చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌కు కరోనా పాజటివ్ అని తేలింది. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి యాజమాన్యం ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. ఆయనను హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరినట్లు తెలిపింది.

ఇంటివద్దనే గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్‌కు చికిత్స అందిస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే గవర్నర్‌కు కరోనా సోకిందని వైద్యులు తేల్చారు.

 Tamil Nadu Governor Banwarilal Purohit Tests Positive For COVID-19

ప్రస్తుతం కరోనా లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కావేరీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో 87 మంది సిబ్బంది కరోనా బారినపడిన మరుసటి రోజే పురోహిత్ ఆస్పత్రిలో చేరారు.

సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ సిబ్బందితోపాట ఇతర 147 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 87 మందికి కరోనా ఉందని తేలినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమిళనాడులో కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.

Recommended Video

నయనతార బ్రేకప్స్‌ పై వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు!! || Oneindia Telugu

ఇప్పటి వరకు తమిళనాడులో 2,51,738 మందికి కరోనా సోకగా, 56,738 యాక్టివ్ కేసులున్నాయి. 1,90,966 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,034 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
Tamil Nadu Governor Banwarilal Purohit has tested positive for COVID-19, a statement from a Chennai hospital said today. The Governor has been advised home isolation and he will be monitored by a team of doctors from the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X