చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై నగరంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా .. సెరోసర్వే -2లో వెల్లడి

|
Google Oneindia TeluguNews

చెన్నై నగరంలో కరోనా వైరస్ మహమ్మారి నగరంలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి వచ్చినట్లుగా తాజాగా నిర్వహించిన సెరో సర్వే 2 లో వెల్లడైంది. చెన్నైలో మొత్తం 32.3% పాజిటివ్ రేట్ చూపించిందని అధికారులు చెబుతున్నారు.

చెన్నై లో నిర్వహించిన సెరోసర్వే -2 ప్రకారం, పరీక్షించిన 6,389 నమూనాలలో కోవిడ్ -19 యాంటీబాడీస్ 2,062 మందిలో ఉన్నాయని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనాతో కంటి చూపు కోల్పోయిన బాలిక .. మెదడుపై కరోనా తీవ్ర ప్రభావంకరోనాతో కంటి చూపు కోల్పోయిన బాలిక .. మెదడుపై కరోనా తీవ్ర ప్రభావం

జులైలో మొదటి దశ సర్వే ... చెన్నై జనాభాలో 5వ వంతు జనాభాకు కరోనా

జులైలో మొదటి దశ సర్వే ... చెన్నై జనాభాలో 5వ వంతు జనాభాకు కరోనా

జూలైలో నిర్వహించిన మొదటి దశ సెరోసర్వే లో సుమారు 13,000 మందిపై సర్వే నిర్వహించారు. అప్పుడు చెన్నైలో ఉన్న పాపులేషన్ లో ఐదవ వంతు పాపులేషన్ కు కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. మొత్తం 21.5 శాతం జనాభా కరోనా బారిన పడినట్టు వెల్లడించింది.
గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ కోవిడ్ 19 యాంటీ బాడీస్ గురించి నిర్వహించిన సర్వే నే సెరో సర్వే . కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాడా లేదా అన్న దానిపై ఇది సర్వే నిర్వహించింది.

క్షేత్ర స్థాయి పరిస్థితి తెలుసుకోవటానికి రెండో సారి సర్వే

క్షేత్ర స్థాయి పరిస్థితి తెలుసుకోవటానికి రెండో సారి సర్వే

కరోనా మహమ్మారిని నియంత్రించటంలో రోగనిరోధక శక్తి ఒక ముఖ్యమైన సూచిక అని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జి.ప్రకాష్ పేర్కొన్నారు.

మొదటి సెరోసర్వేలో చెన్నైలో 13,000 నమూనాలను స్వచ్ఛంద ప్రాతిపదికన తీసుకున్నామని కమిషనర్ వివరించారు. రెండవ సెరోసర్వీలో, కొత్త ప్రాంతాలను గుర్తించామని, 6 వేలకు పైగా తాజా నమూనాలను తీసుకున్నామని చెప్పారు. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే సర్వే అని ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి .. నియంత్రణ అవసరమే

కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి .. నియంత్రణ అవసరమే

తాజా పరిస్థితుల నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రక్షణ వ్యవస్థను ఏమాత్రం తగ్గించుకోవడానికి నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా చెన్నైలో రోజువారీ 1,000 కేసులు నమోదయ్యాయి. బుధవారం, నగరంలో కరోనావైరస్ కొత్త కేసులు 845 నమోదయ్యాయి. చెన్నైలో ఇప్పటివరకు 1,92,527 కరోనావైరస్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనా కరోనా వైరస్ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేర్కొన్నారు.

Recommended Video

COVID-19 : కరోనా మరణాలను తగ్గించడంలో Remdesivir ప్రభావం లేదన్న WHO || Oneindia Telugu
 రాబోయే రోజుల్లో వ్యాప్తి తగ్గుతుందని ఆశాభావం

రాబోయే రోజుల్లో వ్యాప్తి తగ్గుతుందని ఆశాభావం

రాబోయే రెండు నెలల్లో రోజువారీ కేసుల సంఖ్య 400 కి తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై చివరి నుండి ఇప్పటి వరకు, మేము కేసుల పెరుగుదలను నియంత్రించగలిగామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు చెన్నైలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పరీక్షలు చేయబడ్డాయి అని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా చెన్నై లో తాజా పరిణామాలు , కరోనా వ్యాప్తి, ప్రజల్లో కరోనా యాంటీ బాడీస్ ఏ విధంగా ఉందో సెరో సర్వే ద్వారా వెల్లడయ్యింది.

English summary
The second serosurvey in Chennai, Tamil Nadu shows that one in three people in the city, who have been tested for coronavirus, was found to be positive.The Greater Chennai Corporation said on Thursday that according to the Chennai serosurvey-II, out of the 6,389 samples tested, 2,062 were positive for Covid-19 antibodies. The results have shown an overall positivity rate of 32.3 per cent in Chennai, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X