• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

liquor effect: హోటల్ లో హీరోయిన్ ఎంజాయ్, అరెస్టు, రూ. 10 వేలు ఫైన్, ప్రపంచంలో నేనేనా!

|

చెన్నై/ బెంగళూరు: పీకలదాక మద్యం సేవించి జనసంచారం ఎక్కువ ఉన్న రోడ్డులో విలాసవంతమైన కారును విచ్చలవిడిగా నడిపిన నటికి దూలతీరిపోయింది. స్థానికులకు చుక్కలు చూపించి విచ్చలవిడిగా కారు నడిపిన నటిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంత హంగామా చేసింది ఎవరబ్బా ? అంటూ ఆరా తీసిన పోలీసులు షాక్ కు గురైనారు. నటిని అరెస్టు చేసి మరోసారి ఇలా జరిగితే కథ వేరుగా ఉంటుందని అమ్మడుకి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు రూ. 10,000 ఫైన్ వేశారు. నేను మద్యం సేవించలేదు, బీర్లు మాత్రమే తాగాను, అయినా ప్రపంచంలో నేనుమాత్రమే తాగుబోతునా ? ఎందుకు నా వెంట పడుతున్నారు అంటూ ఆ మహానటి మీడియాపై చిందులు వేసింది. నటికి నచ్చచెప్పిన ఓ పొలిటికల్ లీడర్ ఆమెను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లి మీడియాకు సారీ చెప్పారు.

Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

 చెన్నై ఆర్కాట్ రోడ్డులో రచ్చరచ్చ

చెన్నై ఆర్కాట్ రోడ్డులో రచ్చరచ్చ

చెన్నై సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ఇప్పటికీ అనేక ఆంక్షలు అమలులో ఉన్నాయి. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలోని అర్కాట్ రోడ్డులో అర్దరాత్రి కారును ఇష్టం వచ్చినడుపుతూ అటు వైపు వెలుతున్న వాహనాలను ఢీకొట్టడానికి ప్రయత్నించడంతో కలకలం రేపింది. ఆ కారు ఇష్టం వచ్చినట్లు రావడంతో భయంతో చాలా మంది వాహనచోదకులు వారి కార్లు రోడ్డు పక్కన నిలిపేసి దేవుడా, ఏమిటి ఈ రచ్చ అంటూ ఆందోళనకు గురైనారు.

కర్ణాటక రిజిస్టర్ కారు

కర్ణాటక రిజిస్టర్ కారు

ఆర్కాట్ రోడ్డులో నానా రచ్చ చేస్తున్న కారును కొందరు స్థానికులు వారి వాహనాలతో వెంబడించారు. చెన్నైలోని నుంగంబాక్కం మీదుగా కోడంబక్కం ఫ్లైఓవర్ మీద నుంచి కర్ణాటక రాష్ట్రంలో (బెంగళూరు)లో రిజిస్టర్ అయిన విలాసవంతమైన కారు వడపళని వైపు దూసుకుపోయింది. చిరికి స్థానికులు ప్రాణాలకు తెగించి వడపళనిలోని ఓ సినిమా థియేర్ సమీపంలో కారును అడ్డగించారు. ఆ సమయంలో ఆ కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొని నిలిచిపోయింది.

మద్యం మత్తులో నాట్యం చేసిన నటి వంశిక

మద్యం మత్తులో నాట్యం చేసిన నటి వంశిక

కారు నడుపుతున్నది మగాడు కాదని, ఓ యువతి అని గుర్తించిన స్థానికులు షాక్ కు గురైనారు. ఆ సమయంలో కారు నడుపుతున్న యువతి ఆ వాహనంలో నుంచి బయటకు వచ్చి మద్యం మత్తు నిషాలానికి ఎక్కడంతో నిలబడలేక రోడ్డు మీద నాట్యం చేస్తున్నట్లు నడించింది. వామ్మో అంటూ బయపడిన స్థానికులు వెంటనే వడపళని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థానికి వెళ్లారు. కారు నడుపుతున్నది ఎవరా ? అని పోలీసులు ఆరా తియ్యగా ఆమె సినిమా హీరోయిన్ వంశిక అని వెలుగు చూడటంతో పోలీసులు సైతం షాక్ కు గురైనారు.

 స్టార్ హోటల్ లో మందు పార్టీలు

స్టార్ హోటల్ లో మందు పార్టీలు

నటి వంశికను అరెస్టు చేసి ఆమెకు మత్తు దిగిన తరువాత పోలీసులు విచారణ చేశారు. నుంగంబాక్కంలోని ఓ స్టార్ హోటల్ లో వైన్ పార్టీకి హాజరై తాను ఇంటికి బయలుదేరానని నటి వంశిక పోలీసులకు చెప్పింది. తాను బ్రాందీ, విస్కీ, రమ్ తాగలేదని, బీర్లు మాత్రమే తాగానని, తాను మద్యం సేవించలేదని నటి వంశిక చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు.

దెబ్బకు దూలతీరిపోయింది

దెబ్బకు దూలతీరిపోయింది

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అతివేగంగా కారు నడిపారని, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, మద్యం సేవించి కారు నడిపారని నటి వంశిక మీద చెన్నై సిటీ ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు బాలాజీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నటి వంశికను విడిపించుకుని వెళ్లారు.

 రూ. 10,000 ఫైన్.. తాగుబోతు నటికి లాస్ట్ వార్నింగ్

రూ. 10,000 ఫైన్.. తాగుబోతు నటికి లాస్ట్ వార్నింగ్

ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిని వదిలేస్తారని, సామాన్యులు అలా చేస్తే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారని విమర్శలు ఎదురైనాయి. పోలీసులు మళ్లీ నటి వంశికను వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నటి వంశికకు రూ. 10,000 అపరాద రుసుం విధించిన పోలీసు అధికారులు ఆమె నుంచి వసూలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు.

  Bizarre! Google Shows Anushka Sharma Is The Wife Of Rashid Khan! || Oneindia Telugu
   ప్రపంచంలో నేను మాత్రమే తాగుతున్నానా ? మీరు తాగరా

  ప్రపంచంలో నేను మాత్రమే తాగుతున్నానా ? మీరు తాగరా

  పోలీస్ స్టేషన్ లో రూ. 10 వేలు ఫైన్ కట్టిన నటి వంశిక బయటకు వచ్చి అక్కడ ఉన్న మీడియాపై శివతాండవం చేసింది. నేను మద్యం సేవించలేదు, బీర్లు మాత్రమే తాగాను అంటూ నటి వంశిక సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. బీర్లు మద్యం కాదా ? అని మీడియా ప్రశ్నిస్తే నటి వంశికకు ఎక్కడో కాలిపోయింది. ప్రపంచంలో నేను మాత్రమే మద్యం సేవిస్తున్నానా ? మీరు తాగరా ? మీలో మద్యం తాగనివాళ్లు ఎవరో చెప్పిండి ? అంటూ సినిమా డైలాగులు వేస్తూ రెచ్చిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు బాలాజీ మీడియాకు క్షమాపణ చెప్పి తాగుబోతు వంశికను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లిపోయారు. అన్నట్లు అమ్మడు వంశిక తమిళంలో సముదం చెయ్, ఉడరువల్ తదితర సినిమాల్లో నటించింది. అయితే లాక్ డౌన్ దెబ్బతో ఇంకా ఏఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే నటి వంశిక స్టార్ హీరోయిన్ లా బిల్డప్ ఇస్తోందని తమిళ ప్రజలు మండిపడుతున్నారు.

  English summary
  At midnight, actress vamshika was speeding the car under the influence of alcohol on Arcot Road, Kodambakkam. The frightened public surrounded him and handed him over to the police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X