చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Controversy: మాస్క్ లేకుంటే ఇక్కడ కులం, గోత్రం చెప్పాలి, వీడియో వైరల్, ఏం పోయేకాలం వచ్చింది?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుపూర్: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో దేశంలో అనేక విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ అరికట్టడానికి ప్రతిఒక్కరూ కచ్చితంగా ముఖానికి మాస్క్ వేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు మనవి చేస్తూనే ఉన్నారు. మాస్క్ లు వేసుకోకుండా రోడ్ల మీదకు వచ్చే వారి నుంచి పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు ఫైన్ వసూలు చేస్తున్నారు. అయితే మాస్క్ పెట్టకోని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్న పోలీసులు నీ కులం ఏమిటి ?, నీ గోత్రం ఏమిటి ?, నువ్వు ఎక్కడ ఉంటావు ? ఏం చేస్తుంటావు ? అంటూ తిక్కతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. మాస్క్ లు పెట్టుకోని వాళ్ల కులం గురించి పోలీసులు ఆరా తీస్తున్న సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పోలీసులకు ఏం పోయేకాలం వచ్చింది ? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 వెయ్యి రూపాయలు ఫైన్, రోడ్డు మీద గుంజీలు

వెయ్యి రూపాయలు ఫైన్, రోడ్డు మీద గుంజీలు


కరోనా వైరస్, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీద విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఆకతాయిలకు కళ్లెం వెయ్యడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా మాస్క్ లు వేసుకోకుండా రోడ్ల మీదకు వస్తే ఒక్కొక్కరి నుంచి రూ. 1, 000 వరకు అపరాద రుసుం (ఫైన్) వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పదేపదే మాస్క్ లు వేసుకోకుండా రోడ్ల మీదకు వచ్చిన వారికి గుణపాఠం చెప్పడానికి వారితో అందరి ముందు నడిరోడ్డులో గుంజీలు తీయించిన విషయం తెలిసిందే.

తమిళనాడు పోలీసులు వెరైటీ

తమిళనాడు పోలీసులు వెరైటీ

తమిళనాడు పోలీసులు కరోనా వైరస్ ను అరికట్టడానికి చాలాచాలా కొత్త ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. మాస్క్ లు వేసుకోకుండా బయటకు వచ్చినా, ఒకే బైక్ లో ముగ్గురు వెళ్లినా భారీ మొత్తంలో ఫైన్ వసూలు చేశారు. ఇక మాస్క్ లు వేసుకోకుండా బైక్ లో ముగ్గురు, నలుగురు ప్రయాణించిన సందర్బాల్లో వారిని పట్టుకుని అంబులెన్స్ లో కరోనా పేషెంట్లు ఉన్నారని చెప్పి అందులో వారిని నెట్టేసి ప్రజలకు భయం పుట్టించిన విషయం తెలిసిందే.

మాస్క్ లేకుంటే కులం, గోత్రం చెప్పాలి

మాస్క్ లేకుంటే కులం, గోత్రం చెప్పాలి

తమిళనాడులోని తిరుప్పూర్ పోలీసులు వివాదానికి కేంద్రబింధువు అయ్యారు. మాస్క్ లు లేకుండా బయట సంచరిస్తున్న ప్రజలు అడ్డుకుని వారికి భారీ మొత్తంలో ఫైన్ వేస్తున్నారు. ఇంతటితో మాస్క్ లు వేసుకుని ప్రజలను పోలీసులు వదిలిపెట్టడం లేదు. నీది ఏ కులం ?, గోత్రం ఏమిటి?, నువ్వు ఎక్కడ ఉంటావు ? ఏం పని చేస్తుంటావు ? అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 వీడియో వైరల్, శాపనార్థాలు

వీడియో వైరల్, శాపనార్థాలు

సార్ మాస్క్ కు, మా కులానికి ఏమిటి సంబంధం అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వారి స్టైల్లో సమాధానాలు ఇస్తున్నారు. తిరుప్పూర్ పట్టణంలో పోలీసులు అనేక మందిని అడ్డుకుని మీరు ఎందుకు మాస్క్ లు వేసుకోలేదు, మీ కులం ఏమిటి అని ప్రశ్నిస్తున్న సమయంలో కొందరు బాధితులు సహనం కోల్పోయి పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వారి మొబైల్ లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. ఈ పోలీసులకు ఏం పోయేకాలం వచ్చింది ? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Recommended Video

Donald Trump Walks Out Of News Conference After Reporter Asks Question || Oneindia Telugu
బహిరంగంగా కులం గురించి అడుగుతారా ?

బహిరంగంగా కులం గురించి అడుగుతారా ?

బహిరంగంగా ఎవ్వరినీ వారి కులం గురించి ప్రశ్నించరాదని ప్రభుత్వాలు చెబుతున్నా తిరుప్పూర్ పోలీసులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయం పై పోలీసు అధికారులకు తెలియడంతో కులం గురించి ప్రశ్నించిన పోలీసుల వివరాలు తెలుసుకుని వారి నుంచి వివరణ కోరుతున్నారని తెలిసింది. మొత్తం మీద మాస్క్ కు, కులానికి లింక్ పెట్టిన తిరుప్పూర్ పోలీసులు వివాదానికి కేంద్రబింధువు అయ్యారు.

English summary
Shock: A Controversy was erupted over the Tiruppur Police asking caste for without wearing Mask in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X