చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Menaka: కోటీశ్వరులైన మసలోళ్లకు స్వర్గం చూపించిన మేనకా, వయస్సు 29, ఏం చేసిందంటే? ఫినిష్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తేని: గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ తన మీద అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి కేసు పెట్టింది. కోటీశ్వరుడైన బాధితుడు జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. తరువాత కూడా గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ ను ఆమె వదల్లేదు. గార్మెంట్స్ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగిన యువతి నానా రాద్దాంతం చేసింది. యువతి హంగామా విషయం టీవీల్లో వచ్చింది.

యువతి మ్యాటర్ తెలుసుకున్న చాలా మంది వ్యాపారవేత్తలు, గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమానులు పోలీసుల ముందు క్యూకట్టారు. గార్మెంట్స్ ఫాక్టరీ యజమానికి సినిమా చూపించాలని అనుకున్న మేనకా మేడమ్ అసలు బండారం బయటపడింది. కోటీశ్వరులైన ముసలోళ్లకు స్వర్గం చూపించిన మేనక, రంభా. ఊర్వశి కూడా నేను అంటూ రెచ్చిపోవడంతో అసలు కథ మొదలైయ్యింది.

Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్!Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్!

కోటీశ్వరుడిని జైలుకు పంపించిన మేనక

కోటీశ్వరుడిని జైలుకు పంపించిన మేనక

తమిళనాడులోని తేని జిల్లాలోని ప్రముఖ టెక్స్‌టైల్ ఫోరూమ్, గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మేనక అనే యువతి తేనీ మహిళా పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది ఫిర్యాదు చేసింది. తన మీద అత్యాచారం చేశాడని మేనక్ ఆరోపించింది.. ఈ కేసులో గత ఏడాది మార్చి 14 ఆ గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని మద కేసు నమోదు అయ్యింది. ఏప్రిల్‌లో లొంగిపోయిన గార్మెంట్స్ కంపెనీ యజమాని తరువాత జైలుకు వెళ్లి కోర్టులో బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చాడు.

మేనకా మేడమ్ హంగామా అంతాఇంత కాదు

మేనకా మేడమ్ హంగామా అంతాఇంత కాదు

మేనక సంబంధిత గార్మెంట్స్ కంపెనీ ముందు ధర్నా చేసింది. గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ తనను పెళ్లి చేసుకోవాలని, తనతో జీవించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసింది. మేనకా పోరాటానికి మద్దతుగా కొన్ని మహిళా సంఘాలు మూడా గార్మెంట్స్ మీద ధర్నా చేసి మేనకాకు మద్దతు తెలిపారు.

ఈ విషయం తమిళనాడులోని పలు టీవీ చానల్స్ లో ప్రసారం అయ్యింది. మహిళా పోలీసులు బలవంతంగా గార్మెంట్స్ లోకి వెళ్లి మేనకాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆమెను విడుదల చేశారు.

మేనకా కిలాడీ అని తెలిసి అందరూ షాక్

మేనకా కిలాడీ అని తెలిసి అందరూ షాక్

29 ఏళ్ల మేనకాకు అన్యాయం జరిగిందని అందరూ భావించి ఆమె మీద జాలి చూపించారు. వ్యాపారులను బెదిరించి వారిని లొంగదీసుకుని వారికి కొంతకాలం పాటు స్వర్గం చూపించిన మేనకా తరువాత ఆమె అసలు స్వరూపం చూపిస్తోందని, కోటీశ్వరుల మీద పోలీసులకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసి లక్షల రూపాయల డబ్బులు లాక్కొంటున్నదని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

వృద్ధ వ్యాపారవేత్తలు టార్గెట్

వృద్ధ వ్యాపారవేత్తలు టార్గెట్

మేనకా మేడమ్ పలు ప్రాంతాల్లోని వృద్ధ వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకుందని వెలుగు చూసింది. వయసు మీదపడి సెక్స్ కోరికలు తీర్చుకోలేని వృద్ధ వ్యాపారవేత్తలతో సన్నిహితంగా మెలిగిన మేనకా వారికి లైంగిక వాంఛలు రేకెత్తించింది. తరువాత తన పరువాలతో వారికి స్వర్గం చూపించింది మేనకా మోజులో పడిపోయిన వృద్ధ వ్యాపారవేత్తల నుంచి భారీ మొత్తంలో మేనకా డబ్బులు వసూలు చేసేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పారిశ్రామికవేత్తల జీవితాలతో చెలగాటం ఆడిన మేనకా మీద తేని, చిన్నమనూరు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనాయి.

ధైర్యం చేసిన మరో వ్యాపారి

ధైర్యం చేసిన మరో వ్యాపారి

మేనకా వ్యవహారం టీవీలు, పత్రికల్లో చూసిన మరో వ్యాపారవేత్త ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను కోల్పోయిన తరువాత తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మేనకా తన నుంచి రూ. 10. 50 లక్షలు తీసుకుని మోసం చేసిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనకా, మరో మహిళ తనను మోసం చేసిందని బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య చనిపోయింది

రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య చనిపోయింది

తమిళనాడులోని తేని జిల్లాలోని గంపం మున్సిపాలిటీ పరిధిలోని సుంగం వీధిలో మొహమ్మద్ రఫీక్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ రెస్టారెంట్ నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మహ్మద్ రఫీక్ కేరళలో తోటలు లీజుకు తీసుకుని వ్యవసాయం కూడా చేయిస్తున్నాడు.

రఫీక్ ఇద్దరు కుమారులు వివాహం చేసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. మొమమ్మద్ రఫీక్ భార్య అనారోగ్యంతో మృతి చెందింది.భార్య చనిపోయిందనే బాధలోతో ఉన్న తనను మేనక పరిచయం చేసుకుందని, తరువాత తనన పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని మొహమ్మద్ రఫీక్ పోలీసులకు చెప్పాడు.

తరువాత తనను మోసం చేసిన మేనకా, ఆమె స్నేహితులు తన దగ్గర రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళ మీద రఫీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

వీడియో కాల్స్ చేసి వల వేసింది

వీడియో కాల్స్ చేసి వల వేసింది

తన కంపెనీలో పనిచేస్తున్న తేని జిల్లా చిన్నమనూరు ప్రాంతానికి చెందిన జీవితా, కొడంగిపట్టికి చెందిన సత్యా అనే ఇద్దరు మహిళల ద్వారా మేనకా తనకు పరిచయమైందని మొహమ్మద్ రఫీక్ పోలీసులకు చెప్పాడు. జీవితా, సత్యా ఇద్దరూ పెరియకులం సమీపంలోని గ్రామానికి చెందిన మేనకాను ఫోన్ ద్వారా తనకు పరిచయం చేశారని, తరువాత తనను ఓదార్చడానికి మేనకా నిత్యం ఫోన్లు చేసేదని, చాలాకాలం ఆమెతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడాడని, తరువాత వీడియో కాల్స్ చేసి రొమాన్స్ గా మాట్లాడి తనను ముగ్గులోకి దింపిందని, తనకు వల వేసి మోసం చేసిందని మొహమ్మద్ రఫీక్ పోలీసులకు చెప్పాడు.

పెళ్లి పేరుతో ఫ్రెండ్స్ ను సెట్ చేసింది

పెళ్లి పేరుతో ఫ్రెండ్స్ ను సెట్ చేసింది

గత ఏడాది డిసెంబరు 21న మేనకా నాకు డబ్బు సమస్య ఉందని, మీరు సహాయం చెయ్యాలని మనవి చేసిందని, ఆమె బ్యాంకు ఖాతాకు యాభై వేలు పంపించాను. ఆ తరువాత డిసెంబరు 22న మేనకా మళ్లీ తనను సంప్రధించి తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వెంటనే సత్యాతో తనకు రూ. 10 లక్షల రూపాయలు పంపాలని కోరింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటాననని చెప్పిన మేనకా కోసం జీవితా, సత్యాతో డిసెంబర్ 23వ తేదీన రూ.10 లక్షలు ఇచ్చి పంపించానని మొహమ్మద్ రఫీక్ పోలీసులకు చెప్పాడు.

పెళ్లి చేసుకుంటానని మేనకా ఏం చేసిందంటే?

పెళ్లి చేసుకుంటానని మేనకా ఏం చేసిందంటే?

డిసెంబర్ 26వ తేదీన నేను నేరుగా వచ్చి నీకు మొత్తం వివరిస్తానని, మనం సహజీవనం చేద్దామని, నీకు అన్నీ నేనే చూసుకుంటానని వాయిస్ మెసేజ్ పంపింది మేనకా కొంతసేపటికే ఆ వాయిస్ మెసేజ్ డిలీట్ చేసిందని రఫీక్ పోలీసులకు చెప్పాడు. మరుసటి రోజు మేనకా, జీవితా, సత్యాలను సంప్రదించగా వారి సెల్‌ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్‌ అయ్యాయి.

తాను మోసపోయానని తెలుసుకున్నానని, పరువు పోతుందని ఇంతకాలం ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదని రఫీక్ పోలీసులకు చెప్పాడు. రఫీక్‌ ఫిర్యాదు ఆధారంగా కంభం నార్త్ పోలీసులు మేనకా, జీవితా, సత్యా మీద కేసు నమోదు చేశారు. రఫీక్‌ను తన వలలో పడేసిన మేనకా ఆమె సెల్‌ఫోన్‌లో మాట్లాడిన ఆడియోలు కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి. వయసు మీదపడిన కోటీశ్వరులను చేసిన మేనకా హనీట్రాప్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Menaka, who romanced millionaires and showed heaven, looted lakhs of rupees and filed false cases in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X