• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Nivar Cyclone: సూపర్ సీఎం, మంత్రులతో లాభం లేదు, చేతిలో గొడుగు, మురికినీటిలో ఎంట్రీ, ప్రతిపక్షం!

|

చెన్న/ కడలూరు/ చెంగల్పట్టు: నివర్ తుపాను దెబ్బతో తమిళనాడు ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవుడా మాకే ఏమిటి ఈ ఖర్మ అంటూ తమిళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ప్రజలను కాపాడటానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేరుగా రంగంలోకి దిగారు. నివర్ తుపాను దెబ్బను లెక్కచెయ్యకుండా సీఎం పళనిస్వామి ఆయనే స్వయంగా పెద్ద గొడుకు చేతిలో పట్టుకుని నేరుగా వరద ముప్పు ప్రాంతాలకు వెళ్లి మురికినీటిలో నడుస్తూ సహాయక చర్యల గురించి ప్రజలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పుడు తమిళనాడు సీఎం తమిళ ప్రజలకు సూపర్ సీఎం, సూపర్ హీరో అయ్యారు. ప్రతిపక్షాలు నోరెత్తి విమర్శలు చెయ్యకుండా వారి నోటికి తాళం వెయ్యడానికి సీఎం పళనిస్వామి ప్రయత్నించారు.

Nivar Cyclone: తుపాను ఎఫెక్ట్, హైల్ప్ లైన్, వాట్సాప్, ఫోన్ నెంబర్లు, తెలుగు ప్రజలు జాగ్రత్త, చెన్నై

మంత్రులతో లాభం లేదు

మంత్రులతో లాభం లేదు

కొందరు మంత్రులు, నాయకులను పక్కనపెట్టిన సీఎం పళనిస్వామి నేరుగా అధికారులతో చర్చించి నివర్ తుపాను సహాయక చర్యలపై ఆరా తీశారు. నివర్ తుపాను దెబ్బతో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా సీఎం పళనిస్వామి జాగ్రత్త పడ్డారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా సీఎం పళనిస్వామి సాటి మంత్రులు, నాయకుల మీద ఆధారపడకుండా ఆయనే రంగంలోకి దిగారు.

కరోనా ఎఫెక్ట్ తో సీఎం అలర్ట్

కరోనా ఎఫెక్ట్ తో సీఎం అలర్ట్

తమిళనాడులో ఇటీవల కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ప్రజలు హడలిపోయారు. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి ఓ ఊపుఊపేసింది. తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం వలన రాష్ట్రంలో కరోనా వైరస్ తాండవం చేసిందని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఇదే సమయంలో తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి కే. విజయ్ భాస్కర్ పై సీఎం ఎడప్పాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేశారని వెలుగు చూసింది. ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ గురించి పెద్దగా పట్టించుకోని సీఎం ఎడప్పాడి పళనిస్వామి కరోనా వైరస్ ను అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

చెన్నైపై ఎఫెక్ట్ పడకుండా చేసిన సీఎం

చెన్నైపై ఎఫెక్ట్ పడకుండా చేసిన సీఎం

చెన్నై సిటీ ప్రజలు కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు విలవిలలాడిపోయారు. ఇదే సమయంలో నివర్ తుపాను విరుచుకుపడటంతో చెన్నై సిటీలో అంటువ్యాధులు వ్యాపించకుండా సీఎం ఎడప్పాడి పళనిస్వామి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మునిసిపాలిటి, కార్పోరేషన్, అగ్నిమాపక, రెస్యూ సిబ్బందితో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపి అంటు వ్యాధులు వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్వయంగా సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ఆయనే నిర్ణయాలు తీసుకున్నారు.

నివర్ తుపాను దెబ్బ చెన్నై ప్రజల మీద పడకుండా అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చెయ్యడంతో తమిళనాడు ప్రభుత్వం సక్సస్ అయ్యింది.

మురికినీటిలో సీఎం.... చేతిలో గొడుగు

మురికినీటిలో సీఎం.... చేతిలో గొడుగు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నివర్ తుపాను లెక్కచెయ్యకుండా చెన్నైలోని సెంబారబాక్కంతో పాటు అనేక ప్రాంతంలో ప్రత్యక్షం అయ్యారు. భారీ వర్షం పడుతున్నా లెక్కచెయ్యని సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆయనే స్వయంగా చేతిలో పెద్ద గొడుగు పట్టుకుని ప్రజల ముందుకు వెళ్లి వారికి సహాయక చర్యలు అందుతున్నాయా ? తుపాను దెబ్బకు ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా ? మీ సమస్యలపై సంబంధిత అధికారులు ఎలా స్పంధిస్తున్నారు ? అంటూ ఆరా తీసి వివరాలు సేకరించారు.

ప్రతిపక్షాలకు నోచాన్స్

ప్రతిపక్షాలకు నోచాన్స్

పక్కన పీఏలు, అధికార పార్టీ నాయకులు ఉన్నా వారి సహాయం తీసుకోకుండా స్వయంగా చేతిలో గొడుగు పట్టుకుని జోరువానలో తడుచుకుంటూ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రజల ముందుకు వెళ్లారు. కరోనా వైరస్ సమయంలో తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు నివర్ తుపాను విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చెయ్యకుండా సీఎం ఎడప్పాడి పళనిస్వామి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. తుపాను లెక్కచెయ్యకుండా ప్రజల ముందుకు వెళ్లిన సీఎం ఇప్పుడు తమిళనాడు ప్రజలకు సూపర్ సీఎం, సూపర్ హీరో అయిపోయారు.

English summary
Nivar Cyclone: Tamil Nadu CM Edapadi Palanisamys Super action against Nivar Cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X