• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Marriage: పెళ్లి కొడుకు టెక్కీ, రిసెప్షన్ లో ?, ఇంటర్ పెళ్లి కొడుకు ఎంట్రీ, పెళ్లి కూతురా, మజాకా, షాక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/కడలూరు/ పర్రూటి: యువకుడు ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎంఎస్సీ పూర్తి చేసిన యువతి మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నది. ఇద్దరు కులాలు ఒక్కటే కావడం, ఇద్దరివి చాలా దగ్గర దగ్గర ఊర్లు కావడంతో వారికి పెళ్లి చెయ్యలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లికి యువతి, యువకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని నిర్ణయించిన పెద్దలు ఓ కల్యాణమండపంలో పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఉదయం నిశ్చితార్థం, రాత్రి రిసెప్షన్, మరుసటి రోజు ఉదయం ముహూర్తం. ఇది వీరి పెళ్లికి పంతులను నిర్ణయించిన ముహూర్తాలు. రాత్రి రిసెప్షన్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు శ్రీమంతులు కావడంతో అందరూ సంగీత్ కార్యక్రమానికి డ్యాన్స్ లు వేస్తున్నారు. ఆ సమయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కొన్ని పాటలకు డ్యాన్స్ లు ఇరగదీశారు. వరుసకు తమ్ముడు అయ్యే యువకుడితో పెళ్లి కూతురు డ్యాన్ చేస్తోంది. ఆ సమయంలో పెళ్లి కొడుకు అభ్యంతరం వ్యక్తం చేపి పెళ్లి కూతురితో డ్యాన్స్ చేస్తున్న యువకుడిని పక్కకు తోసేశాడు.

ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్న పెళ్లి కూతురు, ఆ యువకుడు మళ్లీ డ్యాన్స్ చేశారు. అంతే పెళ్లి కొడుక్కి ఎక్కడో కాలిపోయి అందరి ముందు రిసెప్షన్ హాల్ లోనే పెళ్లి కూతురి చెంపలు చెల్లుమనిపించాడు. ఎంఎస్సీ చేసిన ఆ అమ్మాయి ఊరికే ఉంటుందా ?, పెళ్లి కూతురు చేసిన పనికి పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

Wife: భార్యను చంపేయాలని డాక్టర్ ను వేడుకున్న భర్త, లేదంటే కష్టాలు వస్తాయని డాక్టర్ కే వార్నింగ్, 420!Wife: భార్యను చంపేయాలని డాక్టర్ ను వేడుకున్న భర్త, లేదంటే కష్టాలు వస్తాయని డాక్టర్ కే వార్నింగ్, 420!

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీ

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీ

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పర్రూటీ సమీపంలోని గ్రామంలో సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెల్వరాజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సెల్వరాజ్ నెలకు రూ. లక్షకు పైగా జీతం తీసుకుంటున్నాడని తెలిసింది.

ఎంఎస్సీ అమ్మాయి

ఎంఎస్సీ అమ్మాయి

పర్రూటీ పట్టణంలోనే రమ్యశ్రీ (పేరు మార్చడంజరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఎంఎస్సీ పూర్తి చేసిన రమ్యశ్రీ మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నది. సెల్వరాజ్, రమ్యశ్రీ ఇద్దరు కులాలు ఒక్కటే కావడం, వీరి ఇద్దరి ఊర్లు దగ్గర దగ్గర కావడంతో వారికి పెళ్లి చెయ్యలని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు.

పెళ్లి ఏర్పాట్లు చకచకగా సాగిపోయాయి

పెళ్లి ఏర్పాట్లు చకచకగా సాగిపోయాయి

పెళ్లికి సెల్వరాజ్, రమ్యశ్రీ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నసెల్వరాజ్, రమ్యశ్రీ టచ్ లో ఉన్నారు. సెల్వరాజ్ ను పెళ్లి చేసుకుని చెన్నై వెళ్లిపోయి అక్కడే మంచి ఉద్యోగంలో చేరాలని రమ్యశ్రీ అనుకుంది. పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని నిర్ణయించిన ఇరు కుటుంబ పెద్దలు పర్రూటీలోని గాదంబూలియార్ రోడ్డులోని ఓ కల్యాణమండపంలో పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యి డేట్ ఫిక్స్ చేశారు.

రిసెప్షన్ లో అదిరిపోయే డ్యాన్స్ పోగ్రామ్

రిసెప్షన్ లో అదిరిపోయే డ్యాన్స్ పోగ్రామ్

ఉదయం నిశ్చితార్థం, అదేరోజు రాత్రి రిసెప్షన్, మరుసటి రోజు ఉదయం ముహూర్తం. ఇది సెల్వరాజ్, రమ్యశ్రీ పెళ్లి కోసం పంతులు నిర్ణయించిన ముహూర్తాలు. ఉదయం సెల్వరాజ్, రమ్యశ్రీల నిశ్చితార్థం కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. అదే రోజు రాత్రి సెల్వరాజ్, రమ్యశ్రీల పెళ్లి రిసెప్షన్ కార్యక్రమం గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు

డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు

రాత్రి రిసెప్షన్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు రమ్యశ్రీ, పెళ్లి కొడుకు సెల్వరాజ్ కుటుంబ సభ్యులు శ్రీమంతులు కావడంతో అందరూ సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ లు వేస్తున్నారు. ఆ సమయంలో పెళ్లి కొడుకు సెల్వరాజ్, పెళ్లి కూతురు రమ్యశ్రీ బాగా చదువుకోవడం, ముందుగానే వారికి డ్యాన్స్ చెయ్యడం అలవాటు ఉండటంతో కొన్ని పాటలకు డ్యాన్స్ లు ఇరగదీశారు.

పెళ్లికూతురిని చితకబాదిన పెళ్లి కొడుకు

పెళ్లికూతురిని చితకబాదిన పెళ్లి కొడుకు

వరుసకు తమ్ముడు అయ్యే యువకుడితో పెళ్లి కూతురు రమ్యశ్రీ ఓ రొమాంటిక్ మాటకు డ్యాన్ చేసింది. ఆ సమయంలో పెళ్లి కొడుకు సెల్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేసి పెళ్లి కూతురితో పాటు డ్యాన్స్ చేస్తున్న యువకుడిని పక్కకు తోసేయడంతో అతను కిందపడిపోయాడు.

ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్న పెళ్లి కూతురు రమ్యశ్రీ, ఆ యువకుడు మళ్లీ పైకి లేపి డ్యాన్స్ చేసింది. అంతే పెళ్లి కొడుకు సెల్వరాజ్ కు ఎక్కడో కాలిపోయి అందరి ముందు రిసెప్షన్ హాల్ లోనే పెళ్లి కూతురు రమ్యశ్రీ చెంపలు చెల్లుమనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

నేను చచ్చినా వీడిని పెళ్లి చేసుకోను

నేను చచ్చినా వీడిని పెళ్లి చేసుకోను

పెళ్లి కొడుకు సెల్వరాజ్ తీరుతో అందరూ షాక్ అయ్యారు. కల్యాణమండపంలోని వేదిక మీదకు వెళ్లిన పెళ్లి కూతురు రమ్యశ్రీ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. తరువాత నేను సెల్వరాజ్ పెళ్లి చేసుకోనని రమ్యశ్రీ గట్టిగా కేకలు వేసింది. రమ్యశ్రీ మాటలతో అక్కడున్న వారు షాక్ అయ్యారు.

ఏదో ఆవేశంలో పెళ్లి కొడుకు సెల్వరాజ్ రెండు దెబ్బలు వేశాడని, పెళ్లి మాత్రం ఆపకూడదని రమ్యశ్రీకి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు చాలాసేపు నచ్చ చెప్పాడు. పెళ్లి చేసుకోకముందే వీడు ఇంత చేశాడని, పెళ్లి తరువాత ఇంకా ఎంత చేస్తాడో అర్థం అవుతోందని చెప్పిన రమ్యశ్రీ చచ్చినా వీడిని పెళ్లి చేసుకోనని చెప్పి కల్యాణమండపంలో నుంచి బయటకు వెళ్లిపోయింది.

కాళ్లు పట్టుకున్న పెళ్లి కొడుకు.... ఛీ కొట్టిన పెళ్లి కూతురు

కాళ్లు పట్టుకున్న పెళ్లి కొడుకు.... ఛీ కొట్టిన పెళ్లి కూతురు

కొంతసేపటి తరువాత పెళ్లి కూతురు రమ్యశ్రీ పెళ్లి చేసుకోనని మొండికి తిరగడంతో ఆమె కుటుంబ సభ్యులు కల్యాణమంపడపంలో నుంచి ఇంటికి వెళ్లిపోయారు. పెళ్లి కొడుకు సెల్వరాజ్ నేరుగా పెళ్లి కూతురి ఇంటికి వెళ్లి ఆమె తండ్రి కాళ్లు పట్టుకుని నేను తప్పు చేశానని, ఇక ముందు ఇలా చెయ్యనని క్షమాపణ చెప్పాడు.

పెళ్లి కొడుకు సెల్వరాజ్ తండ్రి కాళ్లు పట్టుకున్నా పెళ్లి కూతురు రమ్యశ్రీ మాత్రం కనికరించలేదును. నేను ఇతన్ని పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు తేల్చి చెప్పడంతో ఇక లాభం లేదని పెళ్లి కొడుకు సెల్వరాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Union Cabinet : Women's And Men's Age Should Be Equal To Get Married
అదే మూహూర్తానికి ఇంటర్ అబ్బాయితో పెళ్లి

అదే మూహూర్తానికి ఇంటర్ అబ్బాయితో పెళ్లి

పెళ్లి ఆగిపోయిందని విచారణంతో రమ్యశ్రీ కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి అంతా చర్చించారు. ఇంటర్ మాత్రమే చదివి తల్లిదండ్రులును బాగా చూసుకుంటున్న యువకుడికి రమ్యశ్రీని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఆ యువకుడు పెళ్లికి రాకపోవడంతో అర్దరాత్రి అతనికి ఫోన్ చేసి పర్రూటీకి పిలిపించారు.

అనుకున్న ముహూర్తానికే ఆ కల్యాణమంపడపంలో కాకుండా సమీపంలోన దేవాలయంలో ఇంటర్ చదివిని అబ్బాయికి, ఎంఎస్సీ పూర్తి చేసిన పెళ్లి కూతురికి పెళ్లి జరిపించేశారు.

అయితే పెళ్లి కూతురి మీద చెయ్యి చేసుకున్న పెళ్లి కొడుకు మాత్రం ఇంటికి వెళ్లి తడిగుడ్డ వేసుకుని నిద్రపోయాడని తెలిసింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ దెబ్బతో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కొడుకు మారిపోవడం కడలూరు జిల్లాతో పాటు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Marriage: In Panruti The bride who stopped the wedding because the groom beaten in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X