• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Playboy: వీఐపీల భార్యలు, కూతుర్లు+ 100 మందితో ఎంజాయ్, లాయర్లు లేరు, బెయిల్ రాదు, బతుకు!

|

చెన్నై/ కన్యాకుమారి/ మదురై: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికిపై అమ్మాయిలు, లెక్కలేనంత మంది వీఐపీల భార్యలు, వారి కూతుర్లు, ఆంటీలకు సోషల్ మీడియాలో గాలం వేసి వారితో సరసాలు ఆడుతూ ఎంజాయ్ చేసిన కాశీ కథ క్లైమాక్స్ కు చేరుకుంటోంది. తన కేసు వాదించడానికి లాయర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, నేను జైలు నుంచి బయటపడాలంటే తన కేసును జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలి చెయ్యాలని కామాంధుడు కాశీ హైకోర్టు బెంచ్ ను ఆశ్రయించాడు. కాశీ కేసు వాదించరాదని బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మాణం చెయ్యడంతో ప్లేబాయ్ కాశీ బెయిల్ రాక జైల్లోనే మూలుగుతున్నాడు. మా జిల్లాలో ఒక్క న్యాయవాది తన తరపున వాదించడానికి ముందుకురాలేదని, తన కేసు వాదనలు వినిపించడానికి వేరే కోర్టుకు కేసు విచారణ బదిలీ చెయ్యాలిని కాశీ హైకోర్టుకు మనవి చేశాడు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

వీఐపీల భార్యలు, కూతుర్లు, ఆంటీలు

వీఐపీల భార్యలు, కూతుర్లు, ఆంటీలు

వీఐపీల భార్యలు, వీఐపీల కూతుర్లు, అమ్మాయిలు, ఆంటీలతో పాటు అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడి వారితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలను కాశీ, అతని గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొంత మంది వీఐపీల అమ్మాయిలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేసిన కాశీ తరువాత వాళ్ల అమ్మలను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేశాడు. వీఐపీల భార్యలతో లింక్ పెట్టుకుని వారితో ఎంజాయ్ చేసి వారి పలుకుబడి ఉపయోగించిన కామాంధుడు కాశీ తమిళనాడులో అనేక ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్ మెంట్ లు, దందాలు చేశాడని ఇప్పటికే అనేక కేసులు నమోదైనాయి.

 లేడీ డాక్టర్ దెబ్బతో దిమ్మతిరిగింది

లేడీ డాక్టర్ దెబ్బతో దిమ్మతిరిగింది

తమిళనాడులోని నాగర్ కోవిల్ గణేశపురంకు చెందిన తంగపాండియన్ కుమారుడు కాశీ అలియాస్ సుజ్జి (26) మీద చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో మొదటి కేసు నమోదు చేశారు. తనను నమ్మించి మోసం చేసి అశ్లీల వీడియోలు తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో కొత్తార్ పోలీసులు కాశీని గత మే నెలలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ప్లేబాయ్ కాశీ జైల్లోనే ఉంటున్నాడు.

అమ్మాయిలు, ఆంటీలు ఒకరి తరువాత ఒకరు క్యూ

అమ్మాయిలు, ఆంటీలు ఒకరి తరువాత ఒకరు క్యూ

నాగర్ కోవిల్ కు చెందిన వివాహిత మహిళను రెండు సంవత్సరాల క్రితం నమ్మించి ఆమెను లొంగదీసుకుని రాసలీలలు సాగించాడని, తరువాత రహస్యంగా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర భారీ మొత్తంలో నగదు, లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేశాడని కాశీ మీద కేసు నమోదైయ్యిందని ఇప్పటికే కన్యాకుమరి జిల్లా ఎస్పీ ఎన్. శ్రీనాథ్ కోర్టుకు తెలిపారు. చెన్నై లేడీ డాక్టర్, నాగర్ కోవిల్ వివాహిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత కాశీ చేతిలో మోసపోయిన అమ్మాయిలు, వివాహిత మహిళలు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి కాశీ మీద కేసులు పెట్టడంతో అతను జైల్లో ఉన్నాడు.

కాశీ వలలో 100 మందికి పైగా బాధితులు

కాశీ వలలో 100 మందికి పైగా బాధితులు

నాగర్ కోవిల్ లోని కాశీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, ఆంటీలు, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అతని వెనుక చాల పెద్ద గ్యాంగ్ ఉందని వెలుగు చూసింది. సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్న కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసులు విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు స్థానిక పోలీసుల చేతి నుంచి ప్రత్యేక పోలీసుల చేతికి వెళ్లిపోయింది.

 కామాంధుడికి ఎలాంటి వ్యాపారాలంటే ?

కామాంధుడికి ఎలాంటి వ్యాపారాలంటే ?

కామాంధుడు కాశీకి నాగర్ కోవిల్ లోని అబ్జ్వర్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న డెసన్ జినో (19) అనే యువకుడు సహకరించాడని వెలుగు చూడటంతో పోలీసులు అతన్ని ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించారు. డెసన్ జినోకు క్రిమినల్ మైండ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డెసన్ జినోతో పాటు విదేశాల్లో ఉంటున్న స్నేహితులు కూడా అమ్మాయిలు, వివాహిత మహిళల రహస్య ఫోటోలు, పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వల వేసిన అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని కాశీ, అతని స్నేహితులు భూ దందాలు, స్కాంలు, సెటిల్ మెంట్లు, పోర్న్ వీడియోల వ్యాపారం చేశారని పోలీసు అధికారులు ఆరోపించారు.

లాయర్ల సంచలన నిర్ణయం

లాయర్ల సంచలన నిర్ణయం

కామాంధుడు కాశీ మీద ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడిన కాశీని విడిపించడానికి అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లాయర్లను ఆశ్రయించారు. అయితే కాశీ తరపున కేసు వాదించకూడదని నాగర్ కోవిల్ న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ గత మే నెలలో సంచలన నిర్ణయం తీసుకుంది. నాగర్ కోవిల్ లో నాలుగు నెలల నుంచి ఏ ఒక్క లాయర్ కూడా కాశీ కేసు వాదించడానికి ఇంతవరకు ముందుకురాలేదు. లాయర్లు సహాయం చెయ్యకపోవడంతో కాశీ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.

నా కేసు ఈ జిల్లాలోనే వద్దు సార్

నా కేసు ఈ జిల్లాలోనే వద్దు సార్

తన కేసును వేరే జిల్లాలోని కోర్టుకు బదిలి చెయ్యాలని కామాంధుడు కాశీ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన వాదనలు వినిపించడానికి మా జిల్లాలోని లాయర్లు ముందుకురాలేదని, పోలీసుల వాదనలే కోర్టు వింటోందని, తాను ఏ తప్పు చెయ్యలేదని, నా తరపు వాదనలు వినింపించడానికి లాయర్లు ముందుకు రావాలంటే కేసులు మరోక జిల్లాలోని కోర్టుకు బదిలీ చెయ్యాలని మనవి చేస్తూ కాశీ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

కోట్లు డబ్బులు ఉన్నా లాయర్లు కరువు

కోట్లు డబ్బులు ఉన్నా లాయర్లు కరువు

ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగానే పోలీసులు కోర్టులో సాక్షాలు సమర్పించారని, తన వాదనలు వినడానికి అవకాశం ఇవ్వాలని, అందకే కేసు విచారణ వేరే జిల్లాలోని కోర్టుకు బదిలి చెయ్యాలని కాశీ మదురై హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ కు మనవి చేశాడు. మొత్తం మీద నాగర్ కోవిల్ లోని వేలాది మంది లాయర్లు చేతులు ఎత్తేయడంతో జైల్లో ఉన్న కామాంధుడు కాశీ బతుకు బస్టాండ్ అయిపోంది. తమిళనాడులోని వేరే జిల్లాకు కేసు బదిలీ అయితే అక్కడైనా కాశీ కేసు వాదించడానికి ఎవరైనా లాయర్లు ముందు వస్తారా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి. కాశీ తండ్రి చికన్ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాధిస్తున్నాడు. ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఏం లాభం, కేసు వాదించడానికి లాయర్లు ముందుకురావాలి కదా అంటున్నారు ప్లేబాయ్ కాశీ బాధితులు.

English summary
Playboy: Nagercoil Kasi petition High Court Madurai Bench to change case to another district in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X