Thanjavur: తంజావూరుకు పరుగు తీసిన సీఎం, అనుమతి లేకుండా ఊరేగింపు, అసలు ఏం జరిగిందంటే!
చెన్నై/తంజావూరు: తంజావూరులో ప్రతి సంవత్సరం నిర్వహించే రథోత్సవం ఎప్పటిలాగా ఈ సంవత్సరం జరిగింది. రథం ఉరేగింపులో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రాత్రి జరిగిన రథోత్సవంలో మహిళలు, పిల్లలు కూడా పాల్గోన్నారు. రథం ఊరేగింపు బుధవారం వేకువ జామున 3 గంటల వరకు జరిగింది. రథం ఆలయం దగ్గరకు వెలుతున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథానికి తగిలి 11 మంది సజీవదహనం అయ్యారు.
11 మంది మంటల్లో కాలిపోయారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. విద్యుత్ షాక్ తో రథం కాలి బూడిద అయ్యాంది. తంజావూరులో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ఎంకే. స్టాలిన్ తెలిపారు.
రథోత్సవం సందర్బంగా గ్రామస్తులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. తంజావూరు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చెయ్యాలని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాత్రి అందరి ఇళ్లల్లో పండుగ
తమిళనాడులోని టెంపుల్ టౌన్ తంజావూరుకు 8 కిలోమీటర్ల దూరంలో మంగళవారం రాత్రి కరిమేడు అప్పర్ ఆలయం ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్బంగా ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొనింది. తంజావూరులో ప్రతి సంవత్సరం నిర్వహించే రథోత్సవం ఎప్పటిలాగా ఈ సంవత్సరం జరిగింది. రథం ఉరేగింపులో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

అంతా సంతోషంగా ఉన్న సమయంలో!
రాత్రి జరిగిన రథోత్సవంలో మహిళలు, పిల్లలు కూడా పాల్గోన్నారు. రథం ఊరేగింపు బుధవారం వేకువ జామున 3 గంటల వరకు జరిగింది. రథం ఆలయం దగ్గరకు వెలుతున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథానికి తగిలి 11 మంది సజీవదహనం అయ్యారు. 11 మంది మంటల్లో కాలిపోయారు.

ఎవ్వరూ ఊహించలేదు
తీవ్రగాయాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు. విద్యుత్ షాక్ తో రథం కాలి బూడిద అయ్యాంది. ఈ ప్రమాదంలో మోహన్ (22), ప్రతాప్ (36), రాఘవన్ (24), రాఘవన్ తండ్రి అన్బళగన్ (60), నాగరాజ్ (60), సంతోష్ (15), రాజ్ కుమార్ (14), స్వామినాథన్ (56), గోవిందరాజ్ 45)తో పాటు మరో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.

పరుగు తీసిన తమిళనాడు సీఎం
తంజావూరులో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ఎంకే. స్టాలిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన ఊరిలో మంగళవారం రాత్రి పండుగ జరగడం, కొన్ని గంటల్లోనే ఊరు స్మశానంగా మారడంతో ఆక్కడి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

అనుమతి తీసుకోలేదు, అధికారులు
రథోత్సవం సందర్బంగా స్థానికులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. తంజావూరు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చెయ్యాలని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్, జిల్లా ఎస్పీ రవళి ప్రియా సంఘటనా స్థలానికి వెళ్లి గాయాలైన వారిని తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.