• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పురిట్లోనే సంధి: రాజకీయాలకు రజినీకాంత్ గుడ్‌బై: తలైవా తాజా నిర్ణయం వెనుక: ఫ్యామిలీ డాక్టర్

|

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు కొద్దిరోజుల కిందటే ప్రకటించిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం సహకరించట్లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది తాత్కాలికమేనని.. కొంత విరామం, విశ్రాంతి తరువాత తాను మళ్లీ పాలిటిక్స్‌లో అడుగు పెడతానని రజినీకాంత్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ మూడు పేజీల లేఖను ఆయన కొద్దిసేపటి కిందటే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

దెబ్బకొట్టిన అనారోగ్యం..

తన తదుపరి సినిమా అణ్నాత్తీ కోసం రజినీకాంత్.. హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అధిక రక్తపోటుతో బాధపడ్డారు. మూడు రోజుల పాటు బంజారాహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన హైబీపీ అదుపులోకి రావడంతో డిశ్చార్జి అయ్యారు. అపోలో ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా చెన్నైకి చేరుకున్నారు. అణ్నాత్తీ సినిమా షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య రజినీకాంత్.. రాజకీయ రంగ ప్రవేశంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

31న అధికారిక ప్రకటన చేయాల్సి ఉండగా..

31న అధికారిక ప్రకటన చేయాల్సి ఉండగా..


ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ నెల 31వ తేదీన రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. పార్టీ పేరును కూడా అదే రోజు వెల్లడిస్తానంటూ ఇదివరకు ఆయన తెలిపారు. జనవరిలో పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ప్రకటించడంతో పాటు క్రియాశీలక సభ్యత్వాలను చేపడతామని రజినీకాంత్ ఇదివరకు తెలిపారు. ఆయన పెట్టబోయే పార్టీ పేరు మక్కల్ సేవై కచ్చి (Makkal Sevai katchi) గా నిర్ధారించే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల గుర్తును ఆటోగా ఖరారు చేయొచ్చంటూ వార్తలు వెలువడ్డాయి.

ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్యామిలీ డాక్టర్..

ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్యామిలీ డాక్టర్..

దీనితో ఇక ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే మిగిలిపోయిందంటూ అభిమానులు సంబర పడ్డారు. అనంతరం ఆయన అణ్నాత్తీ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చారు. షూటింగ్ కొనసాగుతోన్న సమయంలోనే.. సెట్‌లో ఎనిమిందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. హైబీపీతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. హైబీపీ ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రమాదకరమని ఆయన కుమార్తెలు, సన్నిహితులు సలహా ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని రజినీకాంత్ నిర్ణయించారని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నాటికి రానట్టే..

అసెంబ్లీ ఎన్నికల నాటికి రానట్టే..


వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి-ఏప్రిల్‌ మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతోంది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార బరిలోకి దిగేశాయి కూడా. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొత్తుల కోసం పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రజినీకాంత్ విశ్రాంతి తీసుకోవాల్సి రావడం వల్ల.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు దాదాపు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Rajinikanth Political party doors closed due to his ill health:Thaliva releases statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X