• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

UPSC: మాజీ సీఎం మనుమరాలు, రాణి మొదటిసారి భోణి, నువ్వు గ్రేట్, తాత ఢిల్లీతో ఫైట్: పేరు నిలబెట్టు!

|

చెన్నై/ న్యూఢిల్లీ: ఆమె మాజీ సీఎం మనుమరాలు. అనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా చెయ్యగలరు. ఒక పార్టీ అధిష్టానం పూర్తిగా ఆమెకు మద్దతు ఇచ్చింది. ద్రవిడ కవిగా పేరు తెచ్చుకుని సొంత పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు త్యాగం చేసి ఢిల్లీ పెత్తనాన్ని సవాలు చేసి తమిళ ప్రజల గుండెల్లో నేటికి చెరగని ముద్రవేసుకున్నారు అన్నాదురై. అన్నాదురై పేరు చెబితో మాకు తెలీదు అని చెప్పే తమిళుడు ఈ భూమ్మిద లేదంటే అది నిజం. అలాంటి మాజీ సీఎం మనుమరాలు UPSC పరీక్షల్లో సత్తాచాటుకున్నారు. పేరులోనే కాదు చదువుల తల్లి సరస్వతి దగ్గర తాను రాణి అనిపించుకున్నారు. పృథ్విక రాణి మొదటిసారి యూపీఎస్ సీ పరీక్షలు రాసి టాప్ ర్యాంకుల జాబితాలో ఆమె పేరు నిలబెట్టుకున్నారు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

చదువుల తల్లి సరస్వతికి అందరూ సమానమే

చదువుల తల్లి సరస్వతికి అందరూ సమానమే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSE) పరీక్షలకు దేశంలోని విద్యావంతులు పోటీ పడ్డారు. యూపీఎస్ సీ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైనాయి. టాప్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు, బంధువులు ఈ యూపీఎస్ సీ పరీక్షల్లో సత్తాచాటుకున్నారు. దానికి తోడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, మద్య తరగతి ప్రజల పిల్లలు యూపీఎస్ సీ పరీక్షల్లో వారి సత్తానిరూపించుకుని చదువుల తల్లి సరస్వతికి అందరూ సమానమే అని నిరూపించకున్నారు.

మాజీ సీఎం మనుమరాలు

మాజీ సీఎం మనుమరాలు

యూపీఎస్ సీ పరీక్షల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు అనేక మంది విజయం సాధించారు. పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పాటు పేద కుటుంబం నేపథ్యం ఉన్న వారి పిల్లలు యూపీఎస్ సీ పరీక్షలు మంచి మార్కులు, మంచి ర్యాంకులు సాధించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన అన్నాదురై మనుమరాలు పృథ్విక రాణి (23) ఆమె సత్తా నిరూపించుకున్నారు.

మొదటిసారి మెరిసిన క్వీన్

మొదటిసారి మెరిసిన క్వీన్

అన్నాదురై మనుమరాలు పృథ్విక రాణి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివారు. ఎక్కడా తాను మాజీ సీఎం మనుమరాలు అని గర్వపడకుండా సామన్య ప్రజలతో కలిసిపోయిన పృథ్విక రాణి మొదటిసారి యూపీఎస్ సీ పరీక్షలు రాసి ఒకే దెబ్బకు జాతీయ స్థాయిలో 171వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అధికారి కావడానికి పృథ్విక రాణికి మంచి అవకాశం చిక్కినా ఆమె మాత్రం ఐపీఎస్ అధికారి కావాలని అనుకుంటున్నారని అన్నాదురై ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

అమ్మా నువ్వుగ్రేట్

అమ్మా నువ్వుగ్రేట్

పృథ్విక రాణి యూపీఎస్ సీ పరీక్షల్లో 171వ ర్యాంకు సాధించారని తెలుసుకున్న వెంటనే ఆమెను మొదట అభినందించింది డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడైన ఎంకే. స్టాలిన్. తమిళ ప్రజలు ప్రాణాలతో ఉన్నంత వరకు అన్నాదురైని మరిచిపోరని, అలాగే నిన్ను తమిళ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారని, మీ తాతలాగా నువ్వు ప్రజాసేవకు అంకితం కావాలని ఎంకే. స్టాలిన్ మాజీ సీఎం మనుమరాలు పృథ్విక రాణిని అభినందించారు.

 అన్నా లేకుంటే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు లేవు

అన్నా లేకుంటే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు లేవు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కాంజీవరం నటరాజన్ అన్నాదురై ( అన్నాదురై) పేరు తెలియని తమిళుడు ఉన్నాడంటే ఎవ్వరూ నమ్మరు. తమిళనాడు రాజకీయాలకు కొత్తరూపు తీసుకువచ్చిన అన్నాదురై ఢిల్లీ పెద్దలను శాసించారు. తమిళ ప్రజలు, ద్రవిడనాడులో పై మీ పెత్తనం ఏమిటి ? హిందీ బాష మాకు అవసరం లేదు అంటూ హిందీపై పోరాటం చేశారు అన్నాదురై. అన్నాదురై లేకుంటే ఈ రోజు తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (ఎంజీఆర్, జయలలిత), డీఎంకే పార్టీ (కరుణానిధి) లేవని ప్రతిఒక్క తమిళుడు అంటాడు.

తమిళనాడు ఫస్ట్ సీఎం

తమిళనాడు ఫస్ట్ సీఎం

మద్రాసు రాష్ట్రంగా ఉన్న దక్షిణా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాలుగా విడిపోయాయి. 1969లో తమిళనాడు రాష్ట్రం ఆవిర్భించిన తరువాత ఆ రాష్ట్రానికి అన్నాదురై మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ద్రవిడ ప్రజలపై ఢిల్లీ పెత్తనం ఎక్కువ అవుతోందని, ఈ కుళ్లు రాజకీయాలు తాను చూడలేనని అన్నాదురై ఆవేదన చెందారు.

మంచి మనిషికి వెన్నుపోటు

మంచి మనిషికి వెన్నుపోటు

కొన్ని సంవత్సరాల వరకు అన్నాదురై వెనుక ఉన్న కొందరు నేతలు ఆయనకు వెన్నుపోటు పొడవడానికి సిద్దం కావడంతో మీరు వద్దు, మీ సీఎం పదవి వద్దు అంటూ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల వెంటనడిచారు. ఆ రోజు హిందీ బాషపై మొదట పోరాటం చేసిన అన్నాదురై నేడు అదే హిందీ బాష మాకు వద్దు అని ఆయన పేరు ముందు పెట్టుకుని నేడు కొందరు రాజకీయ నాయకులు ఢిల్లీపై పోరాటం చేస్తున్నారు.

English summary
UPSC: Tamil Nadu's Farmer CM CN Annadurai's granddaughter takes 171 rank in UPSC exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X