చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రికి వ్యాక్సిన్: తొలిసారిగా రాజకీయ నేతకు: ఆ హోదాలో ఇంజెక్షన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పటి నుంచి గురువారం వరకు 10,43,534 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కలకు వ్యాక్సిన్ ఇంజెక్షన్లను ఇచ్చారు. ఈ ప్రక్రియ వారంలో నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలివిడతలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులకు వ్యాక్సిన్ వేయకూడదనే నిబంధన ఉంది.

తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాంతిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం

అయినప్పటికీ.. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విద్యాభాస్కర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఆయనకు ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆయనకు చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆయనకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేశారు. ఓ మంత్రిగా లేదా రాజకీయ నాయకుడి హోదాలో దేశంలో తొలిసారిగా వ్యాక్సిన్ వేయించుకోవడం ఇదే తొలిసారి.

 Tamil Nadu Health Minister Dr C Vijayabaskar takes Covaxin shot, says doing this as a doctor

దీనికి ఆయన వివరణ ఇచ్చారు. తాను డాక్టర్ హోదాలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. సీ విద్యాభాస్కర్.. వృత్తిరీత్యా డాక్టర్. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఓ ప్రొఫెషనల్ డాక్టర్‌గా వైద్యసేవలను అందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)లోనూ ఆయనకు సభ్యత్వం ఉంది. రాజకీయాలపై ఆసక్తితో ఏఐఏడీఎంకేలో చేరారు. పుదుక్కోట్టై జిల్లా విరాళిమలై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

ఎడప్పాడి పళనిస్వామి కేబినెట్‌లో కీలకమైన వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. డాక్టర్ హోదాలో తాను వ్యాక్సిన్ వేయించుకున్నానని విద్యాభాస్కర్ తెలిపారు. మంత్రిస్థాయిలో ఉన్న తాను వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల తోటి డాక్టర్లు, హెల్త్ వర్కర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టవుతుందని వ్యాఖ్యానించారు. కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని స్పష్టం చేశారు. కోవాగ్జిన్‌పై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో తాను ఆ వ్యాక్సిన్‌నే తీసుకున్నానని చెప్పారు.

English summary
Tamil Nadu Health Minister Dr C Vijayabaskar takes Bharat Biotech's Covaxin shot in Chennai. He tweets, 'I am doing this as a doctor and member of IMA. He further said that to instill confidence among Health Care Workers. I request all to get vaccinated and safeguard from Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X