చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పార్టీలో నిజాలకు స్వేచ్ఛ లేదు, రోబోలా, తోలుబొమ్మలా ఉండలేను: కాంగ్రెస్ పార్టీపై ఖుష్బూ ఫైర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన ఖుష్బూ సుందర్ తన మాజీ పార్టీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తెలివైన, అవగాహన కలిగిన మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని అన్నారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీలో నిజాన్ని నిర్భయంగా చెప్పే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు.

 నా అణచివేతకు కుట్ర: ఖుష్బూ

నా అణచివేతకు కుట్ర: ఖుష్బూ

కాంగ్రెస్ పార్టీలో ఖుష్బూ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె సినీ నటి కావడంతో ఆమెకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. అయితే, తనను పార్టీలోని వ్యక్తులే అణచివేసేందుకు ప్రయత్నించారని ఖుష్బూ ఆరోపించారు. తమిళనాడు రాజకీయాల్లో ఖుష్బూ పార్టీ మార్పు ప్రభావం శూన్యమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం.

కాంగ్రెస్ అగౌరవపర్చింది: ఖష్బూ

కాంగ్రెస్ అగౌరవపర్చింది: ఖష్బూ

ఈ నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఖుష్బూ మాట్లాడుతూ.. మానసిక వైఫల్యం చెందినవారే అలా మాట్లాడుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎంతో నిజాయితీగా ఉన్నప్పటికీ.. తనను అగౌరవపర్చారని చెప్పారు. ఒక తెలివైన మహిళా నేతను కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను కేవలం ఒక సినీ నటిగానే చూసిందని, ఆ పార్టీ నేతల ఆలోచనలు చాలా చిల్లరగా ఉన్నాయని ఖుష్బూ మండిపడ్డారు. తనను తాను పెరియారిస్టుగా చెప్పుకున్న ఖుష్బూ.. నిజాన్ని చెప్పే స్వేచ్ఛ లేని పార్టీ కూడా మంచిదేనా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలను సామాజిక కార్యకర్త పెరియార్ ఈవీ రామస్వామి కూడా వ్యతిరేకించారని తెలిపారు.

ప్రధాని మోడీపై విమర్శించా.. కానీ..

ప్రధాని మోడీపై విమర్శించా.. కానీ..

ప్రధాని నరేంద్ర మోడీపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన ఖుష్బూ సుందర్.. ఈ విషయంపై స్పందిస్తూ.. తాను ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బీజేపీని వ్యతిరేకించామని అన్నారు. అయితే, తాను కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించినట్లు కూడా తెలిపారు. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఖుష్బూ ప్రధాని మోడీని ప్రశంసించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఆమె రాహుల్ గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు. తాను ఒక పార్టీలో రోబోలా, తోలుబొమ్మలా ఉండలేనని స్పష్టం చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ఖష్బూ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ఖష్బూ


కాగా, 2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఖుష్బూ బీజేపీలో చేరడం గమనార్హం. బీజేపీ కూడా ఆమెకు పెద్ద బాద్యతలే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల ఖుష్బూ తన రాజకీయ జీవితాన్ని డీఎంకేతో 2010లో ప్రారంభించారు. ఆ తర్వాత డీఎంకేను వీడి 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరారు.

English summary
Actor Khushbu Sundar, who changed camp from the Congress to the BJP, hit back at her former party today, saying the Congress "does not want an intelligent woman" and there is "no freedom to speak the truth" within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X