• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Rajinikanth పార్టీ తెలిసిందహో: "ఆటో" ఎక్కిన భాష: ఫ్యాన్స్‌కు పండగే..!

|

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. దీనికి అవసరమైన ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇన్నేళ్లుగా ఊగిసలాట ధోరణిని కనపరిచిన.. దానికి చెక్ పెట్టారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు వెల్లడించారు. దీనిపై ఈ నెల 31వ తేదీన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. దీనితో ఇన్నాళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై కమ్ముకున్న అనుమానపు మేఘాలు తేలిపోయినట్టయింది.

  #MakkalSevaiKatchi : Rajinikanth Names His Party, Auto Rickshaw Its Symbol
  పార్టీ పేరు ఇదే?

  పార్టీ పేరు ఇదే?

  రజినీకాంత్ పార్టీ మక్కల్ సేవై కచ్చి (Makkal Sevai katchi) గా నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే.. ప్రజా సేవ పార్టీ అని అర్థం. ఎన్నికల గుర్తును ఆటోగా ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులకు ప్రతిపాదనలను పంపించినట్లు తమిళ మీడియా వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని తెలిపింది. ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చని సమాచారం. ఇదివరకు రజినీకాంత్ ఎన్నికల గుర్తు సైకిల్‌గా ఉండొచ్చంటూ వచ్చిన వార్తలు పుకార్లేనని తేలిపోయినట్లు అభిప్రాయపడింది.

  ఆ రెండింటినీ తిరస్కరించిన ఈసీ..

  ఆ రెండింటినీ తిరస్కరించిన ఈసీ..

  నిజానికి- రజినీకాంత్ తన పార్టీ పేరును మక్కల్ శక్తి కజగంగా నిర్ధారించాలని భావించారు. ఈ పేరును అనుమతించాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలను పంపించారు. దీన్ని ఈసీ తిరస్కరించినట్లు తమిళ మీడియా చెబుతోంది. అలాగే- `బాబా ముద్ర`ను ఎన్నికల గుర్తుగా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. నిబంధనల ప్రకారం ఈసీ దీనికి అంగీకరించలేదని పేర్కొంది. .బాబా ముద్రకు బదులుగా ఆటోను కేటాయించినట్లు పేర్కొంది. రజినీకాంత్ నటించిన బాబా సినిమా ద్వారా ఆయన మేనరిజానికి సంబంధించిన ముద్ర అది.

  రజినీ మక్కల్ మండ్రం.. ఇక తెరమరుగు

  రజినీ మక్కల్ మండ్రం.. ఇక తెరమరుగు

  ఇదివరకు రజినీకాంత్ తన పేరు మీద పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. రజినీ మక్కల్ మండ్రం పేరు మీద పార్టీ రిజిస్టర్ అయింది. దీన్ని పక్కన పెట్టారు. రజినీ మక్కల్ మండ్రం పేరుకు బదులుగా మక్కల్ సేవై కచ్చి పేరును ఖరారు చేయాలని ఈసీకి ప్రతిపాదనలను పంపించారు. రజినీ మక్కల్ మండ్రం ఏ మాత్రం క్రియాశీలకంగా ఉండకపోవడంతో పాటు పెద్దగా అచ్చి రావట్లేదని రజినీకాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులను ఉటంకించి తమిళ మీడియా పేర్కొంది. రాజకీయ పార్టీని ప్రకటించారు గానీ.. దాన్ని క్రియాశీలకంగా మార్చలేకపోయారు.

  తాజా ప్రకటనతో అభిమానుల్లో ఆనందం..

  తాజా ప్రకటనతో అభిమానుల్లో ఆనందం..

  తాజాగా- తన రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్ స్పష్టత ఇవ్వడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తమ ఆశయాలు, అకాంక్షలకు అనుగుణంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఉంటుందని ఆశిస్తున్నారు. తమ తలైవాను ముఖ్యమంత్రిగా చూసుకుంటామని ఉద్వేగంతో చెబుతున్నారు. ఆటో రిక్షాను ఎన్నికల గుర్తుగా కేటాయించే అవకాశాలు ఉండటం వల్ల అభిమానుల ఆనందం రెట్టింపవుతోంది. ఆటో సామాన్య ప్రజలకు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. భాషా సినిమాలో రజినీకాంత్ ఆటోడ్రైవర్‌గా నటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మాస్‌ను ఆకట్టుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

  English summary
  Super Star Rajnikanth has registered the name Makkal Sevai katchi in the election commission and that they'll contest with Auto rickshaw as their party symbol.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X