• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: కారులో నా చెల్లెలి ప్యాంట్, నా బట్టలు చింపేశారు, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, నటి ఫైర్!

|

చెన్నై: ప్రముఖ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటి తనకు న్యాయం చెయ్యాలని మరోసారి పోలీసు అధికారులకు మనవి చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అందరి ముందు తన సోదరి బట్టలు ప్యాంట్ చింపేశాడని. కారులో అర్డనగ్నగా తన వీడియోలు తీసి రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని. తాను పెట్టిన కేసు ఉపసంహరించకపోతే చంపేస్తామని బెదరిస్తున్నాడని సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే ఆ నటి ఆమె ప్రియుడు, అతని స్నేహితుల మీద కేసు పెట్టడంతో రచ్చరచ్చ అయ్యింది.

Illegal affair: బెడ్ రూమ్ లో భార్య+బాయ్ ఫ్రెండ్, టెర్రాస్ లో లిక్కర్+ విషంతో భర్త, క్లైమాక్స్!Illegal affair: బెడ్ రూమ్ లో భార్య+బాయ్ ఫ్రెండ్, టెర్రాస్ లో లిక్కర్+ విషంతో భర్త, క్లైమాక్స్!

నటి లవ్ స్టోరి

నటి లవ్ స్టోరి

ప్రముఖ తమిళ టీవీ సీనియల్స్ లో నటిస్తున్న జెన్నీఫర్ అలియాస్ చిట్టి (24), ఓ టీవీ సిరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న నవీన్ కుమార్ అలియాస్ నవీన్ (25) అనే యువకుడు ప్రేమించుకున్నారు. నటి జెన్నీఫర్, నవీన్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో ఉండటంతో వారి పరిచయం ప్రేమగా మారింది. జెన్నీఫర్, నవీన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఏందిరా దేవుడా.... ఇంతకు ముందే నా లవర్ కు?

ఏందిరా దేవుడా.... ఇంతకు ముందే నా లవర్ కు?

పెళ్లి పనులు చూసుకుంటున్న పెళ్లి కొడుకు నవీన్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. 2019లోనే తన ప్రియురాలు జెన్నీఫర్ కు శరవణన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని నవీన్ కుమార్ కు తెలిసింది. కుటుంబ సమస్యలు, అభిప్రాయ విభేదాలు కావడంతో జెన్నీఫర్, శరవణన్ విడిపోయారని, ఇప్పుడు ఆమె నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉందని నవీన్ కు తెలిసిపోయింది.

ఎందుకు దాచిపెట్టారో చెప్పండి?

ఎందుకు దాచిపెట్టారో చెప్పండి?

జెన్నీఫర్, ఆమె మొదటి భర్త శరవణన్ విడాకుల కేసు కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందని తెలుసుకున్న నవీన్ రగిలిపోయాడు. నేరుగా పెళ్లి కుమార్తె జెన్నీఫర్ ఇంటి దగ్గరకు వెళ్లిన పెళ్లి కొడుకు నవీన్ నేను ఏమైనా బకరా గాడినా ?, జెన్నీఫర్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు ? అంటూ నవీన్ నానా హంగామా చేశాడు. నీకు పెళ్లి జరిగిన విషయం తన దగ్గర ఎందుకు దాచిపెట్టావో చెప్పాలని నవీన్ అతని ప్రియురాలి జెన్నీఫర్ మీద గొడవకు దిగాడు.

ఒకరి మీద ఒకరు దాడి?

ఒకరి మీద ఒకరు దాడి?

నవీన్ వెంటన అతన్ని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ కూడా వెళ్లి జెన్నీఫర్ కుటుంబ సభ్యులను అమ్మనా బూతులు తిట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ చాలిచాలని డబ్బులతో ఇబ్బంది పడుతున్న నిన్ను చూసి జాలిపడినందుకు నన్ను ఇంత అవమానిస్తావా అంటూ నటి జెన్నీఫర్ రెచ్చిపోయింది. ఆ సమయంలో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారని తెలిసింది. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు నా కారు గ్లాస్ అద్దాలు ద్వంసం చేశారని నటి జెన్నీఫర్ ఆరోపిస్తూ కేసు పెట్టింది.

మరోసారి కేసు పెట్టిన నటి

మరోసారి కేసు పెట్టిన నటి

జెన్నీఫర్ ఆమె ప్రియుడు నవీన్, అతని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పెళ్లి కొడుకు నవీన్, అతని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను చంపేస్తామని, నవీన్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని కొందరు తనను బెదరిస్తున్నారని ఆరోపిస్తూ నటి జెన్నీఫర్ మరోసారి చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

వాడు నీతిలేని కుక్క

వాడు నీతిలేని కుక్క

చెన్నై సిటీ పోలీసు కమిషన్ కార్యాలయం ముందు జెన్నీఫర్ మీడియాతో మాట్లాడింది. తన తండ్రి ఉదయ్ కుమార్, సోదరుడు ప్రవీణ్ కుమార్ మీద తన మాజీ ప్రియుడు నవీన్, అతని స్నేహితుడు కార్తికేయన్ దాడి చేశారని, కారులోనే వారిద్దరిని చితకబాదారని నటి జెన్నీఫర్ మీడియా ముందు ఆరోపించింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాలు రాకపోవడంతో ఖర్చుల కోసం తన దగ్గర నవీన్ ఇప్పటి వరకు రూ. 2. 50 లక్షలకు పైగా తీసుకున్నాడని, ఆ డబ్బులు ఇంకా తిరిగివ్వలేదని, వాడు నీతిలేని కుక్క అంటూ నటి జెన్నీఫర్ మండిపడింది.

నా చెల్లెలి ప్యాంట్, బట్టలు చింపేశారు

నా చెల్లెలి ప్యాంట్, బట్టలు చింపేశారు

కారులో వెలుతున్న తన సోదరి, తండ్రి ఉదయ్ కుమార్, సోదరుడు ప్రవీణ్ కుమార్ ను తన మాజీ ప్రియుడు నవీన్ అతని అనుచరులు అడ్డుకున్నారని, మహిళ అనే కనికరం లేకుండా తన సోదరి ప్యాంట్ తో పాటు ఆమె బట్టలు చింపేశారని, కన్న తండ్రి, సోదరుడి ముందు వాళ్లు అరాచకం చేశారని, ఆ సమయంలో వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నటి జెన్నీఫర్ ఆరోపిస్తోంది.

రూ. 5 లక్షల కోసం వీడియోతో బ్లాక్ మెయిల్

రూ. 5 లక్షల కోసం వీడియోతో బ్లాక్ మెయిల్

పెళ్లి చేసుకోవడానికి తాను నిరాకరిస్తే తన మీద నవీన్ దాడి చేశాడని నటి జెన్నీఫర్ ఆరోపించింది, తనను బలవంతంగా కారులో ఎక్కించి నా బట్టలు చింపేసి తాను అర్దనగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడని జెన్నీఫర్ ఆరోపించింది. తన అర్డనగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియలో పోస్టు చెయ్యకూడదు అంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని నవీన్ అతని స్నేహితులు బెదరిస్తున్నారని, వాళ్ల మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదరిస్తున్నారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశానని అన్నారు.

తన మీద దాడి జరిగిన సమయంలో చిక్కిన కొన్ని సాక్షాలు నేను పోలీసు అధికారులకు అందించానని నటి జెన్నీఫర్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద నటి జెన్నీఫర్ రాద్దాంతం మరోసారి రచ్చకెక్కడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Actress: TV Serial Actress Jenifer gives complaint in Commissioner of Police and she submitted all evidences to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X