• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఫస్ట్ డే..ఫస్ట్ సిగ్నేచర్..ఫ్రీ ట్రీట్‌మెంట్..ఫ్రీ ట్రావెల్: తొలిరోజే సంచలనాలకు తెర తీసిన స్టాలిన్

|

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్.. పలు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఆ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఊరట కలిగించే కీలక చర్యలను చేపట్టారు. తొలి రోజే అయిదు ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. అవన్నీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించినవే.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు ఆయన వాటిని అమలు చేశారు. కోవిడ్ రిలీఫ్ కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

2,000 రూపాయలతో..

2,000 రూపాయలతో..

తొలి విడతగా 2,000 రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు. దీనికోసం 4,200 కోట్ల రూపాయలు అవసరమౌతాయని అంచనా వేసినట్లు తెలిపారు. అక్కడితో ఆగలేదాయన. కరోనా వైరస్ కింద ప్రజలకు పొందే వైద్యాన్ని ఉచితం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తమిళనాడు ఎమ్‌ప్యానెల్‌లో ఉన్న ప్రైవేటు ఆసుప్రతులను దీనికి తీసుకొచ్చారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ నుంచి బయలుదేరిన ఆయన గోపాలపురంలోని తన తల్లి దయాళు అమ్మాళ్ ఇంటికి వెళ్లారు. అక్కడి మెరీనా బీచ్‌ సమీపంలో గల తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధిని సందర్శించారు. నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు.

ఛార్జ్ తీసుకున్న వెంటనే అయిదు ఫైళ్లపై సంతకాలు..

ఛార్జ్ తీసుకున్న వెంటనే అయిదు ఫైళ్లపై సంతకాలు..

తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్టాలిన్ ఇచ్చిన హామీ అది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీని అమలు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. దాన్ని నెరవేర్చారు. ఆ ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలపైనే తొలి సంతకం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ చికిత్స తీసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వసతి తమిళనాడులో అమల్లో ఉన్నప్పటికీ.. దాన్ని మరింత విస్తరింపజేశారు.

మహిళా ఉద్యోగులు

మహిళా ఉద్యోగులు

ఈ సౌకర్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయట్లేదని, తమిళనాడు ప్రభుత్వం బీమా కార్డు కింద ఎమ్‌ప్యానెల్ అయిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాల రేట్లను తగ్గించడానికి ఉద్దేశించిన ఫైల్‌పైనా సంతకం చేశారు. పాలు లీటర్ ఒక్కింటికి మూడు రూపాయలను తగ్గించారు. అలాగే- మహిళలు, విద్యార్థులు, ఇతర వృత్తి నిపుణులు సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ప్రతిపాదలపై సంతకం చేశారు.

ఈ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. గుర్తింపు పొందిన ఐడీ కార్డులను చూపించడం ద్వారా వారంతా ఆర్డినరీ సిటీ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి అవసరమైన 1200 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది.

English summary
Tamil Nadu Chief Minister MK Stalin has signed an order to provide Rs 4000 to each family as Corona relief. First installment of Rs 2000 will be provided in the month of May. Stalin also announced the State government will bear expenses for all corona related treatments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X