చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bumper Offer:నీకు సీఎం కుర్చీ, నా చేతికి స్టీరింగ్, సస్పెన్స్ కు చెక్, 2021లో తంబీలు డిసైడ్ చేస్తారు

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: ఇంతకాలం సీఎం ఎవరు నువ్వా ?, నేనా ? అంటూ పోటీ పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ నిర్ణయానికి వచ్చేశారు. జయలలిత ఆశీస్సులతో ఆమె బతికుండగానే సీఎం కుర్చిలో కుర్చున్న పన్నీర్ సెల్వంకు తరువాత కాలం అనుకూలించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. అయితే కొంతకాలంగా అన్నాడీఎంకే పార్టీలో సీఎం కుర్చీ పోరు తారాస్థాయికి చేరింది. ఎట్టేలకు అన్నాడీఎంకే పార్టీ టాప్ లీడర్లు చర్చింది ఏకాభిప్రాయానికి వచ్చేశారు. సీఎం కుర్చీ ఎవరికి ? అనే విషయంలో డిసైడ్ అయినా స్టీరింగ్ మాత్రం మరోకరి చేతిలోకి వెళ్లిపోయింది. అయితే 2021లో తమిళ తంబీలు ఏం డిసైడ్ చేస్తారో అనే విషయం మాత్రం వేచిచూడాలి.

Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

 పన్నీర్ సెల్వంకు సీన్ రివర్స్

పన్నీర్ సెల్వంకు సీన్ రివర్స్

2016లో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అదే సంవత్సరం మరణించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం అపద్దర్మ ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే జయలలిత మరణించిన తరువాత వీకే. శశికళ నటరాజ్ ఎంట్రీతో సీన్ రివర్స కావడంతో పన్నీర్ సెల్వం ను పక్కన పెట్టిన అన్నాడీఎంకే లీడర్స్ ముఖ్యమంత్రి కుర్చీలో ఎడప్పాడి పళనిస్వామిని కుర్చోబెట్టారు.

 న్యూఢిల్లీలో రాజీ

న్యూఢిల్లీలో రాజీ

ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎం కుర్చికోసం పన్నీర్ సెల్వం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఢిల్లీలోని కొందరు పెద్దలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలను రాజీ చేశారు. తరువాత జరిగిన పరిణామాలతో ఓ ఒప్పందం ప్రకారం పళనిస్వామి సీఎంగా, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి.

 2021 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్

2021 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్

2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే సీఎం అభ్యర్థి ఎవరు ? అనే విషయంలో కొంతకాలం నుంచి సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల మద్య ఆదిపత్యపోరు మొదలైయ్యింది. అప్పటి నుంచి ఇరు వర్గాల్లోని మంత్రులు విరుద్ద ప్రకటనలతో ఇన్ని రోజులు రచ్చరచ్చ చేశారు .ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు పుంజుకుంటాయని, మళ్లీ మన పార్టీ అధికారంలోకి రాదేమో ? అనే భయం అన్నాడీఎంకే పార్టీ నాయకులకు పట్టుకుంది.

పళనికి సీఎం సీటు, పన్నీర్ చేతికి స్టీరింగ్

పళనికి సీఎం సీటు, పన్నీర్ చేతికి స్టీరింగ్

ఇన్ని రోజులు సీఎం కుర్చీ కోసం నువ్వా ?నేనా ? అంటూ పోటీ పడిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీ పళనిస్వామికి ఇవ్వాలని, అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాల బాధ్యతలు పన్నీర్ సెల్వం చూసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇదే సమయంలో పార్టీ వ్యవహారల కమిటీలో 12 మంది సీనియర్ నాయకులను నియమించారు. ఆ 12 మందిలో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆరు మంది, సీఎం పళనిస్వామి వర్గీయులు 6 మంది ఉన్నారు. మొత్తం మీద తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరు ఖరారు కావడంతో ఆయన వర్గీయులు పండగ చేసుకుంటున్నారు.

English summary
Bumper Offer: E Palaniswami will be the ruling AIADMK's Chief ministerial candidate for the Tamil Nadu Election 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X