చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి వంటలక్క: 58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

|
Google Oneindia TeluguNews

వంట చేయాలంటేనే ఆమడ దూరం పారిపోయి అమ్మాయిలు ఉన్న నేటి రోజుల్లో చెన్నైలో ఒక చిన్నారి వంటలక్క 58 నిమిషాల్లో 46 వంటలు చేసి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అందరి పిల్లలు సెల్ ఫోన్లలో ఆటలకు పరిమితమైతే ఎస్.ఎన్.లక్ష్మి సాయి శ్రీ ఆమె బాలిక మాత్రం వంట పట్ల ఆసక్తి పెంచుకొని, వంట చేయడం మొదలు పెట్టింది. అలా గరిటె తిప్పిందో లేదో ఇలా యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

లాక్ డౌన్ సమయంలో తమిళనాడు విభిన్న సంప్రదాయ వంటకాలను నేర్చుకున్న బాలిక

లాక్ డౌన్ సమయంలో తమిళనాడు విభిన్న సంప్రదాయ వంటకాలను నేర్చుకున్న బాలిక

తమిళనాడు రాష్ట్ర విభిన్న సంప్రదాయ వంటకాలను నేర్చుకున్న ఎస్.ఎన్.లక్ష్మి సాయి శ్రీ తల్లి ఇచ్చిన శిక్షణతో వంట నేర్చుకుంది . లాక్ డౌన్ సమయంలో తన కుమార్తె వంట నేర్చుకోవడం ప్రారంభించిందని, ఆమె బాగా వంటలు చేస్తుండడంతో తాము ఆశ్చర్యపోయానని చెప్పిన తల్లి పాపతో వంటల్లో రికార్డు సృష్టించాలని ఆలోచన చేశామని పేర్కొన్నారు. అందులో భాగంగా వంటల్లో రికార్డు సృష్టించిన పాత ఘటనలను పరిశోధించిన లక్ష్మీ సాయి శ్రీ తండ్రి అంతకు ముందున్న రికార్డులను పరిశీలించారు.

58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు

58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు

కేరళకు చెందిన పదేళ్ల అమ్మాయి సాన్వి సుమారు 30 వంటలు వండినట్లు కనుగొన్నారు. దీంతో తన కుమార్తె కేరళకు చెందిన సాన్వి రికార్డును బద్దలు కొట్టాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా వంటలు చేయడం మొదలు పెట్టిన బాలిక కేవలం 58 నిమిషాలలో 46 రకాల వంటలు చేసి అందరితో ఔరా అనిపించింది. అంతేకాదు యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది .

లక్ష్మీ సాయి శ్రీ తన తల్లి చేస్తున్న వంటలతో, తనకు కూడా వంట చేయాలన్న ఆసక్తి పెరిగిందని, తల్లి ఇచ్చిన శిక్షణ తోనే తక్కువ సమయంలో ఎక్కువ వంటలు చేసి రికార్డు సృష్టించిన గలిగానని చెప్పుకొచ్చారు.

వంటలపై కుమార్తె చూపిస్తున్న ఆసక్తితోనే సాధ్యం అయ్యిందన్న తల్లి

వంటలపై కుమార్తె చూపిస్తున్న ఆసక్తితోనే సాధ్యం అయ్యిందన్న తల్లి

తాను యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు సంతోషంగా ఉందని చెప్పిన చిన్నారి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ వంటకాలు అన్ని నేర్చుకుంటానని పేర్కొన్నారు.

కుమార్తె వంటలపై చూపించే ఆసక్తి ని చూసి లక్ష్మీ సాయి శ్రీ తల్లి భర్తతో చెప్పానని పేర్కొన్నారు. దీంతో వంటలపై రికార్డర్ చేయాలన్న ఆలోచన వచ్చిందని, అందుకు తగినట్టుగానే లక్ష్మీ సాయి శ్రీ అతి తక్కువ సమయంలో ఎక్కువ వంటలు చేసి, తన వంటలతో చెన్నై నగరంలో ఘుమఘుమలాడించిందని తల్లి చాలా సంతోషంగా తెలిపారు.

అద్భుతాలు సృష్టించాలని ఆలోచన ఉంటే .. వంటల్లో అయినా ఇలా అద్భుతాలే

అద్భుతాలు సృష్టించాలని ఆలోచన ఉంటే .. వంటల్లో అయినా ఇలా అద్భుతాలే

అద్భుతాలు సృష్టించాలని ఆలోచన ఉండాలే కానీ వంటల్లో అయినా అద్భుతాలు సృష్టించవచ్చని లక్ష్మీ సాయి శ్రీ తన వంటలతో తేల్చిచెప్పింది. మొత్తానికి ఈ చిన్నారి వంటలకు గురించి తెలిసిన వారంతా తమ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ వంటలు నేర్చుకోమని బతిమాలుతున్నారట. లక్ష్మీ సాయి శ్రీని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది అమ్మాయిలూ వంట నేర్చుకుంటారో గానీ , చిన్నారి వంటలక్క పనితనానికి మాత్రం తమిళనాడు వాసులు శభాష్ అంటున్నారట!!

English summary
A girl from Tamil Nadu entered the UNICO Book of World Records by cooking 46 dishes in 58 minutes in Chennai on Tuesday. SN Lakshmi Sai Sri, in lock down time she developed an interest in cooking and she achieved world record .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X