• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Playboy: నిన్న హీరో ఫోజులు, ఈ రోజు భిక్షగాడి గెటప్, పాపం 150 మంది ఉసురు ఊరికేపోతుందా ? డ్రామా !

|

చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: కాలేజ్ అమ్మాయి, వివాహిత మహిళలు, ఆంటీలు ఇలా వయసుతో తేడా లేకుండా 150 మంది జీవితాలతో చెలగాటం ఆడిన ప్లేబాయ్ కాశీ కథ మరీ దారుణంగా తయారైయ్యింది. 7 నెలలకు పైగా జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కాశీ చాలా సన్నగా అయ్యాడు. విలాసవంతమైన బైక్ లు, కార్లలో పక్కన అమ్మాయిలను కుర్చోబెట్టుకుని ఇంతకాలం ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి పబ్లిసిటీ తెచ్చుకున్న కాశీ ఇప్పుడు చూడటానికి ఓ పంచె కట్టుకుని, చేతిలో బ్యాగ్ పట్టుకుని భిక్షగాడి కంటే దారుణంగా తయారైనాడు. సీబీసీఐడీ అధికారులు విచారణ కోసం కాశీని కార్యాలయానికి తీసుకు వస్తున్న సమయంలో తీసిన అతని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెయిల్ కోసం కాశీ ఇలా డ్రామాలు ఆడుతున్నాడని బాధితులు అంటున్నారు.

illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!

కొత్త అమ్మాయి కేసుతో కలకలం

కొత్త అమ్మాయి కేసుతో కలకలం

తమిళనాడులో పీజీ పూర్తి చేసిన యువతిని 2019లో కాశీ వలలో వేసుకున్నాడు. కాశీ అరెస్టు కాకముందు వరకు పీజీ అమ్మాయితో కాశీ ఎంజాయ్ చేశాడు. ఎప్పటిలాగే అందర్నీ మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పీజీ అమ్మాని మోసం చేశాడు. ఎక్కడ తన పరువు పోతుందో అనే భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్న ఆ అమ్మాయి ఇటీవల తన రహస్య వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులను ఆశ్రయించడంతో సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.

సీబీసీఐడీ కస్టడీలో కాశీ

సీబీసీఐడీ కస్టడీలో కాశీ

నాగర్ కోయిల్ లోని 1వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీసీఐడి అధికారులు కాశీని కస్టడీలోకి ఇవ్వాలని మనవి చేశారు. ఐదు రోజుల పాటు కాశీని విచారణ చెయ్యడానికి సీబీసీఐడి అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో సీబీసీఐడీ అధికారులు జైల్లో ఉన్న కాశీని విచారణ చెయ్యడానికి అదుపులోకి తీసుకుని వారి కార్యాలయానికి తీసుకెళ్లారు.

 నిన్న జల్సాలు.... నేడు పేషంట్

నిన్న జల్సాలు.... నేడు పేషంట్

కొన్ని సంవత్సరాల పాటు కాశీ విలాసవంతమైన బైక్ లు, కార్లలో పక్కన అమ్మాయిలను కుర్చోబెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో కాశీ ఫోటోలు, అతని ఫోజులు చూసి చాలా మంది కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలు అతని వలలో పడిపోయారని ఇప్పటికే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఇప్పుడు కాశీ పేషంట్ లాగా తయారైనాడు. సీబీసీఐడీ అధికారులు వారి కార్యాలయానికి కాశీని పిలుచుకుని వెళ్లడానికి జైల్లో నుంచి అతన్ని బయటకు తీసుకు వచ్చారు.

చేతి ఎముకలు బయటకు.... చేతిలో సంచి

చేతి ఎముకలు బయటకు.... చేతిలో సంచి

ప్లేబాయ్ కాశీ అరెస్టు అయ్యి 7 నెలలకు పైగా అయ్యింది. 7 నెలలకు పైగా జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కాశీ చాలా సన్నగా అయ్యాడు. కాశీ ఇప్పుడు చూడటానికి భిక్షగాడి కంటే దారుణంగా తయారైనాడు. అయ్యప్పస్వామి భక్తులు కట్టుకునే రంగులో ఉన్న ఓ పంచె కట్టుకుని, చేతిలో సంచి పట్టుకున్న కాశీ దీనంగా సీబీసీఐడీ కార్యాలయానికి వచ్చాడు.

ఏమి పాటు పడినావురా ?

ఏమి పాటు పడినావురా ?

సీబీసీఐడీ అధికారులు విచారణ కోసం కాశీని పోలీసు అధికారుల కార్యాలయానికి తీసుకు వస్తున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం ఏమి పాటు పడినావురా ? ఇప్పుడు అనుభవించు అంటూ బాధితులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బెయిల్ కోసం కాశీ ఇలా డ్రామాలు ఆడుతున్నాడని బాధితులు అంటున్నారు.

150 మంది జీవితాలు నాశనం చేసిన కాశీ

150 మంది జీవితాలు నాశనం చేసిన కాశీ

ప్లే బాయ్ కాశీ ఇప్పటి వరకు సుమారు 150 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తొవ్వేకొద్ది కాశీ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే కొందరు పెద్దల కుటుంబ సభ్యులు కాశీ వలలో పడటంతో వాళ్లు అతని మీద ఫిర్యాదు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాశీకి బెయిల్ ఇప్పించకూడదని ఇప్పటికే లాయర్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
Playboy: Tamil Nadu Nagercoil Kasis look becoming change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X