చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!

భూస్వామి ఆస్తి ఆయన కుమారుడికి వచ్చింది. తనకు ఆస్తిలో, ఇంటిలో, బంగారంలో వాటా కావాలని చెల్లెలు డిమాండ్ చేసింది. ఆస్తిలో భాగం ఇవ్వడానికి ఆమె అన్న నిరాకరించాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుపూర్/ బెంగళూరు: భూస్వామికి కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కూతురు కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది. భూస్వామి మనుమడు పొలిటికల్ లీడర్. అనారోగ్యంతో భూస్వామి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో ఆ భూస్వామి ఆస్తి ఆయన కుమారుడికి వచ్చింది. తనకు ఆస్తిలో, ఇంటిలో, బంగారంలో వాటా కావాలని చెల్లెలు డిమాండ్ చేసింది. అయితే ఆస్తిలో భాగం ఇవ్వడానికి ఆమె అన్న నిరాకరించాడు.

అన్నను కిడ్నాప్ చేసిన చెల్లెలు అతనికి నరకం చూపించింది. అన్న దగ్గర ఆస్తి పత్రాల్లో సంతాకాలు చేపించుకుని తరువాత వేరే రాష్ట్రంలో మద్యం వ్యసనం ఉన్న బానిసలు, మానసిక వ్యాధితో బాధపడున్నన వారు ఉంటున్న మెంటల్ ఆసుపత్రిలో అన్నను అతని సొంత చెల్లెలు చేర్పించడం కలకలం రేపింది.

magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు?magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు?

భర్తతో సంతోంగా కాపురం చేస్తోంది

భర్తతో సంతోంగా కాపురం చేస్తోంది

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని అవినాసి సమీపంలోని టెక్కలూరులో పొన్నుసామి నివాసం ఉంటున్నారు. పొన్నుస్వామికి శివకుమార్ అనే కుమారుడు, అంబిక అనే కుమార్తె ఉన్నారు. అంబికకు చాలా సంవత్సరాల క్రితం వివాహమైంది. భర్త వేలుచ్చామి, కుమారుడు గోకుల్‌తో కలిసి అంబిక పల్లాడం సీమపంలోని జ్ఞానోదయం పట్టణంలో నివసం ఉంటున్నది, అంబిక కుమారుడు గోకుల్ బీజేపీలో మంచి పదవిలో ఉంటూ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు.

కోట్ల ఆస్తికి వారుసుడు అయిన కొడుకు

కోట్ల ఆస్తికి వారుసుడు అయిన కొడుకు

కొన్నేళ్ల క్రితం పొన్నుసామి చనిపోవడంతో ఆయన ఆస్తులను శివకుమార్‌ పేరిట బదిలీ చేశారు. తండ్రి పొన్నుస్వామికి చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు శివకుమార్ వారసుడు అయ్యాడు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సుల్తాన్‌పేటలోని పెరుమనల్లూరులో ఏకంగా మూడు ఎకరాల 20 గంటల భూమి, ఒక ఇల్లు శివకుమార్‌ చేతికి వెళ్లిపోయింది. శివకుమార్ తో అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే శివకుమార్ పిల్లలు మాత్రం అతనితోనే ఉంటున్నారు.

ఆస్తి మీద కన్ను వేసిన అంబిక

ఆస్తి మీద కన్ను వేసిన అంబిక

గత ఏడాది అంబిక ఎంట్రీ ఇచ్చింది. తమ తల్లిదండ్రుల ఆస్తిని, బంగారం, ఇంటిని తనకు రాసివ్వాలని ఆమె అన్న శివకుమార్‌తో గొడవలు పడింది. అయితే ఆస్తిని చెల్లెలు అంబికకు ఇవ్వడానికి శివకుమార్ నిరాకరించాడు. తన అన్న శివకుమార్ కు సరైన బుద్ది చెప్పాలని అంబిక డిసైడ్ అయ్యింది. ఇదే ఏడాది జనవరి 25వ తేదీన అంబిక అన్నను కిడ్నాప్ చెయ్యడానికి స్కెచ్ వేసింది. అంబిక అన్న ఆ ఊరికి వస్తున్నాడని ముందుగానే స్కెచ్ వేసింది. శివకుమార్ అతని స్నేహితుడు వడివేలు ఇంటికి వెళ్లాడు.

అన్నను కిడ్నాప్ చేసిన చెల్లెలు

అన్నను కిడ్నాప్ చేసిన చెల్లెలు

శివకుమార్ చెల్లెలు అంబిక, ఆమె భర్త వేలుస్వామి, అతని పెద్ద కుమారుడు గోకుల్, మరికొందరు కలిసి శివకుమార్‌ను వడివేలు ఇంటిలోనే కట్టేసి మారుతీ ఎకో కారులో కిడ్నాప్ చేశారు. వడివేలు ఇంటి దగ్గర నుంచి అంబిక జ్ఞానోదయ నగరంలో ఆమె నివాసం ఉంటున్న ఇంటి వెనుకకు తీసుకెళ్లి అన్న శివకుమార్ కాలికి తాడు కట్టి అతన్ని సినిమా స్టేల్లో తల్లకిందులుగా వేలాడదీసింది. అన్న శివకుమార్ ను అంబికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కర్రలతో చేతితో చితకబాదేశారు. దెబ్బకు తట్టుకోలేక శివకుమార్ ఏం చెప్పినా వింటాను, నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తానని చెప్పాడు.

ఆస్తి మొత్తం బలవంతంగా రాపించుకున్న చెల్లెలు

ఆస్తి మొత్తం బలవంతంగా రాపించుకున్న చెల్లెలు

అంబిక, వేలుస్వామి, గోకుల్‌లు కలిసి శివకుమార్‌ను కిందకు దించారు. తరువాత 21 స్టాంప్ పేపర్లు మీద శివకుమార్ తో సంతకాలు చేయించుకున్నారు. శివకుమార్ దగ్గర ఉన్న బ్రాస్‌లెట్, 7 తులాల బంగారు చైన్, ఉంగరం, రోలెక్స్ వాచ్. రూ. 1. 50 లక్షల నగదు లాక్కొన్నారు. ఆస్తి మొత్తం అంబిక పేరు మీద రాస్తున్నట్లు ముందుగానే బాండు పేపర్లు తయారు చేసి శివకుమార్ దగ్గర తెలివిగా సంతకాలు చేయించుకున్నారు.

పిచ్చాసుపత్రిలో చేర్పించారు

పిచ్చాసుపత్రిలో చేర్పించారు

తరువాత రెండు కార్లలో శివకుమార్‌ను పిలుచుకుని బెంగళూరు బయలుదేరారు. శివకుమార్ వెంట అతని చెల్లెలు అంబికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. మార్గం మధ్యలో శివకుమార్‌ తో బలవంతంగా పీకలదాక మద్యం తాగించారు. స్పృహ కోల్పోయిన శివకుమార్ ను బెంగళూరులోని ఓ మానసిక రోగులు చికిత్స పొందుతున్న ఓ పిచ్చాసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారైనారు. మూడు రోజుల తరువాత శివకుమార్ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పాడు.

శివకుమార్ ను రక్షించిన పెంపుడు తల్లి, మేనమామ

శివకుమార్ ను రక్షించిన పెంపుడు తల్లి, మేనమామ

ఆసుపత్రి సిబ్బంది సహాయంతో శివకుమార్ తమిళనాడులో ఉన్న అతని పెంపుడు తల్లి వాసంతికి, మేనమామ రామమూర్తికి సమాచారం అందించారు. తరువాత వాసంతి, రామమూర్తి బెంగళూరు వెళ్లి శివకుమార్‌ను రక్షించారు. తమిళనాడు చేరుకున్న శివకుమార్ పల్లడం పోలీస్ స్టేషన్‌ లో అతని చెల్లెలు అంబిక, ఆమె భర్త వేలుస్వామి, అల్లుడు గోకుల్ తో పాటు అతన్ని కిడ్నాప్ చేసి దాడి చేసి నిలువు దోపిడీ చేసిన మరికొందరిపై ఫిర్యాదు చేశాడు.

పల్లడం పోలీసులు గోకుల్‌, వేలుస్వామిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అంబికతోపాటు మరికొందరి కోసం గాలిస్తుండగా అల్వోలికి చెందిన కిడ్నాపర్లు రియాస్కాన్‌, సాహుల్ అమీద్, అష్రాబ్‌ అలీ పోలీసులకు చిక్కారు. అయితే కింగ్ పిన్ అంబికా మాత్రం పోలీసులకు చిక్కలేదు. శివకుమార్ ను కిడ్నాప్ చెయ్యడానికి ఉపయోగించిన రెండు కార్లను పల్లడం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Chennai: The younger sister kidnapped and tortured her own elder brother for property worth crores of rupees. After confiscating the property, Brother was admitted to a mental hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X