• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సంచలనం: స్టాలిన్ కూతురు ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం -ఐటీ శాఖ -డీఎంకే నేతల ఇళ్లపై దాడులు -నో క్యాష్

|

కేంద్ర సంస్థలను మోదీ సర్కార్ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆరోపణలు ఉండగానే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష డీఎంకే నేతల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) భారీ ఎత్తున దాడులు చేయడం సంచలనం రేపుతోంది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఏకైక కూతురు సెంతమారి స్టాలిన్ ఇంట్లో కీలకమైన పత్రాలు లభించాయని, వాటిలో నేరాలకు సంబంధించిన ఆధారాలున్నాయని ఐటీ అధికారులు ప్రకటించారు. కాగా, స్టాలిన్, ఇతర డీఎంకే నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరిత ఐటీ దాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్యాష్ దొరకలేదు కానీ..

క్యాష్ దొరకలేదు కానీ..

స్టాలిన్ అల్లుడు (సెంతమారి భర్త) శబరీషన్ తోపాటు డీఎంకేతో సంబంధాలుండి, వివిధ వ్యాపారాలు నిర్వహించే పలువురిపై శుక్రవారం ఐటీ శాఖ దాడులు చేసింది. చెన్నై సహా వివిధ నగరాల్లో సోదాలు జరిగాయి. అన్నానగర్ డీఎంకే అభ్యర్థి మోహన్ కొడుకు కార్తీక్, జీస్క్కేర్ బాలా, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతోపాటు ఆయన సోదరుడు, తిరువణ్నామలై ఎంపీ అన్నాదురై, తంజావూరు డీఎంకే నేత మురసొలి తదితరుల ఇళ్లపై 25కుపైగా ఐటీ బృందాలు శుక్రవారం సోదాలు చేశాయి. వీటికి సంబంధించి ఐటీ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసింది. స్టాలిన్ కూతురి ఇంట్లో క్యాష్ దొరకలేదు కానీ..

తిరుపతి పోరు: రత్నప్రభ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్ -నేడు తిరుపతిలో జనసేనాని పాదయాత్ర, భారీ సభతిరుపతి పోరు: రత్నప్రభ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్ -నేడు తిరుపతిలో జనసేనాని పాదయాత్ర, భారీ సభ

కీలక పత్రాలు స్వాధీనం..

కీలక పత్రాలు స్వాధీనం..

స్టాలిన్ కూతురు సెల్వమారి, ఆమె భర్త శబరీషన్ నివసించే ఇంట్లో నిర్వహించిన సోదాల్లో నగదు దొరకనప్పటికీ, వారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని నిర్ధారించే కీలక పత్రాలు లభ్యమయ్యాయని ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతోందని, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తోన్న కొందరు వ్యక్తులు, సంస్తల నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేసి, ఎన్నికల్లో అక్రమంగా ఖర్చుపెడుతున్నారని, ఈ వ్యవహారం మొత్తాన్ని స్టాలిన్ అల్లుడు శబరీషన్, ఇంకొందరు కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం మేరకు ఐటీ శాఖ దాడులు చేసింది. డబ్బుల పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలు దొరకినట్లు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం.

మంటల్లో ఆసుపత్రి- డాక్టర్ల సాహసం -ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేశారుమంటల్లో ఆసుపత్రి- డాక్టర్ల సాహసం -ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేశారు

నా పేరు స్టాలిన్.. డీఎంకే చీఫ్ రియాక్షన్

నా పేరు స్టాలిన్.. డీఎంకే చీఫ్ రియాక్షన్

తన కుమార్తె, అల్లుడుతోపాటు పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగడంపై డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సమయంలో దాడుల గురించిన తెలుసుకున్న ఆయన బీజేపీపై మండిపడ్డారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుని దాడులతో డీఎంకేను భయపెట్టలేరంటూ ఎదురుదాడి చేశారు. ‘‘ఐటీ దాడులతో బెంబేలెత్తిపోవడానికి మేమేమీ అన్నాడీఎంకే పార్టీ వాళ్లం కాదు. నా పేరు స్టాలిన్.. నేను డీఎంకే నేతను. గతంలో మీసా లాంటి కఠిన చట్టాలను, ఎమర్జెన్సీ విపత్తును సైతం తట్టుకుని నిలబడ్డాం. ఇప్పుడు బీజేపీకి భయపడతామా? నెవర్'' అని స్టాలిన్ అన్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది.

English summary
DMK chief MK Stalin's son-in-law was raided by Income Tax officials today, just four days before the Tamil Nadu election. The Income Tax department has said they have found "incriminating evidence" of tax evasion in searches they conducted on key people related to the DMK leadership on Friday in Chennai, Karur and Coimbatore four days before Tamil Nadu goes to vote. "I Am MK Stalin": DMK Leader's Message After Tax Raids On Son-In-Law
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X