చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Super: ప్రధానితోనే సాధ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, కాంగ్రెస్, డీఎంకే అడ్రస్ గల్లంతు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: మేము ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకే మద్దతు ఇస్తాం, బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, మా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవు, ఇది తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి క్లారిటీ. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో దేశం అభివృద్దిలో దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వలన తమిళనాడుకు మంచి జరుగుతుంది, అందుకే 2021 తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో పాటు కాంగ్రెస్ కు సినిమా చూపించి మరోసారి వాళ్లను ఇంటికే పరిమితం చేస్తామని పళనిస్వామి అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెన్నైలో ఉన్న సమయంలో ఆయన ముందే తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

AIADMK Alliance With BJP To Continue చెన్నైలో అమిత్ షా... తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

మొన్న చిత్తుగా ఓడిపోయారు

మొన్న చిత్తుగా ఓడిపోయారు

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ. బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీ, కాంగ్రెస్, మరికొన్ని చిన్నిచిన్న పార్టీలు కలిసి లోక్ సభ ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించి ఎవ్వరూ ఊహించని విధంగా అనేక సీట్లలో విజయం సాధించాయి.

అమిత్ షా సమక్షంలో సీఎం క్లారిటి

అమిత్ షా సమక్షంలో సీఎం క్లారిటి

వివిద అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడానికి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా శనివారం చెన్నై చేరుకున్నారు. చెన్నైలో శనివారం వివిద అభివృద్ది పనులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో క్లారిటీ ఇచ్చారు.

మోదీ మంత్రంతో అసెంబ్లీ ఎన్నికలు

మోదీ మంత్రంతో అసెంబ్లీ ఎన్నికలు

2021 తమిళనాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపుతో దేశం అభివృద్దిలో దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వలన తమిళనాడుకు మంచి జరుగుతుంది, అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి వివరించారు.

డీఎంకే. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు

డీఎంకే. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు


గత 9 సంవత్సరాల నుంచి తమిళనాడులో ప్రజలకు సేవ చేసే అవకాశం అన్నాడీఎంకే పార్టీకి దక్కిందని సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని సీఎం ఎడప్పాడి పళనిస్వామ ధీమా వ్యక్తం చేశారు. జయలలిత ఆశీస్సులు, మోదీ పనితనంతో తమిళనాడులో వరుసగా మూడోసారి అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అమ్మ, కలైంజర్ లేకుండా మొదటిసారి

అమ్మ, కలైంజర్ లేకుండా మొదటిసారి

తమిళనాడు రాజకీయాలు అంటే టక్కున చెప్పే పేర్లు జయలలిత, కరుణానిధి పేర్లు. 2016లో జయలలిత, 2018లో కలైంజర్ ఎం. కరుణానిధి మరణించారు. జయలలిత, కరుణానిధి లేకుండా మొదటిసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో పాటు కాంగ్రెస్ కు సినిమా చూపించి మరోసారి వాళ్లను ఇంటికే పరిమితం చేస్తామని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటన సందర్బంగా తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆయన సమక్షంలోనే 2021 తమినాడు అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై పక్కా క్లారిటీ ఇచ్చారు.

English summary
Super: Lok Sabha AIADMK election alliance will be continue in 2021 Tamil Nadu assembly elections, says CM Edappadi Palaniswami in front of Amit Shah in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X