చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lovers: అర్దరాత్రి ప్రియురాలి బెడ్ రూమ్ లో దూరాడు, గ్రహాలు అనుకూలించక అన్న ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

చెన్నై/పుదుక్కోటై: ప్రేమించిన ప్రియురాలితో ప్రియుడు బయట తిరుగుతూ కొంత కాలం క్షేపం చేశాడు. ప్రియురాలిని చూడాలని ఆశ, ప్రియురాలు పిలవడంతో అతను ఏకంగా అర్దరాత్రి ఆమె ఇంటిలోని బెడ్ రూమ్ లోకి దూరిపోయాడు. టైమ్, గ్రహాలు అనుకూలించకపోవడంతో అమ్మాయి అన్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడిని చితకబాదిన ప్రియురాలి అన్న ప్రాణం తీసేస్తా వెళ్లిపోరా అంటూ వదిలేశాడు. ప్రియుడి తల్లికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఇంటికి వెళ్లిన ప్రియుడి ప్రాణాలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి.

Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్!Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్!

ప్రియుడి చిన్న ఉద్యోగం

ప్రియుడి చిన్న ఉద్యోగం

తమిళనాడులోని పుదుక్కోటై సమీపంలోని బాలానగర్ లో సేతురామ్, కామాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. సేతురామ్, కామాక్షి దంపతులకు నల్లయ్య (23) అనే కుమారుడు ఉన్నాడు. ఇంటర్ పూర్తి చేసిన నల్లయ్య కోయంబత్తూరు చేరుకుని అక్కడ ఓ ఫేమస్ బేకరిలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం నల్లయ్య చిన్న ఉద్యోగం చేస్తూ హ్యాపీగానే జీవనం సాగిస్తున్నాడు.

ప్రియురాలితో ఎంజాయ్

ప్రియురాలితో ఎంజాయ్

నల్లయ్య నివాసం ఉంటున్న ఊరిలోనే 20 ఏళ్ల యువతి రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. నల్లయ్య, రాజేశ్వరి ప్రేమించుకున్నారు. నల్లయ్య, రాజేశ్వరి కొంత కాలం అక్కడక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజేశ్వరి అన్న ప్రభు (28)కు నల్లయ్య ప్రేమ వ్యవహారం తెలిసింది.

ప్రియుడు, తల్లికి వార్నింగ్

ప్రియుడు, తల్లికి వార్నింగ్

నీ పద్దతి మార్చుకోవాలని, నా చెల్లెలితో నువ్వు తిరగరాదని రెండుమూడు సార్లు ప్రభు నల్లయ్యకు వార్నింగ్ ఇచ్చాడు. నల్లయ్య తల్లి కామాక్షికి ఫోన్ చేసిన ప్రభు ఆమెకూడా వార్నింగ్ ఇచ్చాడు. అయితే నల్లయ్య ఏమాత్రం పట్టించుకోకుండా ప్రియురాలు రాజేశ్వరిని కలుస్తూనే ఉన్నాడు.

ప్రియురాలి ఇంట్లో దూరిన ప్రియుడు

ప్రియురాలి ఇంట్లో దూరిన ప్రియుడు

రాజేశ్వరి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న నల్లయ్య రాత్రి ఆమె ఇంటిలోకి దూరిపోయాడు. టైమ్ అనుకూలించకపోవడంతో ప్రభు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెడ్ రూమ్ లో సోదరి రాజేశ్వరి, ఆమె ప్రియుడు నల్లయ్యను చూసిన ప్రభు రగిలిపోయాడు. ప్రభును చూసిన వెంటనే నల్లయ్య అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

చితకబాదిన ప్రియురాలి అన్న

చితకబాదిన ప్రియురాలి అన్న

మరుసటి రోజు నల్లయ్య ఇంటి సమీపంలోని ఓ దుకాణం దగ్గర నిలబడి ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన ప్రభు నా చెల్లెలితో తిరగకూడదని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ నల్లయ్యను పట్టుకుని చితకబాదేశాడు. తీవ్రగాయాలైన నల్లయ్య ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన కుమారుడు నల్లయ్యకు మంచినీళ్లు తాగించిన అతని తల్లి కామాక్షి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది.

దెబ్బలు తట్టుకోలేక

దెబ్బలు తట్టుకోలేక

తల్లి కామాక్షి ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నల్లయ్య ఇంటిలోనే మూర్చపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ల సహాయంతో నల్లయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేటప్పటికే నల్లయ్య ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు.

ప్రియురాలి అన్న కొత్తకథ

ప్రియురాలి అన్న కొత్తకథ

నల్లయ్య తల్లి కామాక్షి కేసు పెట్టడంతో పోలీసులు ప్రభును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తాను చంపాలని నల్లయ్యను కొట్టలేదని, అర్దరాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించిస సమయంలో మాటామాటా పెరిగి గొడవ పెద్దది అయ్యిందని ప్రభు అంటున్నాడని పోలీసులు చెప్పారు. అర్దరాత్రి ప్రియురాలి ఇంటిలో దూరి నల్లయ్య ప్రాణాలు పోగొట్టుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Pudukottai lovers: A man killed his sister's boyfriend while met in Midnight. Tamil Nadu police registered case against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X