• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

9,10,11 తరగతుల పరీక్షలు రద్దు -విద్యార్థులంతా పాస్, తర్వాతి క్లాసులకు ప్రమోట్ -సీఎం కీలక ప్రకటన

|

కరోనా మహమ్మారి కారణంగా మరో విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా ముగియనుంది. వైరస్ వ్యాప్తి అదుపులోకి అదుపులోకి వచ్చిందని భావించేలోపే కొత్త వేరియంట్లు విజృంభించడం, కేసుల సంఖ్య మళ్లీ పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల భవితవ్యంపై ఆయా ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి. అందరికంటే ముందుగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దు చేసేసింది. ఈ మేరకు..

చీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీ

పరీక్షల్లేవు.. అందరూ పాస్..

పరీక్షల్లేవు.. అందరూ పాస్..

కరోనా వైరస్ కారణంగా తమిళనాడులో 9,10,11 తరగతుల పరీక్షలను రద్దు చేస్తున్నామని, విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానేపై ఉత్తీర్ణులుగా పరిగణిస్తామని, వారందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. అంతేకాదు..

ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం -4తప్ప మిగతావన్నీ ప్రైవేటుకే: ప్రధాని మోదీ సంచలనం -పూర్తి వివరాలివే

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా..

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా..

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేస్తున్నామన్న సీఎం.. వైద్యనిపుణుల నుంచి సూచనలు తీసుకున్న తర్వాతే 9, 10, 11వ తరగతుల పరీక్షలను రద్దు చేసి, అందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ఇంటర్నల్‌ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పబ్లిక్‌ పరీక్షల్లో మార్కులు నిర్ణయిస్తామన్నారు. అందులో 80శాతం మార్కులు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల ఆధారంగా లెక్కించి, మిగతా 20శాతం మార్కులు వారి హాజరు ఆధారంగా ఇస్తామని తెలిపారు. అయితే..

12వ తరగతికి పరీక్షలు తప్పవు..

12వ తరగతికి పరీక్షలు తప్పవు..

తమిళనాడులో 9, 10, 11వ తరగతుల పరీక్షలను రద్దు చేసి, ఆ విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తామన్న ప్రభుత్వం.. కీలకమైన 12వ తరగతికి మాత్రం పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు లేవని పేర్కొంది. 12 తరగతి పరీక్షలు ఈ ఏడాది మే 3 నుంచి 21 వరకు జరగనున్నట్లు విద్యాశాఖ గతంలో జారీ చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పులు ఉండబోవు. కరోనా కారణంగా గతేడాది మార్చిలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయగా, ఈ ఏడాది (2021) జనవరిలో 10,12 విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. రెండు నెలలు తిరిగేలోపే 10 పరీక్షలు రద్దయిపోయాయి. మరోవైపు..

ఎన్నికల వేళ భారీ తాయిలాలు..

ఎన్నికల వేళ భారీ తాయిలాలు..

ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కారు ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రధానంగా ఉద్యోగస్తుల్ని ఆకట్టుకునే క్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 59ఏళ్ల నుంచి 60ఏళ్లకు పెంచుతున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం తమిళనాడులో పర్యటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను ప్రకటించేఅవకాశముంది.

English summary
All students studying in classes 9, 10 and 11 in Tamil Nadu will not have to take examinations, announced Chief Minister Edappadi Palaniswami on Thursday, declaring them as ‘all pass’ this academic year. The announcement made in the Tamil Nadu Assembly comes days after the government announced Class 12 board exams between May 3 and May 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X