Liquor lady: పోలీసులను ఎగిరెగిరి తన్నిన శివగామి, రేయ్... నేను ఎవరో తెలుసా, బూతులు, అసలే సినిమా ఫీల్డ్!
చెన్నై: సండే సందడి అంటూ సినీరంగానికి చెందిన శివగామి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పబ్ కు వెళ్లింది. సండే సాయంత్రం ఎన్నిగంటలకు బాయ్ ఫ్రెండ్ తో పబ్ కు వెళ్లిందో? ఏమో ? అర్దరాత్రి వరకు పుల్ గా మద్యం సేవించి బయటకు వచ్చి విలాసవంతమై కారులో రయ్ రయ్ అంటూ దూసుకుపోయారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవడంతో శివగామికి చిర్రెత్తిపోయింది. రేయ్ నువ్వు పోలీసు అయితే ఎందిరా ? నేను ఎవరో తెలుసా ? మా నాన్న ఎవరో తెలుసా ? అంటూ అమ్మనా బూతులు మాట్లాడింది. అక్కడికి వెళ్లిన లా అండ్ ఆర్డర్ పోలీసులను ఎగిరెగిరి కాలితో తన్నిన శివగామి అసలే సినిమా ఫీల్డ్ కావడంతో మద్యం మత్తులో పోలీసులను అమ్మనా బూతులు తిట్టింది. అసలే అర్దరాత్రి, పైగా అమ్మాయి, అప్పుడు ఏమీ చెయ్యలేని పోలీసులు సోమవారం ఉదయం ఏం చెయ్యాలో అది చెయ్యడంతో అమ్మడు దిమ్మతిరిగిపోయింది.
Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!

మద్యం రేట్లు అందుకే పెరిగిపోయాయి
ఈ మద్యం కాలంలో మద్యం రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయసుతో తేడా లేకుండా, ఆడామగ అనే తేడా లేకుండా చాలా మంది మద్యం తెగ తాగేయడంతో మద్యం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీకెండ్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు పబ్ లకు వెళ్లడం చాలా బాగా నేర్చుకున్నారు. శుక్ర, శని, ఆదివారం రోజుల్లో రాత్రి పూట యువతి, యువకులతో పబ్ లు కలకలడిపోతున్నాయి.

అసలే రద్దీ రోడ్డు
చెన్నైలోని తిరువన్నియూర్ ప్రాంతంలోని బస్ స్టాండ్ వెనుక రోడ్డు ప్రతిరోజు 24 గంటలు వాహనాల రద్దితో కిటకిలటాడుతుంటుంది. ఆదివారం అర్దరాత్రి తిరువన్నియూర్ ట్రాఫిక్ పోలీసులు నాకాబంధి నిర్వహిస్తూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు వేగంగా నడుపుతున్నారా ?, మద్యం మత్తులో ఇతర ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా ? అంటూ అన్ని వాహనాలు పరిశీలిస్తున్నారు.

ఖరీదైన కారు రయ్ రయ్ అంటూ వెళ్లింది
రద్దీగా ఉండే ప్రాంతంలో అర్దరాత్రి వాయువేగంతో వస్తున్న కారును తిరువన్నియూర్ పోలీసులు అడ్డగించారు. కారులో ఓ యువతి, యువకుడు ఉన్న విషయం గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వారిని ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న యువతి, యువకుడు ఏం మాట్లాడుతున్నారో అర్దం కాక పోలీసులు వారికి ప్రశ్నల వర్షం కురిపించారు.

అర్దరాత్రి మీకు ఏం పని ?
అర్దరాత్రి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ? మద్యం ఎంత సేవించారు ? అంటూ ట్రాఫిక్ పోలీసులు వారి దగ్గర ఉన్న యంత్రాలతో వారు ఎంత మోతాదులో మద్యం సేవించారు అని టెస్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు. అంతే కారులో ఉన్న శివగామి ఒక్కసారిగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. మమ్మల్ని ఎందుకు నిలిపారు ? మాతో మీకు ఏం పని అని శివగామి రెచ్చిపోయింది.

రేయ్.... నేను ఎవరనుకుంటున్నారు మా నాన్న ఎవరో తెలుసా ?
మేము ట్రాఫిక్ పోలీసులు మీరు మద్యం సేవించారా ? లేదా ? అని టెస్ట్ చెయ్యాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. రేయ్.... నేను ఎవరనుకున్నారు ? మా నాన్న ఎవరో తెలుసా ?, మీ అంతు చూస్తా..... అంటూ శివగామి అమ్మనా బూతులు తిట్టి ట్రాఫిక్ పోలీసులను కాలితో తన్నింది. ఓ యువతి మద్యం మత్తులో నానా రచ్చ చేస్తోందని తెలుసుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఖాకీ దుస్తుల్లో వెళ్లిన పోలీసులను చూసిన శివగామి మరింత రెచ్చిపోయి వారిని బూతులు తిడుతూ కాలితో ఎగిరెగిరితన్నింది. పోలీసులు కారు తాళాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో శివగామి మళ్లీ వాళ్లను నోటికివచ్చినట్లు తిట్టడంతో పోలీసులు షాక్ అయ్యారు.

అసలే అర్దరాత్రి..... పైగా అమ్మాయి
అసలే అర్దరాత్రి కావడం, పైగా అమ్మాయి పీకల వరకు మద్యం సేవించిం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు చాలా ఓపిగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు షర్టు బటన్స్ కు అమర్చిన రహస్య కెమెరాల్లో శివగామి రచ్చరచ్చ చెయ్యడం మొత్తం రికార్డు అయ్యింది. అంతే కాకుండా శివగామి, అమె స్నేహితుడు నానా రచ్చ చేస్తున్న సమయంలో పోలీసులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.

మేడమ్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్
బూతులు తిట్టి కాలితో పోలీసులనే తన్నిన యువతి గామిని అలియాస్ శివగామిని చెన్నైలోని అడియూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నదని, ఆమె సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోందని, ఆమెతో పాటు కారులో మద్యం సేవించి వచ్చిన యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు అని పోలీసులు గుర్తించారు. శివగామిని రాత్రి ఇంటికి పంపించిన పోలీసులు సోమవారం ఉదయం మీ తల్లితో కలిసి విచారణకు హాజరుకావాలని సూచించారు.

శివగామినికి సీన్ సితారా
సోమవారం తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన గామిని అలియాస్ శివగామిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులను ఎగిరెగిరి కాలితో తన్నారని, బూతులు తిట్టిందని, మద్యం సేవించి కారు నడిపారని అనేక సెక్షన్ ల కింద శివగామి అలియాస్ గామినిపై కేసులు నమోదు చేశామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద శివగామి హంగామాతో పోలీసులు, తమిళ సినీ రంగానికి చెందిన ఆమె సన్నిహితులు షాక్ అయ్యారు.