చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown: మూడు నెలల ముందే పోలీసు పెళ్లి, యముడికి లెటర్, ఆత్మహత్య, సీఎం మీటింగ్ కు వెళ్లి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వేలూరు/ కోయంబత్తూరు: మూడు నెలల క్రితం లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. పేరుకు పెళ్లి చేసుకున్నావే కాని ఎప్పుడు ఉద్యోగం..... ఉద్యోగం అంటూ ఊరిమీద పడుతున్నావని, ఇంట్లో ఎందుకు ఉండటం లేదని భార్య నిలదీసిందని తెలిసింది. ఇదే సమయంలో సీఎం మీటింగ్ తరువాత విధులు ముగించుకుని ఇంటికి వెళ్లి ఆ పోలీసులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ పోలీసులు ఏకంగా యుముడి పేరుతో ఓ లేఖ రాసిపెట్టాడు. యమధర్మరాజ నేను వచ్చేస్తున్నాను, నా మీద దయచూపించు, నా ఆత్మహత్య కొందరికి గుణపాఠం కావాలి అంటూ ఆ పోలీసు లేఖ రాసిపెట్టడంతో కలకలం రేపింది.

Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!

పోలీసు ఉద్యోగం

పోలీసు ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని వేలూరు జిల్లాలోని గన్యంపాండి సమీపంలోని కట్టుపుడి గ్రామంలో నివాసం ఉంటున్న ఇమ్రాన్ (23) అనే యువకుడు తమిళనాడు స్పెషల్ పోలీసు డివిజన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇమ్రాన్ కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.

మూడు నెలల క్రితం పెళ్లి

మూడు నెలల క్రితం పెళ్లి

ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇమ్రాన్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలోనే మంచి సంబంధం కుదరడటంతో ఇమ్రాన్ పెళ్లి చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. లాక్ డౌన్ సమయంలోనే ప్రభుత్వ నియమాల ప్రకారం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో మూడు నెలల క్రితం ఇమ్రాన్ పెళ్లి జరిగింది.

సీఎం మీటింగ్ నుంచి వెళ్లాడు... అంతే !

సీఎం మీటింగ్ నుంచి వెళ్లాడు... అంతే !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం వేలూరు జిల్లాలో పర్యటించారు. సీఎం ఎడప్పాడి పళనిస్వామి పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఇమ్రాన్ కు రాణిపేట సమీపంలోని కావేరిపక్కం ప్రాంతంలో విధులు నిర్వహించాలని పై అధికారులు సూచించారు. సీఎం పర్యటన ముగించుకున్న ఇమ్రాన్ గురువారం మద్యాహ్నం 2. 30 గంటలకు కట్టుపుడి గ్రామంలోని ఇంటికి వెళ్లాడు. ఇమ్రాన్ ను అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా గురువారం సాయంత్రం మాట్లాడారు.

 యమధర్మరాజ... వస్తున్నా అంటూ లెటర్

యమధర్మరాజ... వస్తున్నా అంటూ లెటర్

కుటుంబ సభ్యులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేసిన ఇమ్రాన్ తరువాత ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇమ్రాన్ ఆత్మహత్య చేసుకున్న గదిలో ఓ లేఖ ఉంది. ఆ లేఖలో కనికరం లేని ఓ యమధర్మరాజ, నేను వస్తున్నా ? తమిళనాడులో ఎమర్జెన్సీ కాలంలో ఖాకీలు (పోలీసులు) శక్తి వంచన లేకున్నా పని చేస్తున్నా నువ్వు వారి ప్రాణాలు తీసుకుని వెలుతున్నావు, కనీసం నేను పైకి వచ్చిన తరువాత నా మీద కనికరం చూపించు అని ఆ లేఖలో ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

ఆత్మహత్య చేసుకునే ముందు ఇమ్రాన్ స్వయంగా ఆ లేఖ రాశాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా ఇమ్రాన్ ఆత్మహత్య చేసుకున్నాడా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని విచారణ చేస్తున్నామని వేలూరు జిల్లా పోలీసులు తెలిపారు. పెళ్లి అయిన మూడు నెలలకే ఓ లేఖ రాసి ఇమ్రాన్ ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడు పోలీసు శాఖలో కలకలం రేపింది. ఇమ్రాన్ రాసినట్టు బయటకు వచ్చిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
lockdown: Policeman hanged suicide in vellore after marriage in 3 months. Vellore taluka police are investigating whether the workload was the cause of the suicide or something else.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X