• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Second wife: ఫస్ట్ భార్య ఎస్కేప్, ప్రియుడి కోసం రెండో భార్య, ఛీ నా బతుకు చెడా, హైవేలో !

|

చెన్నై/తేన్ కాశీ/ కాశీ: పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్తకు చేదు అనుభవం ఎదురైయ్యింది. మొదటి భార్య లేచిపోవడంతో అతి కష్టం మీద అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు, భర్తకు వయసులో 18 ఏళ్లు తేడా ఉంది, యవ్వనంలో ఉన్న అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగిపోయింది. పదేపదే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్యకు పెళ్లికి ముందే ఓ ప్రియుడు ఉన్నాడని, ఇంకా వాళ్లు రహస్యంగా ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారని భర్తకు తెలిసిపోయింది. భర్త పుట్టింటికి వెళ్లి రాజీ చెయ్యడానికి ప్రయత్నించిన భర్తకు భార్య కుటుంబ సభ్యులు లస్సీ ఇచ్చి అక్కడి నుంచి అతన్ని కూల్ గా పంపించేశారు. ఛీ నా బతుకు చెడా అంటూ ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త హైరోర్డులో కాపుకాచి సినిమా ఫక్కీలో వేటకోడవలితో రెండో భార్యను అడ్డంగా నరికి చంపేశాడు.

Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !

ఫస్ట్ పెళ్లాం ఎస్కేప్

ఫస్ట్ పెళ్లాం ఎస్కేప్


తమిళనాడులోని తేన్ కాశీ జిల్లా పులియంగుడికి చెందిన కన్నన్ (38) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం అతని కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత కన్నన్ కాపురంలో చిచ్చురేపింది. కన్నన్ భార్య మంచి రోజు చూసి పెట్టాపేడా సర్దుకుని ఇంటి నుంచి పారిపోయి ఎవరితోనే లేచిపోయిందని సమాచారం.

 ఇద్దరి మద్య 18 ఏళ్లు తేడా

ఇద్దరి మద్య 18 ఏళ్లు తేడా

పెళ్లాం వదలేయడంతో కన్నన్ విరహంతో రగిలిపోయాడు. కన్నన్ బాధచూడలేని అతని కుటుంబ సభ్యులు అతి కష్టం మీద కేశవపురంలో నివాసం ఉంటున్న కస్తూరి (20) అనే అమ్మాయిని ఇచ్చి రెండో పెళ్లి చేశారు. కన్నన్ ను పెళ్లి చేసుకోవడం కస్తూరికి ఏమాత్రం ఇష్టం లేదు. కస్తూరి, కన్నన్ మధ్య వయసులో ఏకంగా 18 ఏళ్లు తేడా ఉంది.

అదిగో అంటే......ఇదిగో అంటూ పుట్టింటికి

అదిగో అంటే......ఇదిగో అంటూ పుట్టింటికి

కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కస్తూరికి ఆమె భర్త కన్నన్ కు రోజురోజుకి గొడవలు పెద్దవి అయ్యాయి. ప్రతినిత్యం భర్త కన్నన్ తో గొడవపడుతున్న కస్తూరి చీటికిమాటికి పుట్టింటికి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. పదేపదే కస్తూరి పుట్టింటికి వెళ్లిపోవడం, పెద్దలు రాజీ చేసి మళ్లీ ఆమెను అత్తారింటికి పంపించడం సర్వసాధారం అయిపోయింది.

రోజూ ఏందిరా ఈ ధరిద్రం

రోజూ ఏందిరా ఈ ధరిద్రం

10 రోజుల క్రితం మళ్లీ కస్తూరి భర్తతో గొడవపడి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య కస్తూరి పదేపదే పుట్టింటికి వెళ్లిపోతుండటంతో కన్నన్ సొంత ఊరిలో చాలా ఇబ్బందిగా తిరగడం మొదలుపెట్టాడు. ఎలాగైనా తన రెండో భార్య కస్తూరిని లొంగదీసుకుని ఆమె కోరికలు అన్ని తీర్చి తనతోనే ఉండేలా చేసుకోవాలని, నిత్యం జరుగుతున్న ఈ ధరిద్రానికి చెక్ పెట్టాలని భర్త కన్నన్ డిసైడ్ అయ్యాడు.

 లస్సీ ఇచ్చి చల్లగా పంపించేశారు

లస్సీ ఇచ్చి చల్లగా పంపించేశారు

రెండో భార్య కస్తూరికి నచ్చచెప్పి తన ఇంటికి తీసుకురావాలని ఆమె భర్త కన్నన్ భార్య పుట్టింటికి వెళ్లాడు. రెండో భార్య కస్తూరికి నచ్చచెప్పి ఆమెను వెంట పిలుచుకుని వెళ్లాలని కన్నన్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కస్తూరి మాత్రం తాను రానేరాను అని తేల్చిచెప్పింది. తరువాత మేమే కస్తూరికి నచ్చచెప్పి మీ ఇంటికి పంపిస్తామని ఆమె కుటుంబ సభ్యులు అల్లుడు కన్నన్ కు చల్లటి లస్సీ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.

ప్రియుడిని కలిసిన భార్య ?

ప్రియుడిని కలిసిన భార్య ?

బైక్ లో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన కన్నన్ హైవే రోడ్డు పక్కన వరుసగా లారీలు పార్క్ చేసిన విషయం గుర్తించి ఆ వాహనాల వెనుక బైక్ నిలిపాడు. రెండు గంటల తరువాత కస్తూరి స్కూటర్ లో ఆమె ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ప్రియుడిని కలిసిన తరువాత కొన్ని గంటల తరువాత హైవే రోడ్డు మీద నుంచి కస్తూరి ఆమె ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది.

హైవేలో స్కెచ్....రెండో భార్యను అడ్డంగా నరికేశాడు

హైవేలో స్కెచ్....రెండో భార్యను అడ్డంగా నరికేశాడు

హైవే రోడ్డులో లారీల సమీపంలోకి భార్య కస్తూరి వచ్చిన వెంటనే ఆమెను భర్త కన్నన్ అడ్డగించాడు. ఒక్కసారి దాడి చెయ్యడంతో కస్తూరి స్కూటర్ లో నుంచి కిందపడిపోయింది. అదే సమయంలో బైక్ లో వెంట తెచ్చుకున్న వేటకోడవలి తీసుకున్న కన్నన్ భార్య కస్తూరి మెడ, తల, శరీరంలోని అనేక ప్రాంతాంలో నరకడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 ఇద్దరు పెళ్లాలు ఔట్...... చేతిలో చిప్ప మిగిలింది

ఇద్దరు పెళ్లాలు ఔట్...... చేతిలో చిప్ప మిగిలింది

రెండో భార్య కస్తూరిని హత్య చేసిన కన్నన్ బైక్ లో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులు విషయం గుర్తించి కన్నన్ ను వెంటాడి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పెళ్లికి ముందే తన రెండో భార్య కస్తూరికి ప్రియుడు ఉన్నాడని, పెళ్లి తరువాత కూడా ఆమె కావాలనే తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, అందుకే చంపేశానని కన్నన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మొదటి భార్య లేచిపోవడం, రెండో భార్యను కన్నన్ హత్య చెయ్యడంతో అతని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కన్నన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించడంతో అతనికి ఇప్పుడు చేతిలో చిప్ప మిగిలింది.

English summary
Second wife: Husband attack and killed young girl near Sengottai in Thenkasi in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X