• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Secret: న్యూడ్ ఎక్స్ రే గ్లాస్, ఎదురుగా చూస్తే ?, అమ్మాయిలు, ఆంటీల మీద మోజుతో రూ. లక్ష పెట్టి తీసుకుని!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తేని: సినిమాల్లో మనం చూసిన ఓ మస్త్ మసాలా కూలింగ్ గ్లాస్ ( కంటి అద్దాల) కథ ఇప్పుడు నిజంగానే ఒకటి వెలుగు చూసింది. న్యూడ్ ఎక్స్ రే గ్లాస్ వేసుకుంటే ఎదురుగా వచ్చి వెలుతున్న అందమైన అమ్మాయిలతో పాటు ఎదురుగా ఎవ్వరూ దర్శనం ఇచ్చినా నగ్నంగా కనపడుతున్న దృశ్యాలను మనం సినిమాల్లో చూశాము. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఇలాంటి సీన్లు కొన్ని ఉన్నాయి. అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నదియా నటించిన ఓ సినిమాలో ఆమె ఇలాంటి న్యూడ్ ఎక్సెరే గ్లాస్ వేసుకుని ఎదుటి వారితో ఓ ఆట ఆడుకుంటున్న సీన్లు ఉన్నాయి.

ఇప్పుడు ఓ వ్యక్తి తన దగ్గర న్యూడ్ ఎక్సరే అద్దాలు ఉన్నాయని, కావాలంటే వాటిని విక్రయించడానికి నేను సిద్దంగా ఉన్నానని ఓ ఫ్రెండ్ కు చెప్పాడు. అమ్మాయిల మీద మోజు ఎక్కువగా ఉన్న ఆ పోటుగాడు ఎలాగైనా ఆ అద్దాలు సొంతం చేసుకోవాలని, తనకు నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను ఆ అద్దాలు పెట్టుకుని చూసి వారి అందచందాలు చూసి ఆస్వాధించాలని సొల్లు కార్చుకుంటూ లక్ష రూపాయలు చేతిలో పెట్టుకుని కారులో అతను స్నేహితుడు చెప్పిన చోటకు వెళ్లాడు. అక్కడ న్యూడ్ గ్లాస్ అసలు కథ రసవత్తరంగా మారింది.

Illegal affair: భార్యను చంపడం ఎలా ?, గూగుల్ లో వెతికి చంపేశాడు, ఆఫీసులో ప్రియురాలితో!Illegal affair: భార్యను చంపడం ఎలా ?, గూగుల్ లో వెతికి చంపేశాడు, ఆఫీసులో ప్రియురాలితో!

సినిమాల్లో ఇలాంటి అద్దాలు చూశాము

సినిమాల్లో ఇలాంటి అద్దాలు చూశాము

న్యూడ్ ఎక్స్ రే గ్లాస్ వేసుకుంటే ఎదురుగా వచ్చి వెలుతున్న అందమైన అమ్మాయిలతో పాటు ఎదురుగా ఎవ్వరూ దర్శనం ఇచ్చినా నగ్నంగా కనపడుతున్న దృశ్యాలను మనం సినిమాల్లో చూశాము. తమిళంతో పాటు మలయాళం, హిందీ బాషల్లో ఇలాంటి న్యూడ్ ఎక్సెరే గ్లాస్ మూలకథగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ 1981లో ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో ఇలాంటి సీన్లు కొన్ని ఉన్నాయి. రజనీకాంత్ విదేశాలకు వెళ్లిన సమయంలో అతని స్నేహితుడు ఇలాంటి న్యూడ్ ఎక్సరే గ్లాస్ రజనీకాంత్ కు ఇస్తాడు. న్యూడ్ ఎక్సరే గ్లాస్ కళ్లకు పెట్టుకున్న రజనీకాంత్ నటి సరితాను చూడటంతో అప్పుడు ఆ సినిమాలో అసలు కథ మొదలౌతుంది. ఆ కంటి అద్దాలతోనే సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. రజనీకాంత్, సరిత నటించిన ఆ సినిమా అప్పట్లో తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు.

పవన్ కల్యాణ్ అత్త నదియా సినిమాలో కూడా సేమ్ సీన్

పవన్ కల్యాణ్ అత్త నదియా సినిమాలో కూడా సేమ్ సీన్

రజనీకాంత్ సినిమాలోనే కాకుండా అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నదియా నటించిన పూవే పూచుడవ అనే సినిమాలో ఆమె ఇలాంటి న్యూడ్ ఎక్సెరే గ్లాస్ వేసుకుని ఎదుటి వారితో ఓ ఆట ఆడుకుంటున్న సీన్లు ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడిగా పని చేస్తున్న ఎస్వీ శేఖర్ ను ఓ ఆటఅడుకోవడంతో ఆ సినిమా చూసిన వాళ్లు నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుకున్నారు.

రీల్ లైఫ్ లో కాకుండా అదే తమిళనాడులో రియల్ లైఫ్ సేమ్ సీన్

రీల్ లైఫ్ లో కాకుండా అదే తమిళనాడులో రియల్ లైఫ్ సేమ్ సీన్

తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోన కుంభకోణంలో యువరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని తేనీ జిల్లాలోని వీరపాండి సమీపంలోని ఉప్పైకోటేలో యువరాజ్ స్నేహితుడు అరసముత్తు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ యువరాజ్, అరసముత్తు ఫోన్ లో టచ్ లో ఉన్నారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటున్నారు.

 బంధువుల ఇంట్లో కూలింగ్ గ్లాస్ కథ మొదలైయ్యింది

బంధువుల ఇంట్లో కూలింగ్ గ్లాస్ కథ మొదలైయ్యింది

ఇటీవల యువరాజ్ తేనీ జిల్లాలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడు యువరాజ్ ను కలవడానికి అరసుముత్తు అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో అరసముత్తు అందంగా ఉన్న కంటి అద్దాలను పెట్టుకున్నాడు. ఈ కూలింగ్ గ్లాస్ ఎక్కడ కొన్నావు ?, చాలా బాగున్నాయి అంటూ యువరాజ్ ఆరా తీశాడు. ఆ సమయంలో ఆ కంటి అద్దాలు మ్యాజిక్ మిర్రర్ అని అరసముత్తు అతని ఫ్రెండ్ యువరాజ్ కు దాని స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు.

రూ. లక్ష రూపాయలు డీల్

రూ. లక్ష రూపాయలు డీల్

తన దగ్గర ఉన్న ఈ న్యూడ్ ఎక్సరే అద్దాలు వేసుకుంటే ఎదురుగా ఎవ్వరూ ఉన్నా నగ్నంగా కనపడతారని, వీటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయని అరసముత్తు అతని ఫ్రెండ్ యువరాజ్ కు చెప్పాడు. నీకు కావాలంటే వాటిని విక్రయించడానికి నేను సిద్దంగా ఉన్నానని, వేరే వారిని ఈ అద్దాలు విక్రయించడం తనకు ఇష్టం లేదని యువరాజ్ కు అతని ఫ్రెండ్ అరసముత్తు చెప్పాడు.

అమ్మాయిలు, ఆంటీల మీద యువరాజుకు మోజు

అమ్మాయిలు, ఆంటీల మీద యువరాజుకు మోజు

అమ్మాయిలు, ఆంటీల మీద మోజు ఎక్కువగా ఉన్న పోటుగాడు యువరాజ్ ఎలాగైనా తన స్నేహితుడు అరసముత్తు దగ్గర ఉన్న ఆ అద్దాలు సొంతం చేసుకోవాలని, తనకు నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను ఆ అద్దాలు పెట్టుకుని చూసి వారి అందచందాలు చూసి ఆస్వాధించాలని యువరాజ్ సొల్లు కార్చుకున్నాడు.

డబ్బులు తీసుకుని పరుగో పరుగు

డబ్బులు తీసుకుని పరుగో పరుగు

యువరాజ్ కు ఫోన్ చేసిన అరసముత్తు పెరియకులం దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి న్యూడ్ ఎక్సెరే గ్లాస్ తీసుకెళ్లాలని చెప్పాడు. యువరాజ్ ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకుని కారులో పెరియకులం దగ్గరకు వెళ్లాడు. అరసముత్తు కూడా దివాకర్ అనే స్నేహితుడిని వెంటపెట్టుకుని అక్కడికి వెళ్లాడు. లక్ష రూపాయలు అరసముత్తుకు ఇచ్చిన యువరాజ్ ఆ అద్దాలు తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లి అద్దాలు పెట్టుకుని చూసి షాక్ అయ్యాడు.

న్యూడ్ గా కాదు కాదా..... మొత్తం నల్లగా కనడుపతోందని రగిలిపోయాడు

న్యూడ్ గా కాదు కాదా..... మొత్తం నల్లగా కనడుపతోందని రగిలిపోయాడు

అరసముత్తు ఇచ్చిన అద్దాలు పెట్టుకుని చూసిన యువరాజ్ కు ఎదురుగా వచ్చిన వాళ్లు నగ్నంగా కనపడకపోవడం, ఎదురుగా ఉన్న వాళ్లు మొత్తం మసకగా నల్లగా కనపడటంతో రగిలిపోయాడు. వెంటనే కారు వెనక్కి తిప్పిన యువరాజ్ అరసమత్తును వెంటాడని పట్టుకున్నారు. ఆ సమయంలో అరసముత్తు దివాకర్ తప్పించుకుని పారిపోయాడు.

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
    డబ్బా అద్దాలు ఇచ్చి రూ. లక్ష స్వాహా

    డబ్బా అద్దాలు ఇచ్చి రూ. లక్ష స్వాహా

    తన దగ్గర రూ. లక్ష తీసుకుని పనికిరాని రూ. 100 అద్దాలు చేతిలో పెట్టి మోసం చేశాడని ఆరోపిస్తూ యువరాజ్ అతని స్నేహితుడు అరసముత్త మీద కేసు పెట్టాడు. అరసముత్తను అరెస్టు చేసి అతను ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని తేనీ జిల్లా పోలీసులు చెప్పారు.

    English summary
    Nude Xray glasses secret: Nude Xray glasses selling and arrested one near periyakulam in Theni another escaped.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X