చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. వీళ్లు మామాలొల్లు కాదుగా.. బంగారం పేస్ట్‌గా చేసి, మలద్వారంలో కూడా.. 4.15 కిలోలు..

|
Google Oneindia TeluguNews

బంగారం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమార్కులు రకరకాలుగా గోల్డ్ తీసుకొస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్మగ్లర్లు ఎన్ని విధాలుగా ట్రై చేసినా.. సిబ్బంది మాత్రం డేగా కళ్లతో పట్టుకుంటున్నారు. షూ లేస్, పొట్ట, సున్నిత ప్రాంతాల్లో కూడా బంగారం తీసుకొచ్చిన సందర్భాలు ఇదివరకే చూశాం. చెన్నైలో ఓ ప్రయాణికుడు బంగారం పేస్ట్ చేసి.. తినేసిన వైనం బయటపడింది.

ఏడుగురిపై అనుమానం

ఏడుగురిపై అనుమానం


ఇటీవల దుబాయ్, షార్జా నుంచి కొందరు ప్రయాణికులు వచ్చారు. వారి కదలికలపై తొలి నుంచి కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అలా ఏడుగురు బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. అయితే వారు బంగారం కరిగిందచి పాలిథిన్ (రబ్బర్) కవర్‌లో పెట్టి మరీ తినేశారు. అలా ఏడుగురిని స్కాన్ చేయగా 4.15 కిలోల బంగారం కనిపించింది. దీని విలువ రూ.2.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వారిలో కొందరు బంగారంతో ఉన్న బిల్లలు కడుపలో దాయగా.. మరికొందరు మలద్వారంలో ఉంచుకున్నారని పోలీసులు తెలిపారు. వారు విమానంలో ఎక్కడానికి ముందే బంగారం తినేశారని తెలిపారు.

ఆస్పత్రికి తరలింపు

ఆస్పత్రికి తరలింపు

బంగారం తీయడానికి వారిని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారిలో ఉన్న బంగారం తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పూర్తి కావడానికి 8 రోజుల సమయం పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

అక్రమ రవాణా..

అక్రమ రవాణా..

ఆ తర్వాత 8 బాండల్స్ 61 క్యాపుల్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1.8 కిలోల బంగారం, విలువ రూ.51.36 లక్షలు ఉంటుందని చెప్పారు. 3 బంగారపు గొలుసులు, 8 బంగారం బిస్కట్లు, 8 ఉంగరాలు, 2 బంగారపు పేస్ట్ ఉందని తెలియజేశారు. దీని మొత్తం విలువ రూ.30.64 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఇవీ హ్యాండ్ బ్యాగ్, ప్యాంట్ ప్యాకెట్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

English summary
Chennai Air Customs has seized 4.15 kg gold worth over Rs 2.17 crore at the airport here and arrested seven people after busting a smuggling racket
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X