చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్లికట్టుకు తమిళనాడు సర్కార్ ఓకే.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి, ప్రేక్షకుల సంఖ్యపై ఆంక్షలు..

|
Google Oneindia TeluguNews

పురాతన క్రీడ జల్లికట్టు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న.. వ్యాక్సిన్ మాత్రం ఇంకా రాలేదు. అయితే ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జల్టికట్లులో 300 మంది పోటీదారులు మాత్రమే పాల్గొనాలని, ఇందులో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని షరుత విధించింది. కరోనా నెగటివ్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ప్రేక్షకులపై కూడా ఆంక్షలు..

ప్రేక్షకులపై కూడా ఆంక్షలు..


జల్లికట్టును చూసే ప్రేక్షకుల సంఖ్యపై కూడా ఆంక్షలు విధించింది. 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని జల్లికట్టు నిర్వాహకులకు స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ పెట్టుకోవాలని, శానిటైజర్లు విధిగా ఉపయోగించాలని స్పష్టంచేసింది. జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మదురై తదితర ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు మిఠాయిలు తినిపించుకుని సంబరపడిపోయారు.

సంక్రాంతి తర్వాత..

సంక్రాంతి తర్వాత..

తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు నిర్వహిస్తారు. మదించిన గిత్తలను జనాల్లోకి వదిలి దాన్ని లొంగదీసే సాహసక్రీడే జల్లికట్టు. జల్లికట్టులో పాల్గొనే కొడె గిత్తలకు ప్రత్యేకమైన ఆహారం అందజేసి బలిష్టంగా తయారు చేస్తారు. వేగంగా దూసుకొస్తున్న గిత్తను అదుపు చేసేందుకు వేల సంఖ్యలో యువకులు హజరవుతారు. చిత్తూరులో సాహస క్రీడను నిర్వహిస్తారు.

ఎద్దు మెడకు ఉంగరం ధరించి

ఎద్దు మెడకు ఉంగరం ధరించి

తమిళనాడులో ఈ వేడుకలు పొంగల్ తర్వాత కనుమ రోజున నిర్వహిస్తారు. వేడుకలో ఎద్దు మెడకు ఒక ఉంగరాన్ని కడతారు. ఆ ఎద్దును రింగులోకి వదులుతారు. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల కిందట నుంచి ఆటను కొనసాగిస్తున్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం జల్లికట్టుగా పిలువబడే ఈ పేరు పూర్వం సల్లికట్టుగా ఉండేది. సల్లికట్టు అంటే గిత్త మెడలో బంగారం బాగా అలంకరించడం. గిత్తతో ఎవరైతే వీరోచితంగా పోరాడి ఆ బంగారాన్ని తీసుకొస్తారో వారే విజేతగా నిలుస్తారు.

కొమ్ములతో గాయపరచి

కొమ్ములతో గాయపరచి

అడ్డొచ్చినా వారిని కొమ్ములతో పొడిచి గాయపరుస్తుంది. కొందరు ఈ క్రీడలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతారు. దీంతో ఈ ఆటపై కోర్టులు నిషేధం విధించినా.. అక్కడ మాత్రం ఆగలేదు. గతంలో అనేక విమర్శల నేపథ్యంలో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. తమిళనాడులో నిరసనలు వ్యక్తమయ్యాయి. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమంటూ తమిళులు ఎలుగెత్తారు. తమిళనాడు ప్రభుత్వం చట్టసవరణ ద్వారా నిషేధాన్ని తొలగించింది. ప్రతి ఏటా తమిళ సంక్రాంతికి జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

English summary
government of Tamil Nadu issued guidelines for the conduct of Jallikattu in the state ahead of the 2021-Pongal season in January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X