన తన తల్లి కనపడటం లేదని అమ్మసాయ్ కుమార్తె శకుంతల దేవి కోయంబత్తూరులోని రత్నపుర పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అప్పట్లో కేసు నమోదైయ్యింది. పోలీసుల విచారణలో అమ్మసాయ్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

మోహనా కాదు కిలాడి మోహిని

మోహనా కాదు కిలాడి మోహిని

కోయంబత్తూరు పోలీసుల విచారణలో మోహనా (47) అనే మహిళ పేరు తెర మీదకు వచ్చింది. లాయర్ రాజవేల్ భార్య మోహన, మోహనా కూడా లాయర్ అని పోలీసులు గుర్తించారు. ఒడిశాలో ఫ్రెండ్స్ తో ఓ ఆర్థిక సంస్థను ప్రారంభించిన మోహన అక్కడి అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి వారి నుంచి రూ. 12 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఒడిశాలో లేడీ లాయర్ మోహనా మీద 6 కేసులు నమోదైనాయని పోలీసులు గుర్తించారు. ఒడిశా పోలీసులు కూడా మోహనా కోసం గాలించినా ఆమె మాత్రం వాళ్లకు చిక్కకుండా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తలదాచుకుంది.

క్రిమినల్ లాయర్ స్కెచ్

క్రిమినల్ లాయర్ స్కెచ్

తన భార్య మోహనాను ఎలాగైనా కాపాడుకోవాలని చాలా రోజులు క్రిమినల్ లాయర్ రాజవేల్ ఆలోచించాడు. అదే సమయంలో అమ్మసాయ్ అక్కడికి వెళ్లడంతో ఇంచుమించు తన భార్య మోహనా వయసు కూడా అదే కావడంతో ఆమెను చంపేయాలని రాజవేల్, అతని భార్య మోహనా స్కెచ్ వేశారు. అనుకున్నట్లే రాజవేల్, మోహనా దంపతులు, వారి సహచరుడు బోన్ రాజ్, కారు డ్రైవర్ పళనిస్వామి కలిసి అమ్మసాయ్ ను గొంతు కోసి చంపేశారని కోయంబత్తూరు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

చేసిన పాపం వెంటాడింది

చేసిన పాపం వెంటాడింది

కేసు నమోదు చేసిన కోయంబత్తూరులోని రత్నపుర పోలీసులు 2013లో లాయర్ రాజవేల్, అతని భార్య, లేడీ లాయర్ మోహనాతో పాటు కారు డ్రైవర్ పళనిస్వామిని అరెస్టు చేశారు. ఇదే కేసులో బోన్ రాజ్ అప్రూవర్ గా మారడంతో పోలీసులు అతన్ని ప్రత్యక్షసాక్షిగా చేర్చారు. లాయర్ దంపతులు రాజవేల్, మోహనాతో పాటు కారు డ్రైవర్ పళనిస్వామి అమాయకురాలు అమ్మసాయ్ ని హత్య చేశారని కోర్టులో రుజువు అయ్యింది.

రెండు సార్లు యావజ్జీవ కారాగారశిక్ష

రెండు సార్లు యావజ్జీవ కారాగారశిక్ష

కోయంబత్తూరులోని 5వ అదనపు కోర్టు అమ్మసాయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన క్రిమినల్ లాయర్లు రాజవేల్, అతని భార్య మోహనాకు యావజ్జీవ కారాగార శిక్ష, మరో సారి ఇద్దరికీ యావజ్జీవ శిక్షతో పాటు రూ. 1 లక్ష 55 వేలు జరిమానా, మరోసారి రూ. 1 లక్షా 20 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. క్రిమనల్ లాయర్లకు సహకరించిన కారు డ్రైవర్ పళనిస్వామికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. భార్య మోహనా పేరుతో ఆస్తి ఉండటం, దాని లావాదేవీల కోసం లాయర్ రాజవేల్ ఆమె బతికుందని సర్టిఫికెట్ సంపాదించడానికి ప్రయత్నించారని కోయంబత్తూరులోని రత్నపుర పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Lady lawyer: Double Life Sentence for Couple in Coimbatore Murder case in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X