• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి

|

కారణాలు ఏవైనప్పటికీ, జనవాసాల్లోకి చొరబడి కోతులు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ కోతుల బాధితులమే అనడం అతిశయోక్తికాదేమో. కోతుల బెడదకు సంబంధించి వందల కొద్దీ ఫిర్యాదులు నమోదవుతున్నా, వాటిని నియంత్రించే దిశగా సర్కారు ఇంచు కూడా కదలకపోవడమూ తెలిసిందే. కోతుల అరాచకత్వానికి నిదర్శనంగా ఎనిమిది రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే..

Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళిPulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి

కవలల్ని ఎత్తుకెళ్లిన కోతులు

కవలల్ని ఎత్తుకెళ్లిన కోతులు

తమిళనాడులోని తంజావూరు జిల్లా కేంద్రంలో గల రాంపూర్ రోడ్డు ప్రాంతంలో రాజు(29), భువనేశ్వరి(26) దంపతులు నివసిస్తున్నారు. పెయింట్ పనులు చేసుకునే రాజు దంపతులకు ఇప్పటికే 5ఏళ్ల పాప ఉంది. తాజాగా ఫిబ్రవరి 6న వీరికి మరో సంతానంగా కవల పిల్లలు పుట్టారు. నార్మల్ డెలివరీ కావడం, కవలలుగా పుట్టిన ఆడపిల్లలు ఇద్దరి ఆరోగ్యం సాధారణంగా ఉండటంతో వారు ఇంట్లోనే ఉండొచ్చని డాక్టర్లు సలహాఇచ్చారు. అలా కవలల్ని చూసుకుంటూ భువనేశ్వరి ఇంట్లోనే ఉంటోంది. కాగా, శుక్రవారం వాళ్ల ఇంటిపై రౌడీ కోతి మూక విరుచుకు పడి, 8రోజుల పసికందుల్ని ఎత్తుకెళ్లాయి...

వెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డివెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి

పెంకలు తొలగించి.. లోపలికి చొరబడి..

పెంకలు తొలగించి.. లోపలికి చొరబడి..

రోజూలాగే రాజు శుక్రవారం ఉదయం పనిలోకి వెళ్లగా, పిల్లలకు పాలిచ్చి పడుకోబెట్టిన తర్వాత 11 గంటల సమయంలో తల్లి భవనేశ్వరి పెరట్లోని బాత్రూమ్ కు వెళ్లింది. మరుక్షణంలోనే కోతుల దండు ఆ ఇంటిపైకి దూకింది. శబ్దాలు విన్న భువనేశ్వరి.. బాత్రూమ్ నుంచి పరుగున బయటికొచ్చేలోపే.. ఇంటి పైకప్పుగా ఉంచిన పెంకుల్ని తొగిచిన కోతులు.. చాపపై పడుకొని ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లాయి. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు బయటికొచ్చారు. అప్పటికే..

పోస్ట్ మార్టం రిపోర్టులో అనూహ్యం..

పోస్ట్ మార్టం రిపోర్టులో అనూహ్యం..

రెండుగా విడిపోయిన కోతుల గుంపు.. ఒక పాపను దూరంగా తీసుకెళ్లగా, మరో గుంపు కోతులు.. రెండో పాపతో ఇంటి పైకప్పుపైనే ఉండిపోయి. వాటి చేతుల్లో ఉన్న పాపను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పాపను ఇంటి పైకప్పుపైనే వదిలేసి కోతులు పరారయ్యాయి. ఆలోపే ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, గల్లంతైన పాప కోసం గాలించారు. చివరికి ఆ శిశువు.. ఇంటి వెనుకున్న నీటి కందకంలో స్పృహ కోల్పోయి కనిపించింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం అనూహ్య విషయాలను తెలిపారు...

కోతుల దాడిలో అరుదైన ఘటన..

కోతుల దాడిలో అరుదైన ఘటన..

చనిపోయిన శిశువు శరీరంపై కోతులు దాడి చేసినట్లుగానీ, గాయల ఆనవాళ్లుగానీ లేవని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే, పిల్లలు పుట్టి కేవలం 8 రోజులే అవుతున్నందున.. కోతులు అమాంతం ఎత్తుకెళ్లిన సమయంలో శిశువు కీళ్లు తొలగిపోయి ఉంటాయని, నీటిలో పడేసిన తర్వాత ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. కోతుల దాడికి సంబంధించి ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చినవాటిలో ఇది అత్యంత అరుదైన సంఘటన అని తంజావూరు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

రౌడీ కోతుల వేటకు స్పెషల్ టీమ్స్..

రౌడీ కోతుల వేటకు స్పెషల్ టీమ్స్..


తంజావూరులో కవల పిల్లల్ని కోతులు ఎత్తుకెళ్లడం, వారిలో ఒక శిశువు మరణించిందన్న వార్త తమిళనాట సంచలనం రేపింది. కోతుల నియంత్రణలో సర్కారు వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, భువనేశ్వరి-రాజు దంపతుల ఇంటిపై దాడికి పాల్పడిన రౌడీ కోతి మూకను గుర్తించి, బోన్లలో బంధించడానికి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పుట్టిన ఎనిమిది రోజులకే కవల పిల్లలో ఒకరు చనిపోవడంతో రాజ, భువనేశ్వరి దంపతులు, వారి బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

English summary
In a shocking incident, a tribe of monkeys reportedly sneaked into a tiled house near Thanjavur on Saturday and took away newborn twin baby girls. While one of the babies was rescued from the rooftop, the other was found in a moat, which died on the way to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X