• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lady techie: అమ్మా, కూతురిని నిమిషంలో నరికేశారు, కూతురి ప్రేమా.... లేక ? ఇంట్లోనే?!

|

చెన్నై/ టీ.నగర్: అమ్మ ఇంటి ఇల్లాలు. కూతురు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో కూతురు ఇంట్లో ఉంది. తండ్రి టిఫిన్ చేసి బయటకు వెళ్లిపోవడంతో ఇంటి పని చేస్తున్న తల్లికి కూతురు సహాయం చేస్తోంది. అదే సమయంలో ఇద్దరు యువకులు ఇంట్లోకి రెండు వేటకొడవళ్లు చేత పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. అమ్మా, కూతురిని అడ్డంగా నరికేసి బయటకు వెళ్లారు.

చట్టుపక్కల వాళ్లు ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో రక్తచరిత్ర సినిమాలోలాగా రేయ్..... వచ్చారంటే నరికేస్తాం..... అంటూ అక్కడి వాళ్లను వేటకొడవళ్లతో బెదిరించి కారులో దర్జాగా వెళ్లిపోయారు. తల్లి ప్రాణం పోవడం, కూతురికి తీవ్రగాయాలు కావడం కలకలం రేపింది. కూతురి ప్రేమ వ్యవహారామా ? లేక మరేదైనా కారణమా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దారుణం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

చెన్నైలో సింపుల్ ఫ్యామిలీ

చెన్నైలో సింపుల్ ఫ్యామిలీ

చెన్నై సిటీలోని అమినంజకరై ప్రాంతంలోని వెల్లార్ వీధిలో కల్నల్ కన్నన్, జయంతి (44) దంపతులు నివాసం ఉంటున్నారు. కల్నల్ కన్నన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కల్నల్ కన్నన్, జయంతి దంపతులకు మోనికా (23) అనే కుమార్తె ఉంది. విద్యాభ్యాసం పూర్తి చేసిన మోనికా చెన్నైలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

మోనికా వర్క్ ఫ్రమ్ హోమ్

మోనికా వర్క్ ఫ్రమ్ హోమ్

మోనికా ప్రస్తుతం మోనికా వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంటి నుంచి విధులు నిర్వహిస్తోంది. ఉదయం 11.30 గంటలకు కల్నల్ కన్నన్ ఇంట్లో టిఫిన్ చేసి పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో తల్లి జయంతి, ఆమె కుమార్తె మోనికా వారివారి పనుల్లో బిజీ అయ్యారు. ఇదే సమయంలో కొంత గ్యాప్ చిక్కడంతో మోనికా కూడా తల్లి జయంతి చేస్తున్న వంటపనికి సహాయం చెయ్యడానికి వంట గదిలోకి వెళ్లింది.

అమ్మా... కూతురు చేసిన తప్పు అదే

అమ్మా... కూతురు చేసిన తప్పు అదే

మోనికా, ఆమె తల్లి జయంతి ఇంటి మేడ మీద ఇంటి పని చేస్తున్న సమయంలో వాళ్లు మెయిన్ డోర్ కు లాక్ చెయ్యడం మరిచిపోయారు. అదే సమయంలో ఇద్దరు యువకులు రెండు వేటకొడవళ్లు చేతిలో పట్టుకుని లేడీ టెక్కి మోనికా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా మేడమీదకు వచ్చిన ఇద్దరు యువకులను చూసి మోనికా, ఆమె తల్లి షాక్ అయ్యారు.

నిమిషంలో నరికేశారు

నిమిషంలో నరికేశారు

టెక్కీ మోనికా, ఆమె తల్లి ఎవరు మీరు ? అని ప్రశ్నిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు వేటకొడవళ్లతో అడ్డంగా ఇష్టం వచ్చినట్టు నరికేశారు. తీవ్రగాయాలైన తల్లీ, కూతురు గట్టిగా కేకలు వేశారు. అదే సమయంలో మేడమీద నుంచి కిందకు దిగిన ఇద్దరు యువకులను పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు.

రక్తచరిత్ర సినిమా టైపులో

రక్తచరిత్ర సినిమా టైపులో

స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరు యువకులు వేటకొడవళ్లను గాలిలో తిప్పుతూ రేయ్... దగ్గరకు వస్తే మిమ్మల్ని నరికేస్తాం... అంటూ వాళ్లను బెదిరించారు. అదే సమయంలో పక్కనే పార్క్ చేసిన కారు అక్కడికి రావడంతో ఇద్దరు యువకులతో కలిసి ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనారు. ఇద్దరు యువకులు ఇంట్లోకి వెళ్లి మోనికా, ఆమె తల్లి జయంతిని నరికి తిరిగి కారులో పారిపోతున్న పూర్తి తతంగం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

తల్లి ప్రాణం పోయింది... ఐసీయూలో మోనికా

తల్లి ప్రాణం పోయింది... ఐసీయూలో మోనికా

మేడ మీదకు పరుగు తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే రక్తపుమడుగులో పడి కొట్టుకుంటున్న తల్లి జయంతి, కూతురు మోనికాను కీల్ పాక్కం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన గంటలోపు తల్లి జయంతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లేడీ టెక్కీ మోనికాకు తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది.

ప్రేమ వ్యవహారామా ? లేక

ప్రేమ వ్యవహారామా ? లేక

తల్లి, కూతురిని పట్టపగలు రద్దీగా ఉండే ప్రాంతంలో నరికివేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీలు పరిశీలించి అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మోనికా తండ్రి కల్నల్ కన్నన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మోనికా ప్రేమ వ్యవహారంలో ఈ దారుణం జరిగిందా?, లేక జయంతి, ఆమె కుమార్తెను హత్య చెయ్యడానికి అక్రమ సంబంధాలు ఏమైనా కారణం అయ్యాయా ?, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా ?, కల్నల్ కన్నన్ కథ ఏమిటి ? అంటూ పోలీసులు అనేక కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు.

English summary
lady techie: The mother of an IT female employee was hacked to death in a house in Aminjikarai Chennai City. IT female employee also burtly attacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X