చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్

|
Google Oneindia TeluguNews

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఫలితంగా- బలపరీక్షను ఎదుర్కొనబోతోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు మరింత బెడిసి కొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది.

కదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజంకదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజం

ఈ పరిణామాల మధ్య అసెంబ్లీలో విశ్వస పరీక్షను నిర్వహించడానికి ముందే- తన పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రంతా ఆయన ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తాజా రాజీనామాల అనంతరం- 26 మంది సభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల బలం 14.

Puducherry CM Narayanaswamy may quit ahead of vote

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 13. ప్రతిపక్ష ఎన్ఆర్ కాంగ్రెస్-7 ఏఐఏడీఎంకే-4, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభించినట్టయింది. ఈ పరిస్థితుల్లో ఓటమి తప్పదని భావిస్తోన్న ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలపరీక్షకు మెుందు రాజీనామా చేయొచ్చనే ప్రచారం సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం.. పుదుచ్చేరి అసెంబ్లీ ఈ ఉదయం 10 గంటలకు సమావేశం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలపరీక్షను నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇదివరకే ఆదేశాలను జారీ చేశారు.

English summary
The spotlight will be on the beleaguered Puducherry Chief Minister V Narayanasamy as he is slated to face a trust vote in the Assembly on Monday. He may decide to put in his papers rather than face the Assembly where his government is clearly in a minority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X