• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

love marriage: ప్రియురాలితో అన్న ఎస్కేప్, కాలేజ్ విద్యార్థి లాకప్ డెత్ ?, ఊరు మొత్తం ఒక్కటై, ఎస్ఐ !

|

చెన్నై/ మదురై: అన్న ప్రియురాలితో కలిసిపారిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియుడి తమ్ముడు మరుసటి రోజు అనుమానాస్పదస్థితిలో చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు. ప్రియుడి సోదరుడు కాలేజ్ విద్యార్థికావడం, పోలీసులు పిలుచుకుని వెళ్లిన తరువాత అతను శవమై కనిపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊరు మొత్తం ఒక్కటై ఆందోళనకు దిగడంతో పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. తన తమ్ముడిని పోలీసులే కొట్టి చంపారని ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడంతో కలకలం రేపింది. దెబ్బకు ఎస్ఐకి షార్వా కారిపోయింది.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

ప్రియురాలితో పారిపోయిన అన్న

ప్రియురాలితో పారిపోయిన అన్న

తమిళనాడులోని మదురై జిల్లా పేరైయూర్ తాలుకా సాత్పూర్ సమీపంలోని అవైకారైపట్టి చదువగిరి మహాలింగం ఆలయం కొండ ప్రాంతంలో కన్నియప్పన్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. కన్నియప్పన్ కుమారులు ఇదయకవి, రమేష్ (18). ఇదయకవి అదే గ్రామంలో నివాసం ఉంటున్న పునిత అనే యువతితో కలిసి 15 రోజుల క్రితం ఇళ్లు వదిలిపారిపోయాడు. ఇదయకవి, పునిత వివాహాం చేసుకుని వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు.

 కిడ్నాప్ కేసు పెట్టిన పునిత ఫ్యామిలి

కిడ్నాప్ కేసు పెట్టిన పునిత ఫ్యామిలి

పునిత కోసం గాలించిన ఆమె కుటుంబ సభ్యులు ఫలితం లేకపోవడంతో తమ కుమార్తె కనపడటం లేదని సత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్పూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ (SI) జయకన్నన్ ప్రియుడి తండ్రి కన్నియప్పన్, అతని కుమారుడు రమేష్ ను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి విచారణ చేశారు. పోలీసులు మూడురోజుల నుంచి ప్రతిరోజు పిలుచుకుని వెళ్లడం విచారణ చెయ్యడం రాత్రి ఇంటికి పంపించడం చేస్తున్నారు.

 పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాయం

పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాయం

ప్రియుడు ఇదయకవి తమ్ముడు రమేష్ నాగర్ కోవిల్ లోని ప్రైవేట్ కాలేజ్ డిప్లొమా మెకానికల్ చదువుతున్నాడు. బుధవారం రమేష్ ను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. రాత్రి రమేష్ ఇంటికి వెళ్లలేదు. మరుసటి రోజు రమేష్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా అబ్బాయి ఎక్కడ ? అని పోలీసులను ప్రశ్నించారు. రాత్రి 7 గంటలకు రమేష్ ను ఇంటికి పంపించామని, అతను ఎక్కడికి వెళ్లాడో మాకు తెలీదని పోలీసులు చెప్పారు.

రమేష్ లాకప్ డెత్ ?

రమేష్ లాకప్ డెత్ ?

రమేష్ కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గాలించగా ఆలయం కొండ కింద ఉన్న పెద్ద చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. విచారణ పేరుతో రమేష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాకప్ డెత్ చేసి చెట్టుకు వేలాడిదీసి పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకుదిగారు.

 నిన్న తండ్రి కొడుకు, నేడు రమేష్ !

నిన్న తండ్రి కొడుకు, నేడు రమేష్ !

తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో ఇటీవల తండ్రి కుమారుడైన మొబైల్ షాప్ యజమానులు జయరాజ్, ఫినిక్స్ ల ప్రాణాలు లాకప్ డెత్ లో పోయాయని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జయరాజ్, ఫినిక్స్ వ్యవహారం మరిచిపోకముందే రమేష్ అనే కాలేజ్ విద్యార్థి అదే స్థితిలో శవమై కనిపించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రమేష్ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టుంకు తరలించడానికి ప్రయత్నించడతో అతని కుటుంబ సభ్యులు, ఊరు మొత్తం అడ్డుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

 నా తమ్ముడిని చంపేశారు

నా తమ్ముడిని చంపేశారు

విషయం తెలుసుకున్న ప్రియుడు ఇదయకవి, అతని ప్రియురాలు పునిత సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మేము ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నామని విచారణ పేరుతో రమేష్ ను పిలుచుకుని వెళ్లి పోలీసులే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఇదయకవి, పునిత మీడియా ముందు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న సుమారు రెండు వందల మందిని పోలీసులు ట్రక్కుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు .అయితే రమేష్ నివాసం ఉంటున్న గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు గుమికూడి ఆందోళనకు దిగడంతో కలకలం రేపింది.

  Sushant Singh Rajput Loves Sara Ali Khan More Than Rhea బ్రేకప్ కి రియానే కారణం !
  పోలీసుల షార్వా కారిపోయింది

  పోలీసుల షార్వా కారిపోయింది

  రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై స్థానికులు దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మదురై జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ సంఘటనా స్థానికి చేరుకుని వివరాలు సేకరించారు. లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ జయకన్నన్ తో పాటు మొత్తం ఐదు మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ మదురై జిల్లా ఎస్పీ సుజిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఐదు మంది పోలీసులపై కేసు నమోదు చేసి డీఎస్పీ మదిఅళగన్, ఇన్స్ పెక్టర్ జయప్రియ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో రమేష్ కుటుంబ సభ్యులు శాంతించారు. మొత్తం మీద ప్రేమ వివాహం చేసుకున్న జంట పారిపోవడంతో ప్రియుడి తమ్ముడ రమేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో తమిళనాడులో కలకలం రేపింది.

  English summary
  love marriage: A college student who was taken to the police station near Saptur to inquire about a romantic marriage was found hanging before the Satankulam incident was over. Relatives have blamed the police for the youth's death and a case has been registered against five policemen, including the Saptur police SI, who were involved in the protest for several hours.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X