చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Modi Birthday: కింద టపాసులు, గాల్లో పేలిపోయిన బెలూన్లు, 10 సెకన్లలో కలకలం, 30 మందికి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ అంబత్తూరు/ మదురై: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు (birthday) వేడుకల సందర్బంగా అపసృతి చోటుచేసుకుంది. నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ ఓ వైపు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతుంటే బీజేపీ నాయకుడి పక్కనే కొందరు కార్యకర్తలు పెద్దపెద్ద బెలూన్లు చేతిలో పట్టుకుని ఉన్నారు. టపాకాయలు పేలుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తల చేతుల్లో గాల్లో వేలాడుతున్న 500 బెలూన్లు ఒక్కసారిగా ఢామాల్ ఢమాల్ అంటూ పేలిపోవడంతో రచ్చరచ్చ అయ్యింది. సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తల షర్టులను మంటలు వ్యాపించడంతో వారికి గాయాలైనాయి. దెబ్బకు బీజేపీ నాయకుల మీద కేసులు నమోదైనాయి. ఇప్పటికే బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షడు గుర్రపు స్వారీ చేశాడని ఆరోపిస్తూ ఓ కేసు నమోదైయ్యింది.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

గుర్రపుస్వారీ చేసిన అధ్యక్షుడు

గుర్రపుస్వారీ చేసిన అధ్యక్షుడు

ప్రధాని నరేంద్ర మోడీ 70వ పుట్టిన రోజు వేడుకనుల దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు మురుగన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చాల ఘనంగా నిర్వహించారు. చెన్నై సిటీలోని మెరినాబీచ్ లో బహుబాష నటి నమిత 600 కేజీల చేపలను పేదలకు పంచిపెట్టారు. చెన్నై బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర 700 కేజీల కేక్ కట్ చేశారు. ఈ సందర్బంలో తమిళనాడు శాఖ బీజేపీ అధ్యక్షుడు మురుగన్ గుర్రపు రథంలో వచ్చి ఆందర్నీ ఆశ్చర్యపరిచారు. అనుమతిలేకుండా కరోనా వైరస్ నియమాలు ఉల్లంఘించి భారీ ర్యాలీ నిర్వహించారని మురుగన్ మీద ఇప్పటికే కేసు నమోదైయ్యింది.

అసలే శివకాశి టపాసులు

అసలే శివకాశి టపాసులు

అంబత్తూరులోని నరేంద్ర మోడీ శివాలయం దగ్గర భారీగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. తమిళనాడు వ్యవసాయ శాఖ ఉపాధ్యక్షుడు ముత్తురామన్ ఆధ్వర్యంలో అంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా అంబత్తూరు బీజేపీ కార్యాలయం ముందు భారీగా బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు.

కింద టపాసులు... పైన బాణాసంచా ఢాంఢాం

కింద టపాసులు... పైన బాణాసంచా ఢాంఢాం

బీజేపీ నాయకుడు ముత్తురామన్ వచ్చిన సమయంలో బీజేపీ నాయకులు ఉత్సాహంతో మళ్లీ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ముత్తురామన్ కు రోజాపూలతో తయారు చేసిన గజమాల వేసి బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో హైడ్రోజన్ నింపిన సుమారు 500 బెలూన్లు బీజేపీ కార్యకర్తలు చేతుల్లో పెట్లుకుని ఉన్నారు. హైడ్రోజన్ నింపిన బెలున్లూ గాల్లో వేలాడుతున్నాయి. కింద ఢాంఢాం అంటూ శివకాశీ టపాసులు పేలుతున్న సమయంలో గాల్లో వేలాడుతున్న బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

10 సెకన్లలో పరుగో పరుగు

10 సెకన్లలో పరుగో పరుగు


బీజేపీ నాయకుడు ముత్తురామన్ నిలబడి ఉన్న చోటే బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో 10 సెకన్లలో రచ్చరచ్చ అయ్యింది. బెలూన్లు పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. బీజేపీ కార్యకర్తల షర్టులకు మంటలు వ్యాపించాయి. కొన్ని సెకన్లలో కలకలం రేగడంతో అప్పటి వరకు ఒక్కచోట నిలబడి ఉన్న బీజేపీ కార్యకర్తలు తలో దిక్కుకు పరుగు తీశారు.

Recommended Video

Top News Of The Day : Journalist Taken Into Custody For Passing Information To Chinese Intelligence
 30 మందికి గాయాలు, వీడియో వైరల్

30 మందికి గాయాలు, వీడియో వైరల్


బెలూన్లు పేలి మంటలు వ్యాపించడంతో ముత్తురామన్ తో పాటు సుమారు 30 మందికి చిన్నిచిన్న గాయాలైనాయి. గాల్లో బెలూన్లు పేలిపోయే సమయంలో అక్కడ ఉన్న వాళ్లు కొందరు అకస్మికంగా వీడియోలు తియ్యడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు ముత్తురామన్ పై అంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మామూలుగా బెలూన్లు గాల్లో తేలడానికి హిలియం గ్యాస్ నింపుతారని, అయితే బెలూన్లలో మోతాదుకు మించి హైడ్రోజన్ గ్యాస్ నింపడం వలనే బెలూన్లు పేలిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెలూన్లలో ఏ గ్యాస్ నింపారు అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
PM Modi Birthday: Over 30 BJP workers sustained minor injuries as helium balloons exploded during PM Modi's birthday celebrations on 17th September, in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X